ఇండియాలో ధర ఎంతంటే? : శాంసంగ్ గెలాక్సీ A10e వచ్చేసింది 

Submitted on 13 June 2019
Samsung Galaxy A10e With Infinity-V Display Launched

సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం గెలాక్సీ A సిరీస్ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. శాంసంగ్ గెలాక్సీ A10e మోడల్ ను కంపెనీ అమెరికాలో రిలీజ్ చేసింది. ఇప్పటికే ఇండియా మార్కెట్ లో గెలాక్సీ ఎ20, గెలాక్సీ ఎ50 మోడల్ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

USలో రిలీజ్ అయిన గెలాక్సీ ఎ-సిరీస్ ఫోన్.. ఇంటిరీయర్ వేరియంట్ తో వచ్చింది. ఇన్ఫినిటీ-వి డిస్ ప్లే, 8MP రియర్ కెమెరా హైలెట్ గా నిలిచింది. అమెరికాలో గెలాక్సీ ఎ50 సిరీస్ మోడల్ సేల్స్ ప్రారంభమయ్యాయి. రానున్న వారంలో గెలాక్సీ ఎ10, గెలాక్సీ ఎ20 సిరీస్ మోడల్ సేల్స్ ప్రారంభం కానుంది. త్వరలో ఇండియాలో కూడా గెలాక్సీ ఎ10ఇ రిలీజ్ చేసేందుకు శాంసంగ్ ప్లాన్ చేస్తోంది. 

కొన్ని నెలలుగా లీక్ లతో ట్రెండ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎ10e యూఎస్ మార్కెట్లోకి రిలీజ్ అయింది. యూఎస్ మార్కెట్ లో గెలాక్సీ A10e ధర 179 డాలర్లు ఉండగా.. ఇండియాలో ఈ ఫోన్ ధర రూ.12వేల 500వరకు ఉంటుందని అంచనా. ఈ సిరీస్ ఫోన్ లో 32GB స్టోరేజీ ఆప్షన్ ఒకటి మాత్రమే కంపెనీ ప్రకటించింది. దీనికి సంబంధించిన ఇతర స్పెషిఫికేషన్లు, ఫీచర్లు ధర ఇంకా రివీల్ కాలేదు. 

గత ఫిబ్రవరిలో ఇండియాలో గెలాక్సీ ఎ10 సిరీస్ రిలీజ్ అయింది. ధీని ధర మార్కెట్ లో రూ.8వేల 490గా ఉంది. ప్రస్తుతం దీని ధర రూ.7వేల 990గా ఉంది. మార్చిలో రిలీజ్ అయిన గెలాక్సీ ఎ30, గెలాక్సీ ఎ50 మోడల్స్ ధర రూ.18వేల 200 నుంచి అందుబాటులో ఉన్నాయి.

మరోవైపు గెలాక్సీ ఎ సిరీస్ నుంచి గెలాక్సీ A50 ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయింది. గెలాక్సీ ఎ30, గెలాక్సీ ఎ10 కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ మోడల్స్ ధర రూ.19వేల 990గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ A10e మోడల్ పూర్తి స్పెషిఫికేషన్లు, ఫీచర్లకు సంబంధించిన వివరాలను రివీల్ చేయాల్సి ఉంది. 

గెలాక్సీ A10e స్పెషిఫికేషన్లు ఇవే (అంచనా) :
* 5.3 అంగుళాల ఇన్ఫినిటీ-V డిస్ ప్లే
* 8MP సెన్సార్ కెమెరా
* 32GB ఆన్ బోర్డు స్టోరేజీ
* 3000mAh బ్యాటరీ
* ఆండ్రాయిడ్ 9 పై వన్ UI
* ఎక్స్ నోస్ 7884 SoC
* 2GB ర్యామ్  

Samsung Galaxy A10e
 price
specifications
Galaxy A10e features
Galaxy A10

మరిన్ని వార్తలు