చెన్నై బిజీ రోడ్డుపై భారీ గుంత

Submitted on 13 June 2019
Sinkhole In Chennai

వాహనాలు రయ్యి రయ్యి మంటూ దూసుకెళుతున్నాయి. స్కూళ్లకు, ఆఫీసులకు, ఇతరత్రా పనులపై వెళ్లే వారితో ఆ రోడ్డు బిజీ బిజీగా ఉంది. సడన్ గా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఎంతకు వాహనాలు ముందుకు కదలడం లేదు. కారణం ఏంటీ అంటే..రోడ్డుపై భారీ గుంత ఏర్పడింది.

దీంతో వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. 

జూన్ 13వ తేదీ గురువారం మధ్యకైలాష్ ప్రాంతంలో రోడ్డుపై భారీ గుంత ఏర్పడింది. సుమారు ఆరు ఫీట్ల మేర కుంగిపోయింది. ఓల్డ్ మహాబలిపురం రోడ్ (OMR) - సర్దార్ పటేల్ రోడ్ మార్గంలోని ట్రై జంక్షన్ వద్ద ఒక్కసారిగా గుంత ఏర్పడడంతో వాహనాలు ఎక్కడికక్కడనే నిలిచిపోయాయి.

ఏ వాహనం పడకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వల్ల గుంత ఏర్పడిందని పేర్కొంటున్నారు. ఏర్పడిన గుంతలో నుండి డ్రైనేజీ వాటర్ లీక్ అవుతోంది. 

Sinkhole
Chennai
madhya kailash

మరిన్ని వార్తలు