సాహో ది గేమ్ - టీజర్

Submitted on 13 August 2019
Saaho The Game Teaser

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ సాహో.. టెక్నికల్‌గా హై స్టాండర్స్‌తో తెరకెక్కించిన సాహో.. ఆగస్టు 30న తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో భారీగా విడుదల కానుంది. ఇటీవల రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు 'సాహో ది గేమ్' టీజర్ విడుదల చేశారు నిర్మాతలు. త్వరలో సాహో వీడియో గేమ్‌ మార్కెట్‌లోకి రానుంది.

'యాక్టివేటింగ్ జెట్ ప్యాక్.. గెట్ రెడీ టు ఫీల్ ది యాక్షన్ ఎట్ యువర్ ఫింగర్ టిప్స్ విత్ సాహో ది గేమ్'.. అంటూ కొద్ది రోజుల క్రితం ప్రకటించిన మూవీ టీమ్.. టీజర్ ద్వారా సాహో గేమ్ ఎలా ఉండబోతుందో చూపించింది. సినిమాలానే గేమ్‌ని కూడా భారీ యాక్షన్ ఎపిసోడ్‌లా డిజైన్ చేశారు. గేమ్‌లో ఇంట్రెస్టింగ్ రౌండ్స్‌తో పాటు రివార్డ్స్ కూడా ఉన్నాయి. సాహో టీ షర్ట్, సాహో కీచైన్, సాహో పోస్టర్, సాహో క్యాప్, మూవీ టికెట్, గోల్డ్ వంటి రివార్డ్స్ పొందుపరిచారు. ఆగస్టు 15న సాహో ది గేమ్ రిలీజ్ కానుంది.

Read Also : చాణక్య టీజర్ అప్‌డేట్..

భారీ అంచనాల మధ్య ఆగస్టు 30న సాహో వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. నీల్ నితిన్ ముఖేష్, జాకీష్రాఫ్, చుంకీ పాండే, ఎవెలిన్ శర్మ, మందిరా బేడి, లాల్, మహేష్ మంజ్రేకర్, టినూ ఆనంద్, వెన్నెల కిషోర్, బొమన్ ఇరానీ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి కెమెరా : మది, ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, ఆర్ట్ : సాబు సిరిల్, వీఎఫ్ఎక్స్ : కమల్ కణ్ణన్. 

Saaho The Game
Saaho The Game Teaser
Parbhas
Shraddha Kapoor
uv creations
Sujeeth

మరిన్ని వార్తలు