ఏకిపారేసిన నెటిజన్లు : వేటాడిన సింహం పక్కనే ఫోజిస్తూ ముద్దులు!

Submitted on 17 July 2019
Shocking Photo Of Couple Kissing Next To Hunted Lion Causes Outrage

సౌతాఫ్రికాలో ట్రోఫీ హంటింగ్ ఎంతో ఫేమస్. సఫారీ పార్కులో ఓ షాకింగ్ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కెనడాకు చెందిన దంపతులిద్దరూ వేటాడిన సింహం పక్కనే కూర్చొని ఫొటోకు ఫోజులిస్తూ ముద్దు పెట్టుకున్నారు. ట్రోఫీ హంటింగ్ క్యాంపెయిన్ లో భాగంగా డెరెన్, కరొలిన్ కార్టర్ అనే దంపతులు పెద్ద సింహాన్ని వేటాడారు. అనంతరం చచ్చిన సింహం పక్కనే కూర్చొని సెల్ఫీ తీసుకున్నారు. 

లీగ్లీలా సఫారీ టూర్‌లో ఈ ఘటన జరిగినట్టు ది సన్ నివేదించింది. వేటాడిన సింహం పక్కనే దంపతులు ముద్దు పెట్టుకున్న ఫొటోను లిగ్లీలా సఫారీ తమ ఫేస్ బుక్ పేజీలో షేర్ చేసింది. దీంతో నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో వెంటనే ఆ ఫొటోను పేజీ నుంచి తొలగించింది. సింహన్ని వేటాడిన దంపతులపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

ట్రోఫీ హంటింగ్ క్యాంపెయిన్‌పై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. మూగజీవాలను వేటాడటం సరైనది కాదంటూ ఏకిపారేశారు. ట్రోఫీ హంటింగ్ ఏవగింపు చర్య అంటూ తిట్టిపోశారు. ప్రతి ఏడాది బ్రిటన్‌కు వచ్చే హంటింగ్ ట్రోఫీలతో దేశ ప్రతిష్టను దిగజారుస్తుందని అభిప్రాయపడ్డారు. జంతువులను కాల్చిపారేయడం మంచిది కాదని హితవు పలికారు. 

2015లో జింబాబ్వేలోని హ్వాంగే నేషనల్ పార్క్‌లో అమెరికా  దంతవైద్యుడు ఒకరు సిసిల్ అనే సింహన్ని చంపేశాడు. అప్పట్లో దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అప్పటి నుంచి ఆఫ్రికాలో హంటింగ్ ట్రోఫీకి కార్యక్రమానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ ప్రచారానికి దారితీసింది. అంచనాల ప్రకారం.. ఆఫ్రికాలోని అడవిలో సింహాల సంఖ్య గత రెండు దశాబ్దాలలో 40 శాతానికి పైగా తగ్గి 20వేలకు చేరింది. 

Couple Kissing
Hunted Lion
Causes Outrage
trophy hunting Ban
Darren and Carolyn Carter
Legelela Safaris tour 

మరిన్ని వార్తలు