సాహో : ప్రభాస్ కొత్త పోస్టర్

Submitted on 12 June 2019
Saaho Teaser Tomorrow at 11:23 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జంటగా, సుజిత్ డైరెక్షన్‌లో, యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ ఫిలిం.. సాహో టీజర్ మరికొద్ది గంటల్లో రిలీజ్ కానుంది. ఇంతలో ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ ఇస్తూ ఓ న్యూ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్..

ప్రభాస్ బైక్‌పై వస్తున్న స్టిల్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా ఉంది. బ్యాగ్రౌండ్‌లో బీభత్సం చూస్తుంటే ఇది యాక్షన్ సీక్వెన్స్‌లో వచ్చే షాట్ అనిపిస్తుంది. జూన్ 13 ఉదయం 11 గంటల 23 నిమిషాలకు సాహో టీజర్ విడుదల చెయ్యనున్నారు. జూన్ 14నుండి సాహో టీజర్‌ను థియేటర్స్‌లో చూడొచ్చు.. త్వరలో ప్రభాస్, శ్రద్ధలపై ఆస్ట్రేలియాలో ఓ రొమాంటిక్ సాంగ్ షూట్ చెయ్యనున్నారు.

2019 ఆగష్టు 15న తెలుగుతో పాటు హిందీ, తమిళ్ భాషల్లో సాహో రిలీజ్ కానుంది. నీల్ నితిన్ ముఖేష్, జాకీష్రాఫ్, ఎవెలిన్ శర్మ, మందిరా బేడి, వెన్నెల కిషోర్, బొమన్ ఇరానీ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి కెమెరా : మది, ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, ఆర్ట్ : సాబు సిరిల్, వీఎఫ్ఎక్స్ : కమల్ కణ్ణన్.
 

Parbhas
Shraddha Kapoor
uv creations
Sujeeth

మరిన్ని వార్తలు