నగ్నంగా కీపింగ్ చేసిన మహిళా క్రికెటర్.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్

Submitted on 15 August 2019
Sarah Taylor bares it all for a social cause

ఇంగ్లండ్ మహిళ క్రికెటర్, వికెట్ కీపర్ సారా టేలర్.. తన అద్భుతమైన ఆటతో ఆకట్టుకునే ఈ అమ్మడు. లేటెస్ట్ అందమైన మనస్సుతో నగ్నంగా కనిపించి అందరి ప్రశంసలు పొందుతుంది. అలాగే కొందరు విమర్శలు కూడా అందుకుంటుంది. అసలు విషయం ఏమిటంటే మహిళా క్రికెట్ లో అత్యుత్తమ వికెట్ కీపర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు సామాజిక  కార్యక్రమాల్లో కూడా ముందుకుంటుంది. మెరుపు వేగంతో స్టంపులు చేయడం.. అద్బుతంగా క్యాచ్‌లు అందుకోడం ద్వారా ఆమె పాపులర్ అయింది.

అయితే ఇటీవల సారా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫోటోను పోస్ట్ చేసింది. ఒంటిపై నూలుపోగు లేకుండా వికెట్ కీపింగ్ చేస్తున్నట్లుగా ఉండే తన చిత్రాన్ని ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్ లో సారా పోస్ట్ చేసింది. సారా నగ్నంగా వికెట్ కీపింగ్ చేస్తూ కనిపించడంలో కూడా ఓ సామాజిక కోణం ఉందట. మహిళల శరీరం, ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించేందుకే ఆమె ఎవరూ చేయని ఇటువంటి సాహసం చేసింది సారా.

ఈ మంచి పని చేసేందుకు తనకు అవకాశం ఇచ్చిన ఉమెన్స్ హెల్త్ యుకే ఆర్గనైజేషన్‌కు సారా ధన్యవాదాలు వెల్లడించింది. ఈ క్రమంలోనే సారా ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

Sarah Taylor
social cause

మరిన్ని వార్తలు