సంపూ మంచి మనసు : కర్ణాటక వరద బాధితులకు సాయం

Submitted on 13 August 2019
sampoornesh babu donates 2 lakhs for  karnataka flood victims

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు మరో సారి తన మంచి మనసు చాటుకున్నాడు. కర్ణాటక వరద బాధితులకు తన వంతు సాయం చేశాడు. ఇటీవల వరదల కారణంగా కర్ణాటకలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. జన జీవనం అస్థవ్యస్తమైంది. సహాయక చర్యలు చేపట్టిన ప్రభుత్వం ఇప్పటి వరకు రెండు లక్షల మందిని పునరావాస కేంద్రానికి తరలించింది.

ఈ ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందని ఆవేదన వ్యక్తం చేస్తూ.. తన వంతుగా కర్ణాటక ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.రెండు లక్షల విరాళం అందచేశాడు సంపూ.. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. 'ఉత్తర కర్ణాటకలో వరదలు నన్ను కలిచివేసింది. కన్నడ ప్రజలు తెలుగు సినిమాని దశాబ్దాలుగా ఆదరిస్తున్నారు. నన్ను కూడా హృదయకాలేయం నుంచి ఎంతగానో ప్రేమిస్తున్నారు. వరదల తాలూకు ఫోటోలు చూసి చాలా బాధవేసింది. నా వంతుగా 2 లక్షల విరాళం ముఖ్యమంత్రి సహాయనిదికి ప్రకటిస్తున్నాను' అని తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.

Read Also : ఏదైనా జరగొచ్చు - ట్రైలర్..

గతంలోనూ ఆంధ్ర ప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో వరదలు వచ్చినప్పుడు సంపూ తనవంతు సాయం అందించాడు. ఇప్పుడు సంపూ కర్ణాటక వరద బాధితులను ఆదుకోవడానికి సాయం చేశాడని తెలిసి.. నెటిజన్స్ సంపూని అభినందిస్తున్నారు. సంపూ మూడు పాత్రల్లో నటించిన కొబ్బరి మట్ట ఇటీవల విడుదలై విజయ వంతంగా ప్రదర్శింపబడుతుంది.

Sampoornesh Babu
karnataka floods
donates 2 lakhs

మరిన్ని వార్తలు