కే ట్యాక్స్ రగడ : కోడెలపై సిట్ వేయాలి - గోపిరెడ్డి

Submitted on 13 June 2019
SIT constituted to probe Kodela Sivaprasad Rao Cases

మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుమారుడు, కుమార్తెలపై నమోదవుతున్న వరుస కేసులపై సిట్ వేయాలని కోరుతున్నామన్నారు నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. అధికారాన్ని అడ్డుపెట్టుకొని కోడెల అరాచకాలు చేశారని తెలిపారు. ఇందులో చాలా మంది బాధితులున్నారని..ఎనిమిది కేసులు బుక్ అయ్యాయన్నారు. 

దీనిపై ఎమ్మెల్యే గోపిరెడ్డితో 10tv మాట్లాడింది. పదవిని అడ్డు పెట్టుకుని కే ట్యాక్స్ వసూలు చేశారని తెలిపారు. దీనిపై సిట్ వేస్తేనే న్యాయం జరుగుతుందని, ఇందుకు సీఎం జగన్ ను..అసెంబ్లీలో కోరుతామన్నారు. 1989లో నరసరావుపేటలో జరిగిన బాంబు కేసులో సీబీఐ జరిపిన విచారణలో మొట్టమొదటి ముద్దాయన్నారు. ప్రాసిక్యూషన్ కోసం బీజేపీ ప్రభుత్వాన్ని సీబీఐ పర్మిషన్ అడిగితే..రామోజీ రావు పట్టుకుని..అద్వానీ కాళ్ల మీద పడి అందులో అరెస్టు కాకుండా ఆపుకున్నారని ఆరోపించారు. 

కొన్ని రోజులుగా ఏపీ మాజీ స్పీకర్ గా పనిచేసిన కోడెల కుటుంబం కే ట్యాక్స్ పేరిట వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై కేసులు కూడా బుక్ అవుతున్నాయి. కే ట్యాక్స్ పేరుతో వసూళ్లకు పాల్పడ్డారని వారు పేర్కొంటున్నారు. అయితే..దీనిని కోడెల కొట్టిపారేస్తున్నారు. 
 

sit
constituted
Probe
Kodela Sivaprasad Rao Cases

మరిన్ని వార్తలు