ఏం జరిగిందో : సీరియల్ నటి లలిత మిస్సింగ్

Submitted on 26 June 2019
Serial Actress lalitha Missing In Hyderabad

సీరియల్స్ లో నటించే ఓ నటి మిస్సింగ్ కలకలం రేపుతోంది. వారం రోజులుగా అడ్రస్ లేకపోవటం కుటుంబ సభ్యులను ఆందోళనకు గురి చేస్తోంది. ఆ సీరియల్ నటి పేరు లలిత. అనంతపురం జిల్లా ధర్మవరం లలిత స్వగ్రామం. నటనపై ఆసక్తితో హైదరాబాద్ వచ్చింది. అమీర్ పేట్ లోని ఓ ఉమెన్స్ హాస్టల్ లో ఉంటుంది. నటనపై ఆసక్తిగా ప్రయత్నం చేయగా.. కొన్ని అవకాశాలు వచ్చాయి. ఇప్పటికి కూడా నటిస్తూనే ఉంది. ప్రేమ, కళ్యాణ వైభవం, స్వర్ణఖడ్గం అనే సీరియల్స్ లలిత నటిస్తున్నట్లు చెబుతున్నారు.

వారం రోజులుగా లలిత ఆచూకీ లేకపోవటంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెందారు. హైదరాబాద్ SR నగరన్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ కోసం గాలిస్తున్నారు. సీరియల్స్ లలితతోపాటు కలిసి నటించిన వారినీ, హాస్టల్ లో రూంమేట్స్, స్నేహితులను ప్రశ్నిస్తున్నారు. వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.

వారం రోజుల నుంచి ఆచూకీ లేకపోవటంపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గుర్తు తెలియని కొందరు వ్యక్తులు.. లలితను తీసుకెళ్లారని ఆమె స్నేహితులు చెబుతున్నారు. లలితను తీసుకెళ్లింది ఎవరు.. ఆమె ఇష్టపూర్వకంగానే వెళ్లిందా.. బలవంతంగా తీసుకెళ్లారా అనేది కూడా తెలియరాలేదు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ అయ్యింది. ఎలాంటి కాంటాక్ట్ లేదు. 

Serial Actress
lalitha
Missing
Hyderabad

మరిన్ని వార్తలు