40వేల ఏళ్ల నాటి తోడేలు తల...అవయువాలు పనిచేస్తున్నాయంట

Submitted on 12 June 2019
IN SIBERIA FOUND THE HEAD OF A GIANT WOLF THAT HAD LAIN IN THE PERMAFROST OF 40 THOUSAND YEARS

40 వేల ఏళ్ల నాటి తెగిపడిన ఓ రాకాసి తోడేలు తలను శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.సైబీరియాలోని యాకుటియా ప్రాంతంలో దీని కనుగొన్నారు. మెదడుతో సహా రాకాసి తోడేలు తలలోని ఇతర భాగాలు పెద్దగా పాడవకుండా ఉండటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది.ప్రస్తుత మున్న తోడేళ్ల తల పరిమాణము కంటే ఈ రాకాసి తోడేలు తల పెద్దదిగా ఉంది. మామూలు తోడేళ్ల తల 9.1-11 అంగుళాలు ఉంటే ఈ రాకాసి తల దాదాపు 16 అంగుళాల పొడువు ఉంది.  అంటే ప్రస్థుత తోడేలు తల కంటే రెండు రెట్లు పెద్దది.

2018సమ్మర్ లో తిరికత్యాక్ నది దగ్గర్లో పావెల్ ఎఫిమోవ్ అనే స్థానికుడు ఈ రాకాసి తోడేలు తలను గుర్తించాడు .దీన్ని శాస్త్రవేత్తలు ఇప్పుడు ఆవిష్కరించారు.ఆ రాకాసి తోడేలు తలలోని కండరాళ్లు, వివిధ భాగాలు, మెదడు బాగానే ఉన్నాయని, ప్రస్తుతమున్న తోడేళ్ల జాతితో, సింహాలతో రాకాసి తోడేళ్లను పోల్చిచూసి వాటి శక్తి సామర్థ్యాలను బేరీజువేస్తామని టోక్యోకు చెందిన జికియే యూనివర్శిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ కు చెందిన ప్రొఫెసర్‌ నావోకీ సుజుకి తెలిపారు.పూర్తి స్థాయి కణజాలంతో ఓ జంతువు తలను కనుగొనటం ఇదే మొదటిసారని రష్యన్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ అల్బర్ట్‌ ప్రోటోపోపోవ్‌ తెలిపారు.ఇదో ప్రత్యేకమైన ఆవిష్కరణ అని అల్బర్ట్ తెలిపారు. 

40THOUSEND YEARS
ICE AGE WOLF
SEVERED
head
cut
TWICE
SIZE
MODEREN
SIBERIA
found
GAINT WOLF
PERMAFROST
unvield
Scientists

మరిన్ని వార్తలు