6 కొత్త కలర్లలో : రాయల్ Enfield బుల్లెట్ 350.. ధర ఎంతంటే?

Submitted on 13 August 2019
Royal Enfield Bullet 350 gets six new colours, prices start at Rs 1.12 lakh

దేశీయ మోటార్ సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి కొత్త బుల్లెట్ మార్కెట్లోకి వచ్చింది. అదే.. రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ 350. మొత్తం 9 కలర్లతో అందుబాటులో ఉంది. ప్రారంభ ధర రూ.1.2లక్షలు (ఎక్స్ షోరూం). KS (కిక్ స్టార్ట్), ES (ఎలక్ట్రిక్ స్టార్ట్) రెండు వేరియంట్లలో ఎన్ ఫీల్డ్ బుల్లెట్ 350 సొంతం చేసుకోవచ్చు.

బుల్లెట్ KS వేరియంట్ ఫ్రెష్ కలర్ ఆప్షన్లలో బుల్లెట్ సిల్వర్, సాప్ హైర్ బ్లూ, ఓనిక్స్ బ్లాక్‌లో ఉంది. బుల్లెట్ 350ES వేరియంట్ బుల్లెట్ పేయింట్ స్కీమ్స్ అప్‌డేట్ అయింది. జెట్ బ్లాక్, రీగల్ రెడ్, రాయల్ బ్లూ కలర్లలో అందుబాటులో ఉంది. ఈ బుల్లెట్ 350 బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
Read Also : కొత్త క్లౌడ్ డేటా సెంటర్స్ : మైక్రోసాఫ్ట్‌తో రిలయన్స్ డిజిటల్ డీల్ 

దేశవ్యాప్తంగా రాయల్ ఎన్ ఫిల్డ్ డీలర్ షిప్ ల నుంచి రూ.5వేల బుకింగ్ పేమెంట్ ద్వారా బుల్లెట్ సొంతం చేసుకోవచ్చు. రాయల్ ఎన్ ఫీల్డ్ 350 ఎక్స్ షోరూం ధరతో అందించే వేరియంట్ ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి. 

ప్రారంభ ధర (Ex-Showroom) :
* బుల్లెట్ 350KS - ధర రూ.1.12లక్షలు 
* బుల్లెట్ 350ES - ధర రూ.1.27 లక్షలు

కొత్త కలర్ ఆప్షన్లు  : 
* బుల్లెట్ 350 KS - బ్లాక్, బుల్లెట్ సిల్వర్, సపాహైర్ బ్లూ, ఓనిక్స్ బ్లాక్
* బుల్లెట్ 350 ES - జెట్ బ్లాక్, రీగల్ రెడ్, రాయల్ బ్లూ, మెరూన్ అండ్ సిల్వర్ 

స్పెషిఫికేషన్లు ఇవే :
* బుల్లెట్ 350KS, ES ఇంజిన్లు ఒకే సింగిల్ సిలండర్ ఉంటుంది.
* 4-stroke, ట్విన్ స్పార్క్, ఎయిర్ కూల్డ్, 346cc ఇంజిన్ 
* 19.8bhp, 28Nm torque
* 5 స్పీడ్ కాన్స్ స్టెంట్ మెష్ ట్రాన్స్ మిషన్.
* సింగల్ డౌన్ ట్యూబ్ chassis
* టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ 
* ట్విన్ షాక్ అబ్సార్బర్స్ (రియర్)
* ఫ్రంట్ : 280 mm disc
* 153 mm drum (రియర్)
* single-channel ABS
Read Also :  జియో GigaFiber పోటీగా : Top 7 Broadband డేటా ప్లాన్లు.. ఆఫర్లు ఇవే

Royal Enfield Bullet
Bullet 350
six new colours
KS and ES

మరిన్ని వార్తలు