గాడ్ బ్లెస్ యూ తల్లి : కాలితో సల్మాన్ బొమ్మ గీసిన అభిమాని

Submitted on 17 July 2019
Salman Khan Shares Video Of Specially Abled Fan Drawing His Portrait, Twitter Loves the Gesture

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కి ప్ర‌పంచవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉంది. ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్‌ఖాన్, సోనాక్షి సిన్హా హీరో హీరోయిన్లుగా దబాంగ్-3 సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలైంది. కానీ భార‌త్ సినిమా షెడ్యూల్‌ లో సల్మాన్ బిజీ అవ్వడంతో దబాంగ్-3 షూటింగ్‌కు బ్రేక్ పడింది. 

తాజాగా దబాంగ్-3 చిత్రం మళ్లీ సెట్స్ పైకి వెళ్ళింది. చివ‌రిగా భార‌త్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన స‌ల్మాన్ ఇప్పుడు ద‌బాంగ్ 3 తో బిజీగా ఉన్నాడు. స‌ల్మాన్ కొద్ది రోజులుగా ఈ సినిమాకి సంబంధించిన ప‌లు విష‌యాల‌ని సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని ఉత్సాహ ప‌రుస్తున్నాడు.

అయితే రీసెంట్ గా ఇరాన్‌కి చెందిన ఓ దివ్యాంగురాలి వీడియోని షేర్ చేశాడు. ఆమె స‌ల్మాన్ కు వీరాభిమాని. త‌న కాలుతో స‌ల్మాన్ స్కెచ్ వేసింది. త‌న పాదాల‌తో వేసిన ఈ స్కెచ్ స‌ల్మాన్ హృద‌యాన్ని తాకింది. ఈ సందర్భంగా అభిమాని వీడియోని సల్మాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తు కామెంట్ పెట్టాడు. గాడ్ బ్లెస్ యు...దేవుడు ఆశీర్వాదంతో పాటు మ‌రింత ప్రేమని పొందుతావు అని కామెంట్ పెట్టాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్ప‌టికే ఈ వీడియోని 2,504,329 మంది చూశారు.

Salman Khan
Shares Video
Specially Abled Fan
Drawing His Portrait

మరిన్ని వార్తలు