హాలీవుడ్ సినిమాలా సాహో టీజర్..

Submitted on 13 June 2019
Saaho Official Teaser : Telugu

ఎప్పటినుండో ఆకలిమీదున్న డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురు చూపులకు శుభం కార్డ్ పడింది.. కళ్లు కాయలు కాచేలా వేచి చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ ఆనందోత్సాహాలతో పండగ చేసుకునే సమయం ఆసన్నమైంది.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా, నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ సాహో టీజర్ రిలీజ్ అయ్యింది. ఇన్నాళ్లు అభిమానులు దేని గురించైతే వెయిట్ చేసారో దానికి వడ్డీతో కలిపి మరీ ఇచ్చింది సాహో టీమ్.. టీజర్ హాలీవుడ్ సినిమా స్థాయిలో ఉంది..

'భాదైనా, హ్యాపీనెస్ అయినా షేర్ చేసుకోవడానికి నాకెవరూ లేరు' అని శ్రద్ధా కపూర్ అంటుండగా, 'నేనున్నాను' అంటూ ప్రభాస్ ప్రామిస్ చెయ్యడంతో సాహో టీజర్ స్టార్ట్ అయ్యింది. హాలీవుడ్ రేంజ్ గూస్ బంప్స్ యాక్షన్ షాట్స్ మన టాలీవుడ్ ఆడియన్స్‌కు ఐ ఫీస్ట్‌ అనిపించేలా ఉన్నాయి.. లొకేషన్స్, విజువల్స్, ఆర్ ఆర్, ప్రభాస్, శ్రద్ధాల కెమిస్ట్రీ ఇలా ప్రతీదీ హైలెట్ అయ్యాయి టీజర్‌లో..

'అసలెవరు వీళ్లు.. అని శ్రద్ధా అడిగితే, ప్రభాస్ 'ఫ్యాన్స్' అనడం.. 'ఇంత వైలెంట్‌గా ఉన్నారు'.. అంటే.. 'డై హార్డ్ ఫ్యాన్స్' అని చెప్పడం డార్లింగ్ ఫ్యాన్స్‌కి విపరీతంగా నచ్చేస్తుంది.. ఓవరాల్‌గా అంచనాలను మించి ఆడికయన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది సాహో టీజర్.. సుజిత్ డైరెక్షన్‌లో, యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ సాహో ఆగష్టు 15న రిలీజ్ కానుంది.
 

Parbhas
Shraddha Kapoor
uv creations
Sujeeth

మరిన్ని వార్తలు