శ్రేయాస్ నా ఒత్తిడినంతా తీసేశాడు: కోహ్లీ

Submitted on 15 August 2019
"Shreyas Iyer Took Pressure Off Me": Virat Kohli After India's ODI Series Win Against West Indies

మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్‌ను తెగపొగిడేస్తున్నాడు విరాట్ కోహ్లీ. ఎంతలా అంటే నెం.4స్థానాన్ని శ్రేయాస్‌కు పర్మినెంట్ చేసేంతలా పొగుడుతున్నాడు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో డక్ వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం టీమిండియా విజయం సొంతం చేసుకుంది. ఫలితంగా రెండో సిరీస్ కూడా భారత్‌కే దక్కింది. 

మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. 'శ్రేయాస్ అయ్యర్ ఆట తీరుతో నా ఒత్తిడినంతా తీసేశాడు. గేమ్ ఛేంజర్‌లా కనిపించాడు. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలిగే ఇలాంటి బ్యాట్స్‌మెన్ కావాలి. బౌలర్లపై ఒత్తిడి పెంచుతూ కంట్రోల్‌గా ఆడాడు. వర్షంతో మ్యాచ్ ఆగిపోయినప్పుడు కొంచెం కంగారుపడ్డాం. డీఎల్ఎస్‌తో వచ్చిన టార్గెట్‌కు మ్యాచ్ దక్కకుండా పోతుందేమోనని భయపడ్డాం. బౌలర్లు కూడా బాగా ఆడారు' అని కెప్టెన్ తెలిపారు. 

వెస్టిండీస్ 7వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. మ్యాచ్ కాసేపటి వరకూ ఆపేశారు. మళ్లీ మొదలైన మ్యాచ్‌లో భారత్ 35ఓవర్లకు 255లక్ష్యంతో బరిలోకి దిగింది. ఈ సమయంలో ఓపెనర్లు రోహిత్(10), ధావన్(36)పరుగులతో పెవిలియన్ చేరుకోగా వన్ డౌన్‌లో వచ్చిన కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మ్యాచ్ గెలిపించాడు. నెం.4లో దిగిన రిషబ్ పంత్(0)డకౌట్‌గా వెనుదిరగడంతో శ్రేయాస్ అయ్యర్(65) మరో ఎండ్‌లో కోహ్లీకి చక్కటి సహకారం అందించాడు. 

మ్యాచ్ చివర్లో అవుత్ అవడంతో కేదర్ జాదవ్ చేతుల మీదుగా కోహ్లీ మ్యాచ్‌ను ముగించాడు. 

shreyas iyer
Virat Kohli
india
west indies

మరిన్ని వార్తలు