ఆల్ టైమ్ రికార్డ్: కిలో వెండి రూ .45వేలు

Submitted on 13 August 2019
Silver touches all-time high mark of Rs 45,000; gold falls by Rs 100

స్టాక్ మార్కెట్‍‌లో భారీ వ్యత్యాసాలు కనిపించాయి. కిలో వెండి ధర రూ.45వేలకు చేరుకుంది. మంగళవారం (ఆగస్టు 13, 2019) నాటికి రెండు వేలు పెరిగి ఆల్‌టైమ్ గరిష్ఠ మార్కుకు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం 10 గ్రాములకు రూ .100 తగ్గి రూ.38వేల 370కు చేరుకుందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. 

పారిశ్రామిక యూనిట్లు, నాణెం తయారీలో పెరుగుదలతో ప్రపంచ స్థాయిలో మార్పులు కనిపించాయి. ప్రధానంగా వైట్ మెటల్ భారీగా పెరుగుదల కనిపించిందని వ్యాపారులు తెలిపారు. బలమైన విదేశీ ధోరణి వెండి ధరల పెరుగుదలకు దారితీసిందని ఆల్ ఇండియా సారాఫా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సురేంద్ర జైన్ చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా న్యూయార్క్‌లో బంగారం ఔన్సు 1,520.37 అమెరికన్ డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, వెండి ఔన్సు 17.32 డాలర్ల వద్ద అధికంగా ఉంది. ఢిల్లీలో బంగారం 99.9 శాతం రూ.38,370, , 99.5 శాతం రూ .38,200గా ఉంది. సావరిన్ బంగారం 8 గ్రాములకు రూ.200 పెరిగి రూ.28 వేల 800కు చేరుకుంది. వీక్లీ బేస్డ్ డెలివరీ కిలోకు రూ.956 పెరిగి రూ .44 వేల 280 గా ఉంది.

Also Read : కేరళలో వరద సాయంపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం : 19 కేసులు నమోదు

silver
touches
all-time high mark
Rs 45
000
gold
FALLS
Rs100

మరిన్ని వార్తలు