ధావన్‌కు ఇదే ఆఖరి మ్యాచ్

Submitted on 13 August 2019
Shikhar Dhawan under pressure to score big with series on the line

వెస్టిండీస్ టూర్‌లో టీమిండియా మెరుస్తున్నప్పటికీ యువ క్రికెటర్ రిషబ్ పంత్, ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ ఫెయిలవుతూనే ఉన్నారు. పంత్ ఒక్క టీ20మినహాయించి మరే మ్యాచ్‌లోనూ చెప్పుకోదగ్గ స్కోరు నమోదు చేయలేకపోయాడు. ధావన్‌కు ఈ పర్యటనలో నిరూపించుకోవడానికి మిగిలి ఉంది ఒకే ఒక్క అవకాశం. గాయంతో వన్డే ప్రపంచకప్ మధ్యలోనే స్వదేశానికి వచ్చేసిన ఈ ఓపెనర్... వెస్టిండీస్‌తో ముగిసిన 3 టీ20లు, ఒక వన్డే మ్యాచ్‌లో వరుసగా 1, 23, 3, 2 పరుగులతో నిరాశపరిచాడు. 

పర్యటనలో మిగిలి ఉన్న ఆఖరి వన్డేలోనూ విఫలమైతే ధావన్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారనుంది. గాయం కారణంగా వరల్డ్ కప్ టోర్నీ నుంచి తప్పుకున్నప్పుడే అతని స్థానాన్ని కేఎల్ రాహుల్ భర్తీ చేశాడు. ఇక వన్డే సిరీస్‌లోని తొలి వన్డే వర్షం కారణంగా రద్దుకాగా, ఆదివారం రాత్రి జరిగిన రెండో వన్డేలో మాత్రం గెలిచిన టీమిండియా.. బుధవారం రాత్రి ఆఖరి వన్డేలో కరీబియన్లని ఢీకొట్టేందుకు సిద్ధమవుతోంది. 

వన్డే సిరీస్‌ తర్వాత వెస్టిండీస్‌తో భారత్ జట్టు 2 టెస్టులను ఆడనుండగా.. ధావన్‌ స్థానంలో టెస్టులకి మయాంక్ అగర్వాల్‌ని ఓపెనర్‌గా సెలక్టర్లు ఎంపిక చేశారు. దీంతో.. విండీస్‌ పర్యటనలో ధావన్ ఆఖరిగా బుధవారమే రాత్రే కనిపించునున్నాడు. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లకు ప్రత్యామ్నాయ ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ కనిపిస్తుండటంతో ధావన్ కెరీర్‌ను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. 

shikhar dhawan
west indies
Team India

మరిన్ని వార్తలు