Specials

Tuesday, August 18, 2015 - 19:58

హైదరాబాద్ : స్పెషల్‌ స్టేటస్‌ అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చర్చనీయాంశమైంది. ఎన్నికల నేపథ్యంలో బీహార్‌ రాష్ట్రానికి లక్షా 65 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఏపీ విషయంలో ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ విషయంలో టిడిపి ఉదాసీనంగా వ్యవహరిస్తోందా? చట్టం లో లేకుండా బీహార్ కు ప్యాకేజీ...

Wednesday, August 12, 2015 - 19:37

తెలంగాణలో గ్రామ పంచాయితీ సిబ్బంది సమస్యకు ఇంకా పరిష్కారం లభించలేదు. వీరు సమ్మెకు దిగి 43 రోజులు దాటినా, సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఉత్సాహం చూపడం లేదు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కార్మికులు నిర్వహించిన చలో హైదరాబాద్ విజయవంతమైంది. ఈ అంశంపై టెన్ టివిలో నిర్వహించిన చర్చా వేదికలో ఆర్. సుధా భాస్కర్ (సీఐటీయూ జాతీయ కార్యదర్శి), సోలిపేట రామచంద్రారెడ్డి (మాజీ ఎంపీ), సుధాకర్...

Tuesday, July 28, 2015 - 11:07

భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం కన్నుమూయడం పట్ల దేశం శోక సంద్రంలో మునిగిపోయింది. సైన్స్ రంగంలో భారతదేశ కీర్తిప్రతిష్టల్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తిగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం రికార్డులకెక్కారు. భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సేవలకు మెచ్చి కేంద్ర ప్రభుత్వం పలు పురస్కారాలు ప్రకటించింది. 40 విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి....

Sunday, July 19, 2015 - 21:55

నిర్మాత సురేష్ బాబుతో ''ప్లెయిన్ స్పీక్ విత్ రవి తెలకపల్లి'' కార్యక్రమంలో గత, ప్రస్తుత సినిమాల తీరును సురేష్ బాబు వివరించారు. సినిమాలు నిర్మించడంలో తన అనుభాలను వివరించారు. తన కుమారుడు రానా నటనపై మాట్లాడారు. బాహుబలిలో రానా నటనను ప్రస్తావించారు. గతానికి, ప్రస్తుతానికి నటన పరంగా రానాలో అభివృద్ధి వచ్చిందన్నారు. సినీ ఇండస్ట్రీపై వివరణ ఇచ్చారు. డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ పోయిందని...

Sunday, July 19, 2015 - 12:41

సాహిత్యం మనిషికి మంచిని బోధిస్తుంది. మానవత్వాన్ని ప్రభోధిస్తుంది. ఉన్నత సమాజం వైపు మానవాళిని నడిపిస్తుంది. సాహిత్య నేపథ్యం లేని మానవ సమూహాల్లో.. సమాజాల్లో.. చైతన్యం తొణికిసలాడదు. ప్రగతి కనిపించదు. మానవజాతి చరిత్రను మలుపుతిప్పడంలో సాహిత్యం చారిత్రాత్మకమైన పాత్రను పోషించిందనడంలో ఎట్టి సందేహం లేదు. అందుకు ప్రధాన కారకులు..ప్రేరకులు.. సృజనకారులే. .అలాంటి వారిలో జాతీయోద్యమకాలంలో...

Sunday, July 19, 2015 - 06:30

రాజమండ్రి : ఓ వైపు పుష్కర శోభతో గోదారి పులకించిపోతోంది. భక్తులు... పుణ్యస్నానాలు చేస్తూ పునీతులవుతున్నారు. నిత్యహారతిని చూసి తరించిపోతున్నారు. రోజూ లక్షలాది మంది భక్తులు పోటెత్తుతున్నారు. మరోవైపు ఇదే అదనుగా దొంగలు రెచ్చిపోతున్నారు. సందట్లో సడేమియాలో చెలరేగిపోతున్నారు. వరుస చోరీలతో భక్తులను బెంబేలెత్తిస్తున్నారు. రాజమండ్రి పుష్కరాల్లో దొంగల బెడద ఎక్కువైంది....

Thursday, July 16, 2015 - 06:42

హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల్లోనూ మున్సిపల్ కార్మికుల సమ్మె ఉధ్రుతం అవుతోంది. మరోవైపు ప్రభుత్వానికీ, కార్మికులకీ జరుగుతున్న చర్చల్లో ఇంకా పరిష్కారం లభించలేదు. ఉభయ రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో కార్మిక నేతల, కార్మికుల అరెస్టులు సాగుతున్నాయి. ఇంతకీ కార్మికులు ఎందుకు సమ్మె చేస్తున్నారు? వారి డిమాండ్స్ ఏమిటి? చర్చల్లో ప్రభుత్వం ఏం చెబుతోంది? ప్రభుత్వం నుంచి...

Tuesday, July 14, 2015 - 21:34

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పుష్కరాలలో తొక్కిసలాట జరగడంతో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. 300లకు పైగా భక్తులు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈనేపథ్యంలో పుష్కరాలు, ఉత్సవాలలో జరుగుతున్న తొక్కిసలాట, ప్రమాదాలపై టెన్ టివి 'ఎవరిదీ.. పాపం..' అనే టైటిల్ పేరుతో వైడ్ యాంగిల్ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. పలు పుణ్యక్షేత్రాల వద్ద, పుష్కరాలలో తొక్కిసలాటలు, ప్రమాదాలు ఎలా...

Tuesday, July 14, 2015 - 13:21

హైదరాబాద్ : మహాపుష్కరాల్లో తీవ్ర విషాదం నెలకొంది. రాజమండ్రి పుష్కరఘాట్ మొదటి ద్వారం వద్ద జరిగిన తీవ్ర తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు..వీఐపీలు పుణ్యస్నానాలు ఆచరించిన తరువాత ఈ ఘటన చోటు చేసుకోవడం అందర్నీ కలిచివేసింది. దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.పది లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు....

Tuesday, July 14, 2015 - 11:26

పౌషికాహారం అందించి భావి పౌరులుగా తయారు చేస్తామని చెప్పారు. ఉద్ధేశ్యం బాగానే ఉంది కానీ ఆచరణలో చిత్తశుద్ధి లోపించింది. నిధులు కేటాయించరు..నిర్వాహణ పట్టించుకోరు. శుచి..శుభ్రత..నాణ్యత గాలికొదిలేశారు. ఆఖరుకు చిన్నారులు..బాలింతలే కాదు వండివార్చే కార్మికులను గాలికొదిలేశారు. సమస్యల వలయంలో చిక్కుకున్న అంగన్ వాడీలు మధ్యాహ్నా భోజన పథకాలపై ప్రత్యేక కథనం..

Tuesday, July 14, 2015 - 11:22

ఎవరు ఏం తినాలో నిర్ధేషిస్తున్నారు. ఏ విశ్వాసాలు ఉన్నతమో వారే నిర్వచిస్తున్నారు. ప్రజలంతా తమ ఆలోచనలకు తగ్గట్టుగా ఉండాలని భావిస్తున్నారు. ఇందులో బయటకు చెప్పని అజెండా అంతర్లీనంగా ఉందా ? ఒకరు మదర్సాలను క్రమబద్దీకరిస్తామని పేర్కొంటారు. మరొకరు తినే తిండిపై నియంత్రణ విధించాలని అంటారు. అసలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏం జరుగుతోందనే దానిపై ప్రత్యేక కథనం..

Tuesday, July 14, 2015 - 10:25

మహిళల సమస్యలపై తక్షణ స్పందన..ఉద్యమాల్లో ప్రత్యేక గొంతుక..ఆపదలో ఉన్న మహిళలకు భరోసా..బాధిత మహిళలకు ఆలంబన..ఒక రచయిత్రి..ఒక జర్నలిస్టు..ఒక స్త్రీ వాది..స్వశక్తిని నమ్మే మహిళ ప్రత్యేక కథనం..

Sunday, July 12, 2015 - 12:58

సాహిత్యం నేపథ్యంగా ఉన్న వారి జీవితాల్లో విలువలుంటాయి. వెలుగులుంటాయి. జాలి, ప్రేమ, కరుణలు జాలు వారుతుంటాయి. సృజన కారుల కళ్లల్లో మానవత్వం తొనికిసలాడుతుంటుంది. సమ సమాజం కోసం ఎందరో కవులు..రచయితలు కలలు కన్నారు. కలాలు ఝులిపించారు. సృజన స్వరాలై గర్జించారు. తమ ధిక్కార స్వరాలు వినిపించారు. అలాంటి వారిలో డా.రావి రంగారావు ఒకరు.
'నీ కన్నుల వృషభాలు వాలు చూపుల నాగలి కట్టి నా...

Sunday, July 12, 2015 - 12:49

మట్టి నరాలు తెగిన చోట పచ్చదనం శ్వాసించదంటూ ప్రపంచీకరణ ఇంద్రజలాన్ని కవిత్వంతో ఇంద్రజాలంగా మార్చిన యువ కవితా కెరటం గవిడి శ్రీనివాస్. మానసిక నేత్రంతో ప్రపంచాన్ని వీక్షించి చీకట్లో వెలుగుతున్న ఆత్మను కవిత్వంగా ఆవిష్కరించిన అనుభూతి కవి. గవిడి శ్రీనివాస్ పరిచయ కథనం..

Sunday, July 12, 2015 - 12:43

బాల్యం ఎగిరి గంతులేస్తుంది. యవ్వనం గంభీరంగా రంకెలేస్తుంది. వృద్దాప్యం మౌనంగా ఘోషిస్తుందని అంటారో ఓ కవి. కానీ తెలంగాణ కళాకారుడు మాత్రం ఈమూడు దశల్లోనూ పాటై పల్లవిస్తాడు. భావమై పరిమళిస్తాడు. కాళ్ల గజ్జెలు ఘల్లుమనేలా వేదికపై కదం తొక్కుతాడు. కరుణ..వీర..రౌద్ర రసాలను ఏకకాలంలో పోషిస్తాడు. మానత్వం సజీవంగా ఉందని చాటి చెబుతాడు. అలాంటి ఉత్తమ ఉపాధ్యాయుడు, ప్రజా వాగ్గేయకారుడే బయ్యారం...

Saturday, July 11, 2015 - 13:38

ప్రత్యేక సందర్భాలలో ఇంటిని నచ్చిన విధంగా అలకరించుకోవడానికి ఎంతో మంది ఆసక్తి కనబరుస్తారు. అలాంటి వారి కోసం మానవి 'సొగసు' లో కొత్త రకమైన ముగ్గుల కోసం వీడియో క్లిక్ చేయండి. 

Wednesday, July 8, 2015 - 08:02

హైదరాబాద్:తెలుగు రాష్ట్రాల్లో ప్రసుత్త పరిణామాలపై జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ కామెంట్లలో స్పష్టత లేదని సీనియర్ రాజకీయ విశ్లేషకులు నడింపల్లి సీతారామరాజు 'న్యూస్ మార్నింగ్' చర్చలో అన్నారు. తెలంగాణ లో టిడిపి ని లేకుండా చేయాలని టిఆర్ ఎస్ చూస్తోందా? టిఆర్ ఎస్ కుట్రలో భాగంగానే సండ్ర, రేవంత్ లు అరెస్టు అయ్యారా? ఓటుకు నోటు కేసు బలహీనమౌతోందా? కేసీఆర్ తో పవన్...

Tuesday, July 7, 2015 - 19:41

ఆదిలాబాద్ జిల్లాలో ప్రాణహిత - చేవెళ్ల రగడ సృష్టిస్తోంది. డిజైన్ మార్పు నిర్ణయంపై సెగలు రేగుతున్నాయి. ఇప్పటి వరకు రూ.4,489 కోట్ల పనులు వృథాయేనా అనే సందేహాలు కలుగుతున్నాయి. కాళేశ్వరంలో నిర్మిస్తే 90 మీటర్ల ఎత్తులో వాటర్ ఫ్లో జరగనుంది. కానీ విద్యుత్ ఉత్పత్తి జరిగే అవకాశం లేదు. తుమ్మిడి హెట్టి వద్ద నిర్మిస్తే 150 మీటర్ల ఎత్తులో వాటర్ ఫ్లో జరుగనుందని, విద్యుత్ ఉత్పత్తికి అవకాశం...

Sunday, July 5, 2015 - 12:56

'చిత్తజల్లు వరహాలరావు' ఒక సాంఘీక విప్లవకారుడే కాదు. సాంస్కృతిక రథసారధి. నిజాలను నిగ్గు తేల్చిన నిత్య పరిశోధకుడు. శ్రీశ్రీ కవిత్వం యువతరం గుండెలను ఎలా ఉర్రూతలూగించిందో 'సివి' రచనలు విద్యార్థి, యువజనుల లోకపు మస్తిష్కాలకు పట్టిన ఛాందస భావాల దుమ్ము దులిపింది. వారిని అభ్యుదయం వైపు నడిపించింది. శాస్త్రీయ విజ్ఞానం ప్రజల్లో పెంపొందించడానికి ఆయన చేసిన కృషి అనితర సాధ్యం అంటే అందులో...

Sunday, July 5, 2015 - 12:43

'అక్షరం' లక్ష మెదళ్ల కదలిక అని కాళోజీ నారాయణ రావు అన్నారు. ఈ మాట అక్షరాల సాంస్కృతిక విప్లవకారుడు 'చిత్తజల్లు వరహాలరావు'కు వర్తిస్తుంది. 'సివి'గా ప్రసిద్ధి పొందిన వరహాల రావు అభ్యుదయ భావాలతో 'సత్యకామ', 'జాబాలి' లాంటి ఎన్నో గ్రంధాలు రాశారు. కులమత ఛాందస భావాలను తన రచనలో దుయ్యబట్టారు. ఆయన సమగ్ర రచనల సంకలాలను 'ప్రజాశక్తి' బుక్ హౌస్ వెలుగులోకి తెచ్చింది. ఇటీవల విజయవాడలో 'సివి...

Saturday, July 4, 2015 - 07:57

రేవంత్‌రెడ్డి బెయిల్‌ వ్యవహారంలో తెలంగాణ ఎసిబికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఓటుకు నోటు వ్యవహారంలో టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్‌, ఉదయసింహలకు ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఎసిబి దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఏ ప్రతిపాదికపై రేవంత్‌రెడ్డి బెయిల్‌ రద్దు కోరుతున్నారని ఎసిబిని కోర్టు ప్రశ్నించింది. రేవంత్‌రెడ్డికి...

Friday, July 3, 2015 - 19:44

హైదరాబాద్: పేదలకు రాయితీల కోత విధిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఆ బిల్లులను ఆమోదించే ఎంపీలపై ప్రేమ మాత్రం టన్నుల కొద్దీ ప్రేమ కురిపిస్తోంది. పార్లమెంటు క్యాంటీన్లో సబ్సిడీ రేట్లకు ఆహార పదార్థాలు సరఫరా చేయడమే కాదు...ఇప్పుడు వారి జీతాన్ని డబుల్ చేయాలని భావిస్తోంది. శాలరీలు, పెన్షన్లతో పాటు అనేక సదుపాయాలు ఎంపీలకు కల్పించాలని పార్లమెంటరీ ప్యానెల్ సిఫారసులు చేసింది...

Friday, July 3, 2015 - 19:43

పార్లమెంటు సభ్యుల జీతభత్యాలు, వసతుల పెంపుపై ఎంపీ యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలో జాయింట్ కమిటి వేసింది కేంద్ర ప్రభుత్వం. కొన్ని నెలల నుంచి దీనిపై కసరత్తు చేస్తున్న కమిటీ దాదాపు 65 ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ముందుంచినట్టు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రతిపాదనల్లో ఎంపీల జీతం డబుల్ చేయాలని కమిటీ సిఫారసు చేసింది. పెన్షన్ కూడా భారీగా పెంచాలని, విమానం, రైల్వే...

Friday, July 3, 2015 - 18:32

కర్నూలు:వైసీపీ నేత, శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాల కోసం జరిగిన పోలింగ్ సందర్భంగా ఆయన పోలీసు అధికారులతో దురుసుగా ప్రవర్తించారు. ఎమ్మెల్యే తమ విధులకు అడ్డుతగిలారంటూ పోలీసులు ఫిర్యాదు చేశారు. అరెస్టు చేసిన భూమాను త్రీటౌన్ పీఎస్ కు తరలించారు. ఆయనపై 353, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యింది. భూమా...

Friday, July 3, 2015 - 17:37

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో...ముందునుండి అన్ని విషయాలు తెలిసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తొలిసారిగా స్పందించారు. తనకు అన్ని విషయాలు తెలిసినప్పటికీ అవన్నీ ప్రస్తావించదలుచుకోలేదంటూనే కొన్ని కీలక వాఖ్యలు చేశారు. ప్రజల కోరిక మేరకు కల సాకారమైందని, తెలంగాణ, ఆంద్రప్రదేశ్ గా రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయని చెప్పారు. ఇక ప్రజలంతా దేశ అభివద్ధి కోసం కలిసి...

Friday, July 3, 2015 - 17:34

హైదరాబాద్:తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ దగ్గర పడుతున్న కొద్ది టెన్షన్ కొనసాగుతునే ఉంది. ఎన్ని సీట్లు ఉంటాయో.. ఎన్ని కాలేజీలు రద్దు అవుతాయోననే అయోమయం నెలకొంది. 25 కాలేజీలను రద్దు చేసిన జెఎన్టీయూ.. సుమారు..40 వేల సీట్లకు కోత విధించింది. వసతులు లేని కాలేజీలకు కొన్ని కోర్స్ లను పూర్తిగా రద్దు చేసింది...

Friday, July 3, 2015 - 17:30

హైదరాబాద్: నిన్నటి దాకా ఏపీ తమ్ముళ్లంతా టార్గెట్ చేశారు. ఆయన పద్దతి బాలేదని పబ్లిక్‌లోనే ఫైరయ్యారు. పక్షపాత వైఖరిని మానుకోవాలని ఘాటుగా విమర్శించారు. ఇరురాష్ట్రాలను సమానంగా చూడాలని మండిపడ్డారు. ఇపుడు తాజాగా ఓ తెలంగాణ నేత గవర్నర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగాన్ని కాపాడలేకపోతే... పదవి నుంచి తప్పుకోండని పరోక్షంగా ఓ లేఖను సంధించారు...

Pages

Don't Miss