త్వరపడండి : సెట్విన్ ఆధ్వర్యంలో బుధవారం జాబ్ మేళా

Submitted on 12 June 2019
setwin to conducts mega job mela today

హైదారాబాద్ : సెట్విన్ ఆధ్వర్యంలో ఎర్రగడ్డ సుల్తాన్‌నగర్‌లోని ఒవైసీ కమ్యూనిటీ హాలులో బుధవారం (జూన్ 12,2019) ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మెగా జాబ్‌ మేళాను నిర్వహిస్తున్నట్లు సెట్విన్‌ సంస్థ ట్రెనింగ్‌ కో ఆర్డినేటర్‌ కె.మంజుల ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ జాబ్ మేళాలో నాలుగు ప్రముఖ కంపెనీలు పాల్గోంటున్నాయని, 200 ఖాళీలను భర్తీ చెయ్యనున్నట్లు ఆమె వివరించారు. పదవ తరగతి, ఇంటర్‌, డిగ్రీ విద్యార్హతలు ఉన్న అభ్యర్దులు ఇతర అర్హత పత్రాలు, ఆధార్‌ కార్డు జిరాక్స్‌లతో జాబ్ మేళాకు హజరు కావచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు 9059099358, 7993325635 నెంబర్లను సంప్రదించాలన్నారు.

Telangana
Job Mela
10th Class
intermediate
Degree
SETWIN

మరిన్ని వార్తలు