నేటి నుంచి బడులు.. ఈ ఏడాది దసరా, సంక్రాంతి సెలవులు ఇవే..

Submitted on 12 June 2019
schools reopen from today

తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలకు వేసవి సెలవులు ముగిశాయి. అన్ని పాఠశాలలు బుధవారం (జూన్ 12, 2019) నుంచి పున:ప్రారంభం అయ్యాయి. జూన్ 1వ తేదీనే స్కూల్స్ రీ ఓపెన్ కావాల్సి ఉన్నా ఎండల తీవ్రతతో ప్రభుత్వాలు పాఠశాలల సెలవులను జూన్ 11వ తేదీ వరకు పొడిగించాయి. ఎండల తీవ్రత కొనసాగుతుండటంతో ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. జూన్ 15, 2019 వరకు మధ్యాహ్నం వరకే స్కూల్స్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఎండల తీవ్రత కారణంగా వాతావరణ శాఖ చేసిన సూచనను పరిగణనలోకి తీసుకుని 4 రోజులపాటు ఒంటిపూట మాత్రమే నిర్వహించాలని నిర్ణయించినట్లు పాఠశాల విద్య కమిషనర్లు తెలిపారు. ఉదయం 8 నుంచి మ.12.30 గంటల వరకే స్కూల్స్ ఉంటాయి.

జూన్ 17, 2019 నుంచి స్కూల్స్ రెండు పూటలూ కొనసాగుతాయి. ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటలకు వరకు, ప్రాథమికోన్నత పాఠశాలు ఉదయం 9 గంటల నుంచి 4.15 గంటలకు వరకు కొనసాగుతాయి. ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ లలో మాత్రం ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 8.45 గంటలకు మొదలై సాయంత్రం 4 గంటలకు ముగుస్తాయి. 

బ్యాగులనిండా పుస్తకాలను వేసుకొని విద్యార్థులు బడులకు వెళ్లనున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 65 లక్షల 29 వేల 72 మంది విద్యార్థులు 42 వేల 834 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. బ్యాగు బరువు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోకపోవడంతో విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. పెరిగిన ఫీజుల భారం తల్లిదండ్రులకు ఇబ్బందిగా మారింది. 20 శాతం నుంచి 30 శాతం వరకు ఫీజలను పెంచినా.. వాటిని నియంత్రించే చర్యలు లేకపోవడంతో అప్పులు చేసైనా చెల్లించే ఏర్పాట్లు చేసుకున్నారు.

వేసవి సెలవులు, పున:ప్రారంభం తేదీలను పాత విధానంలోనే నిర్ధేశిస్తూ రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 1వ తేదీ నుంచి పాఠశాలను పున:ప్రారంభించాలని గతంలో నిర్ణయించారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో జూన్ 11వ తేదీ వరకు సెలవులను పొడిగించారు. భవిష్యత్ లోనూ ఈ సమస్య ఉంటుందని భావించి విద్యాశాఖ పాత విధానం ప్రకారమే జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలు రీ ఓపెన్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం (జూన్ 11, 2019)వ తేదీ విద్యా శాఖ వార్షిక టైమ్ టేబుల్ ను విడుదల చేసింది.

పండుగ సెలవులు 
దసరా : (సెప్టెంబర్ 28, 2019) నుంచి (అక్టోబర్ 13, 2019)వరకు (16 రోజులు)
క్రిస్మస్ : (డిసెంబర్ 22, 2019) నుంచి (డిసెంబర్ 28, 2019) వరకు (7 రోజులు) 
సంక్రాంతి : (జనవరి 11, 2020) నుంచి (జనవరి 16, 2020) వరకు (6 రోజులు)

Schools
reopen
Today
Hyderabad
Telangana

మరిన్ని వార్తలు