కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

Submitted on 13 August 2019
Share markets get bearhug of the bad kind

స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. అమ్మేవాళ్లే కానీ, కొనేవాళ్లు లేకపోవడంతో షేర్లు భారీగా పతనమయ్యాయి. ఫలితంగా సెన్సెక్స్ 624 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ 183పాయింట్లు పతనమైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 36,958 పాయింట్లకు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 10,926 పాయింట్లకు క్షీణించాయి. ఫలితంగా రెండు సెషన్లుగా వచ్చిన లాభాలన్నీ ఆవిరైపోయి నష్టాలే మిగిలాయి. 

ఫైనాన్షియల్, ఆటోమొబైల్స్, ఐటీ స్టాక్స్‌లో తీవ్ర అమ్మకాలు సూచీలపై పెను ప్రభావం చూపించాయి. వాహన అమ్మకాలు పడిపోవడంతో పాటు, అంతర్జాతీయ పరిస్థితులు (అర్జెంటీనా సంక్షోభం, చైనా-అమెరికా వాణిజ్య ఉద్రిక్తతలు)లు అమ్మకాలపై ఎఫెక్ట్ చూపించాయి. సంపన్నులు పన్ను చెల్లింపు విషయంలో ఆర్థిక శాఖ చూపిస్తున్న వైఖరి తీవ్ర ప్రభావం చూపింది. 

మార్కెట్ హైలైట్స్.. 
* అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపీ 49 పైసలు క్షీణతతో 71.27 వద్ద నిలిచింది. 
* డబ్ల్యూటీఐ క్రూడ్ ధర స్వల్ప పాటి మార్పుతో బ్యారెల్‌కు 0.51 శాతం పెరుగుదలతో 54.98 డాలర్లకు ఎగసింది. 
* నిఫ్టీ 50లో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, రిలయన్స్, సన్ ఫార్మా, గెయిల్, జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్లు లాభాల్లో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏకంగా 10 శాతం పరుగులు పెట్టింది. 
* యస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐషర్ మోటార్స్ షేర్లకు నిరాశ తప్పలేదు. యస్ బ్యాంక్ గణనీయంగా 11 శాతం వరకూ కుప్పకూలింది. 
* జియో గిగా ఫైబర్ సర్వీస్‌ను ప్రకటించిన తర్వాత రిలయన్స్ గ్రూప్‌కు సత్ఫలితాలే వచ్చాయి. 9.72శాతం లాభాలతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఒక్కటే మంచి ఫలితాలతో ముగించింది. 

Share markets
Sensex

మరిన్ని వార్తలు