బెజవాడలో ఘోరం : తండ్రిని కొడుకు చంపుతుంటే.. కూతురు వీడియో తీసింది

Submitted on 12 July 2019
son killed his father for pension money in krishna district

కృష్ణా జిల్లా చందర్లపాడులో దారుణం. మానవత్వం అనే పదానికే సిగ్గుచేటు. మద్యం మత్తులో కుమారుడు కన్నతండ్రిని చంపాడు. పెన్షన్ డబ్బులు ఇవ్వనందుకు గొంతు నులిమి చంపేశాడు. కుటుంబ సభ్యులు ఎంత వారించినా వినకుండా.. వారి ముందే ఈ దారుణానికి ఒడిగట్టాడు.

చందర్లపాడులో షేక్ సాహెబ్ (73) అనే వృద్ధుడు ప్రభుత్వం అందించే పెన్షన్ తీసుకుంటున్నాడు. జూలై 8వ తేదీ వృద్ధాప్య పెన్షన్ తీసుకుని ఇంటికి వచ్చాడు. ఆ వెంటనే అతని కొడుకు షేక్ షిలార్ గొడవకు దిగాడు. పెన్షన్ డబ్బులు ఇవ్వాలని కోరాడు. దీనికి తండ్రి ఒప్పుకోలేదు. కొడుకు ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇంటి వరండాలో కుర్చీలో కూర్చుని ఉన్న తండ్రి సాహెబ్ ను కొట్టాడు. కొడుకు దాడి నుంచి తప్పించుకునేందుకు ఆ వృద్ధ తండ్రి ఎదురుదాడికి దిగినా ఫలితం లేదు. గొంతు పిసకటంతో.. చనిపోయాడు. ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు తెలిపారు డాక్టర్లు.

తండ్రిపై కొడుకు దాడి చేస్తున్న దృశ్యాలను కూతురు వీడియో తీసింది. పోలీసులకు అందించింది. నిందితుడిపై కేసు నమోదు చేశారు. కుమారుడు అదుపులోకి తీసుకున్నారు.

Son
kill
father
Krishna District
pension money

మరిన్ని వార్తలు