పోలీసుల సమక్షంలోనే ఆత్మహత్యాయత్నం..

08:15 - November 8, 2018

 విజయవాడ : నగరంలో  ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. సహచర విద్యార్థిని తనను ప్రేమించడం లేదని సాయిరెడ్డి అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు విచారిస్తుండగా మెడపై కత్తితో కోసుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన సాయిరెడ్డిని స్థానిక ఆస్పత్రిలో చేర్చారు.  లబ్బీపేటలోని సీఎంఎస్‌ కోచింగ్‌ సెంటర్‌లో ఈ ఘటన జరిగింది. కాగా మహబూబ్ నగర్ కు చెందిన సాయిరెడ్డి సహచర విద్యార్థిని ప్రేమించాడు. ఈ క్రమంలో దీపావళి రోజున ప్రపోజ్ చేయటంతో ఆమె అంగీకరించలేదనే మనస్తాపంతో కత్తి పట్టుకుని కోచింగ్ సెంటర్ కు వచ్చి నా ప్రేమ అంగీకరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటు హల్ చల్ చేశారు. దీంతో విద్యార్థులంతా కోచింగ్ సెంటర్ యాజమాన్యానికి తెలిపారు. దీంతో యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి సాయిరెడ్డికి కౌన్సిలింగ్ చేస్తుండగానే సాయిరెడ్డి తనవద్ద వున్న కత్తితో పోలీసుల సమక్షంలోనే గొంతుకోసుకున్నాడు. దీంతో ఖంగుతిన్న పోలీసులు సాయిరెడ్డిని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. 

 

Don't Miss