క్యారీ బాగ్‌కు డబ్బు వసూలు చేస్తే రూ.7వేలు జరిమానా

Submitted on 26 May 2019
Shoppers Stop Fined 7 Thousand Rupees Over Carrier Bag Charges

తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ వినియోగదారుల వివాదాల పరిష్కార కేంద్రం షాపింగ్‌మాల్స్ తమ సంస్థ లోగో వేసిన క్యారీబ్యాగ్‌లను కస్టమర్స్ కు ఫ్రీగా ఇవ్వాలని ఆదేశించింది. కానీ ఇందుకు విరుద్ధంగా బేగంపేటలోని షాపర్స్‌ స్టాప్ మాల్‌ కస్టమర్స్ దగ్గర క్యారీబ్యాగ్‌కు రూ.5 వసూలు చేశారు. దీంతో ఉప్పల్ కు చెందిన శ్రీకాంత్ తనకు జరిగిన అసౌకర్యాన్ని పౌరసరఫరాల వినియోగదారుల వివాదాల పరిష్కార కేంద్రం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరారు. 

ఫిర్యాదు చూసిన అధికారులు వెంటనే షాపర్స్‌ స్టాప్‌కు రూ.7 వేలు జరిమానా విధించారు. లోగో ముద్రించని వాటిపై చార్జీ వసూలు చేసుకోవచ్చు కానీ సంస్థ లోగో ఉన్న బ్యాగ్ లకు మాత్రం వసూలు చేయరాదని మరోసారి స్పష్టం చేసింది. అంతేకాదు ఎర్రమంజిల్‌లోని కార్యాలయంలో నేరుగా లేదా 1800425 00333 టోల్‌ఫ్రీ నంబరుకు సంప్రదించి సేవలు పొందవచ్చని వినియోగ వ్యవహారాల కమిషనర్‌ తెలిపారు. 

Shoppers Stop
Shopping Mall
begumpet
2019

మరిన్ని వార్తలు