నిద్రలోనే మృత్యుఒడిలోకి : కర్నాటకలో కూలిన ఇల్లు..ఆరుగురు మృతి

Submitted on 26 June 2019
six members of a family were killed in Karnataka

కర్నాటక రాష్టంలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృత్యువాత పడ్డారు. దీంతో ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. నిద్రలోనే వారి బతుకులు తెల్లారిపోయాయి. ఈ ఘటన బీదర్ జల్లాల్లోని బసవ కల్యాణ తాలూకా చిల్లాగల్లి గ్రామంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అధికారులు మృతదేహాలను బయటకు తీశారు. శిథిలాలను తొలగిస్తున్నారు. 

చిల్లాగల్లి గ్రామంలో నదీమ్ షేక్ పండ్ల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి నలుగురు పిల్లలున్నారు. 2019, జూన్ 25వ తేదీ మంగళవారం ఎప్పటిలాగానే పడుకున్నారు. 26వ తేదీ బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా ఇళ్లు కుప్పకూలిపోయింది. నిద్రలోనే అనంతలోకి వెళ్లిపోయారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. 

ఘటనాప్రదేశానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంబించారు. శిథిలాల కింద ఉన్న ఆరుగురు మృతదేహాలను బయటకు తీశారు. స్థానిక ఎమ్మెల్యే బి.నారాయణ రావు సంఘటన ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. భారీ వర్షం కారణంగానే ఇల్లు కూలిపోయినట్లు అంటున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురూ మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

Six members
family
killed in Karnataka
beedar

మరిన్ని వార్తలు