యూనిఫామ్ రంగులే వేరు.. గుండెల్లో ఉండే మూడు రంగులు ఒక్కటే

Submitted on 13 August 2019
Security forces rubbish Pak journalist's charge of fratricid between CRPF, J&K police

జమ్ము కశ్మీర్‌ విభజన, ఆర్టికల్‌ 370 రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై పాకిస్తాన్ విషం కక్కుతూనే ఉంది. చేసేదేం లేక రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్లతో ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నం చేస్తుంది.

లేటెస్ట్ గా ఓ పాకిస్తానీ జర్నలిస్ట్ తన ట్విటర్‌ ఖాతాలో ఓ అసత్య వార్తను పోస్ట్ చేసి వైరల్ చేశాడు. ‘ఒక గర్భిణిని కర్ఫ్యూ పాస్‌ లేదనే కారణంగా సీఆర్‌పీఎఫ్‌ బలగాలు ఆసుపత్రికి పోనివ్వకుండా అడ్డుకున్నాయని, దాంతో కశ్మీర్‌ ముస్లిం పోలీసులు ఐదుగురు సీఆర్‌పీఎఫ్‌ సైనికులను తుపాకులతో కాల్చి చంపారంటూ’ ఓ వార్తను రాసి ట్వీట్‌ చేశాడు.

అసలు విషయానికి వస్తే.. ఇదంతా అసలు వాస్తవం కాదు. కావాలనే సదరు జర్నలిస్ట్ ఇటువంటి వ్యాఖ్యలతో పోస్టింగ్ లు చేసినట్లు సీఆర్‌పీఎఫ్‌ బలగాలు వెల్లడించాయి. జర్నలిస్ట్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవి అంటూ ఖండించారు సీఆర్‌పీఎఫ్‌ బలగాలు. తన ట్విటర్‌లో ‘ఆ జర్నలిస్ట్ దురుద్దేశపూర్వకంగా ఇటువంటి వ్యాఖ్యలు చేశారని తెలిపారు.

ప్రస్తుతం కశ్మీర్‌లో అన్నీ విభాగాల సైనిక దళాలు, పోలీసు విభాగాలు పరస్పర సహకారంతో కలిసిమెలిసి దేశ రక్షణ విషయంలో ముందుకు సాగుతున్నాయి అని, మా యూనిఫాం రంగులు వేరైనా గుండెల్లో మాత్రం భారత జాతీయ జండా మూడురంగులు ఉంటాయని వెల్లడించింది. ఈ మేరకు పాకిస్తాన్ వక్రబుద్ధిని ప్రస్తావిస్తూ ఓ ట్వీట్‌ కూడా చేసింది.

SECURITY FORCES
Pak journalist
CRPF
J&K Police

మరిన్ని వార్తలు