సల్మాన్ మీద ప్రేమతో రిలీజ్ డేట్ మార్చారు..

Submitted on 13 June 2019
Sooryavanshi Release Date Change for Salman Khan

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సినిమాలు గతకొద్ది సంవత్సరాలు ఈద్ కానుకగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే.. సల్లూ భాయ్ సినిమా అంటే రంజాన్‌కే రిలీజవుతుంది అని ఫ్యాన్స్, ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. 2009 నుండి 2019 వరకు.. మధ్యలో ఒక్క 2013 తప్ప, ప్రతీ ఈద్‌కు భాయ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి.. రీసెంట్‌గా విడుదలైన భారత్ కూడా మంచి వసూళ్లు రాబడుతుంది.

సల్మాన్, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో నటింబోయే 'ఇన్‌షా అల్లా' మూవీని 2020 ఈద్ సందర్భంగా రిలీజ్ చెయ్యాలనుకున్నారు. కానీ, అదే టైమ్‌లో అక్షయ్ కుమార్, రోహిత్ శెట్టి కాంబోలో రానున్న 'సూర్యవంశీ' సినిమాను కూడా రిలీజ్ చెయ్యనున్నామని కొద్ది రోజుల క్రితం ప్రకటించారు.. దీంతో, సల్మాన్, అక్షయ్‌ల మధ్య బాక్సాఫీస్ పోరు తప్పదనుకున్నారంతా. కట్ చేస్తే, సల్మాన్ మీద ఉన్న ప్రేమ, గౌరవం కారణంగా సూర్యవంశీ చిత్రాన్ని ఇన్‌షా అల్లా కంటే ముందుగానే విడుదల చెయ్యనున్నట్టు ప్రకటించారు..

'కిలాడీ, బ్లాక్ బస్టర్  డైరెక్టర్ కలిసి మార్చి 27నే సూర్యవంశీతో వస్తున్నారు, స్పెషల్ లవ్ టు సల్మాన్ ఖాన్' అంటూ, సల్మాన్, రోహిత్ కలిసి ఉన్న పిక్ పోస్ట్ చేసాడు నిర్మాత కరణ్ జోహార్.. 'రోహిత్‌ను ఎప్పటికీ నా తమ్ముడిగానే భావించాను, అది నిజమేనని తను ఈరోజు నిరూపించాడు' అని సల్మాన్ రియాక్ట్ అయ్యాడు.

 

Inshallah
Sooryavanshi
Salman Khan
Akshay Kumar

మరిన్ని వార్తలు