ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లపై ‘సోలార్ ట్రీ’లు వచ్చేస్తున్నాయ్

Submitted on 13 June 2019
'Solar trees' to be installed in residential complexes of government employees

ప్రభుత్వ ఉద్యోగులు నివసించే రెసిడేన్షియల్ కాంప్లెక్స్ లపై సోలార్ ట్రీలు రానున్నాయి. సోలార్ చెట్ల ఏర్పాటుపై ఇప్పటికే సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ (CPWD) సంబంధిత అధికారులకు సూచించింది. ప్రభుత్వ ఉద్యోగాల కాంప్లెక్స్ లపై సోలార్ ట్రీల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధికారులతో సీపీడబ్ల్యూడీ చర్చించింది. ఈ విధానం ద్వారా పునరుత్పాదక శక్తితో పాటు కార్బన్ స్థాయి విలువలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వంలోని ప్రధాన నిర్మాణ ఏజెన్సీ భావిస్తోంది.

అధికారిక వివరాల ప్రకారం.. సోలార్ ట్రీలను ఏర్పాటు చేయాలనే ఆలోచనను తొలుత గుజరాత్ లోని దండీ సమీపంలోని నేషనల్ సాల్ట్ సత్యాగ్రహ మెమోరియల్ దగ్గర CPWD అమలు చేసింది. దీనికి మంచి స్పందన రావడంతో సోలార్ ట్రీల ఏర్పాటును వేగవంతం చేయాలని నిర్ణయానికి వచ్చింది. ఇప్పటివరకూ మెమోరియల్ కాంప్లెక్స్ పరిధిలో మొత్తం 41 వరకు సోలార్ ట్రీలను ఏర్పాటు చేశారు. 

ఓపెన్ ఏరాలో జనరల్ పూల్ ఆఫీస్ అకామిడేషన్ (GPOA), జనరల్ పూల్ రెసిడేన్షియల్ అకామిడేషన్ (GPRA) పరిధిలో ఉండే కాంప్లెక్స్ లో సోలార్ ట్రీలు ఏర్పాటుకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు అన్ని ఫీల్డ్ యూనిట్లకు సూచనలు చేసినట్టు అధికారి ఒకరు తెలిపారు. GPRA, GPOA రెండూ విభాగాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే కావడంతో సోలార్ విద్యుత్ ట్రీలను సాధ్యమైనంత వరకు ఖాళీ మైదాన స్థలాల్లో ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.

NSSM మెమోరియల్ దగ్గర ఇన్ స్టాల్ చేసిన సోలార్ ట్రీల మాదిరిగానే అన్నిచోట్ల ఏర్పాటు చేసేలా సంబంధిత ఫీల్డ్ యూనిట్లకు గైడెన్స్ కోసం సమాచారాన్ని సీపీడబ్ల్యూడీ పంపినట్టు అధికారి పేర్కొన్నారు. CPWD.. యూనియన్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్టరీకి చెందిన శాఖ కావడంతో ప్రభుత్వ భవనాల్లో సోలార్ ట్రీలు ఏర్పాటు చేసిన తర్వాత దేశంలోని అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాల్లో కూడా సోలార్ ట్రీలు ఏర్పాటుపై దృష్టిపెట్టే అవకాశం ఉంది. 

Solar trees
residential complexes
Government employees
GPRA
CPWD
Central govt 

మరిన్ని వార్తలు