Specials

Friday, July 3, 2015 - 17:03

హైదరాబాద్: నెలల పసికందు నుండి పండు ముదుసలి వరకు కామాంధుల ఆగడాలకు బలవుతున్నారు. అయిన వారే చిన్నారులపై తెగబడుతున్నారు. ఈ స్థితి పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? పిల్లలను కాపాడుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇవాళ్టి నిర్భయలో డాక్టర్ సుధ సైక్రియాటిస్టు తెలియజేశారు. ఆ వివరాలను ఈ వీడియోను క్లిక్ చేయండి...

Friday, July 3, 2015 - 17:00

హైదరాబాద్:ఆడపిల్లలు మొబైల్ ఫోన్లు ఉపయోగించకూడదు, జీన్స్ ధరించకూడదు, సోషల్ మీడియా వినియోగించకూడదంటూ రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మేర్ జిల్లాలోని గ్రామపంచాయితీ విధించిన ఆంక్షలను ఖండిస్తూ మహిళల ప్రియనేస్తం మానవికి స్వాగతం పలుకుతున్నాం.
అత్యాచార కేసులకు సంబంధించి సుప్రీంకోర్టుకీలక వ్యాఖ్యలు.....
అత్యాచార కేసులకు సంబంధించి...

Friday, July 3, 2015 - 16:57

హైదరాబాద్: ఫ్యాషన్ ను ఫాలో అవటంలో టీనేజర్స్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ఎప్పటికప్పుడు కొత్త దనాన్నీ కోరుకుంటారు. అలాంటి టీనేజర్స్ కోసం లాంగ్ ఫ్రాక్స్ తో ఇవాళ్టి సొగసు నారాయణ గూడలోని సనా క్రేజీ ఫ్యాషన్స్ మీ ముందుకు వచ్చింది. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

 

Friday, July 3, 2015 - 16:39

హైదరాబాద్: విజయనగరం జిల్లా భోగాపురంలో ఉద్రిక్తత నెలకొంది. మండలంలో ఎయిర్ పోర్టు ఏర్పాటు కోసం... సర్వే బృందం భూ పరిశీలనకు వచ్చింది. వారిని బాధిత గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. కొయ్యపేట గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయబోయారు. పక్కనే ఉన్న మహిళలు అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. తమ భూముల్లోకి రావద్దంటూ అధికారులను అక్కడి...

Friday, July 3, 2015 - 16:38

హైదరాబాద్: పోలీసులకు వారాంతపు సెలవులు అందని ద్రాక్షగానే మిగిలింది. రోజుకు గంటల తరబడి విధులు నిర్వహించే పోలీసులకు.. ఒక్కరోజైనా సెలవు లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. వీక్లీ ఆఫ్‌ కావాలని దశాబ్ధాల తరబడి అడుగుతున్నా.. అది ఇంకా పెండింగ్‌లోనే ఉంది. పోలీసులకు వీక్లీ ఆఫ్‌ ఇస్తామని తెలంగాణ సర్కార్‌ హామీ ఇచ్చి ఏడాది గడిచినా.. అది ఇంకా అమలుకు నోచుకోలేదు.
...

Friday, July 3, 2015 - 11:53

సిటీలు పెరుగుతున్నా పార్కులు పెరగడం లేదు. సమాజానికీ, ప్రకృతికీ ఎంతో మేలు చేసే పార్కుల విషయంలో ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. పార్కులకు కేటాయించిన భూములు కబ్జా అవుతున్నా అధికారులు నిద్ర నటిస్తున్నతీరు ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైనా పార్కుల నిర్వహణపై శ్రద్ధ పెట్టకపోతే ఫలితాలు దారుణంగా వుంటాయి.                                                          ...

Friday, July 3, 2015 - 11:38

జేఈఈ ర్యాంకుల విషయంలో విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న వారిపై ప్రభుత్వం క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ది హన్స్ ఇండియా ఎడిటర్ నాగేశ్వర్ అన్నారు. గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ విశ్లేషణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జేఈఈ ర్యాంకులు ప్రకటించడంలో ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. వారిని ఉద్యోగాల నుంచి భర్తరఫ్ చేయాలని చెప్పారు. విద్యారంగంలోని వ్యవస్థను...

Friday, July 3, 2015 - 10:51

చర్లపల్లి జైలు నుంచి విడుదలైనప్పుడు జైత్రయాత్రలో రేవంత్ రెడ్డి చేసిన సరైనవి కావని వక్తలు తెలిపారు.ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టిఆర్ ఎస్ నేత.. రాకేష్ , టిడిపి నేత సతీష్ మాదిగ, మాజీ ఎమ్మెల్సీ కె.లక్ష్మణ్ రావు మాట్లాడారు. బెయిల్ ఇచ్చినంత మాత్రాన రేవంత్ నిర్దోషి కాదని చెప్పారు. అవినీతికి బ్రేక్ వేయాల్సిన అవసరముందన్నారు. మరిన్ని వివరాలు వీడియోలో చూద్దాం...

...
Friday, July 3, 2015 - 09:39

పార్కుల కబ్జా వెనుక రాజకీయనేతల హస్తముందని ఫ్యాకా అధ్యక్షుడు అంజయ్య అన్నారు. ఇరు రాష్ట్రాల్లో పార్కుల నిర్వహణలో ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయని చెప్పారు. పార్కులను రక్షించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. 'ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పార్కుల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. హైదరాబాద్‌లో పార్క్‌లు కబ్జా అవుతున్నా అధికారగణం చోద్యం చూస్తోంది...

Thursday, July 2, 2015 - 19:36

హైదరాబాద్:నిజాం నిరంకుశత్వంపై బిగిసిన పిడికిలి.. ఇప్పుడు చేయి చాస్తోంది..! రజాకార్లపై నిప్పులు కురిపించిన కళ్లు.. నేడు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి..! దౌర్జన్యంపై గళమెత్తిన స్వరం ఆవేదనతో మూగబోతుంటే.., దుర్మార్గాలను ప్రతిఘటించిన గుండె ధైర్యం కోల్పోతోంది..! పోరాటం ఫలించినా, ప్రతిఫలం మాత్రం దక్కలేదు..! జీవితాన్ని ధారపోసినా, ఆధారం మాత్రం లభించలేదు..! నాడు నిజాం...

Thursday, July 2, 2015 - 18:34

రెక్కడితేగానీ డొక్కాడని పరిస్థితి వారిది. పనిలేకపోతే పూటగడవని ధీనస్థితి వారిది. అలాంటి వారి జీవితాల్లో...రాజధాని పేరుతో చీకట్లు నింపారు. భూమిలిచ్చే రైతులకు హామీల మీద హామీలు గుప్పిస్తున్నారు. కానీ రైతుల కుడి భుజాలైన... కూలీలను మాత్రం మరిచిపోతున్నారు. నిన్నటిదాకా చేతి నిండా పనితో...కడుపు నిండా అన్నం తిన్న కూలీలు....ఇప్పుడు పనులు లేక పస్తులు ఉంటున్నారు. రాజధాని కూలీల కష్టాలపై...

Thursday, July 2, 2015 - 18:30

కడప జిల్లా టీడీపీలో వర్గపోరు తారా స్థాయికి చేరుతోంది.. ఏపీ సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన సీఎం రమేష్‌ తీరుపై స్థానిక నేతలు భగ్గుమంటున్నారు.. ఆయన ఒంటెద్దుపోకడలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. జిల్లాలో టీడీపీ పరాభవానికి సీఎం రమేష్‌ నిర్ణయాలే కారణమంటున్నారు నేతలు.. అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు సీఎం రమేష్‌ ప్రాధాన్యం ఇచ్చిన ఫలితమంటున్నారు తమ్ముళ్లు.. బద్వేల్,...

Thursday, July 2, 2015 - 16:50

ఢిల్లీ: ఓటుకు నోటు కేసులో... రేవంత్‌ బెయిల్‌పై... సుప్రీంకోర్టులోనూ న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని... తెలంగాణ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు సన్నిహితులైన జడ్జిలు సుప్రీంకోర్టులో వుండటమే ఇందుకు కారణమన్నారు. . హైకోర్టులోనూ దాదాపు 70శాతం మంది చంద్రబాబుకు అనుకూలమైన వారున్నారని... అందుకే అక్కడ న్యాయం...

Thursday, July 2, 2015 - 16:34

తుళ్లూరు: ఏపీ రాజధాని ప్రాంతంలో చైనా ప్రతినిధి బృందం పర్యటించింది. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లో పర్యటించిన బృందం.. పలు అంశాలపై అధ్యయనం చేసింది. అంతకుముందు.. విజయవాడలో కలెక్టర్, ప్రభుత్వాధికారులతో సమావేశమైన చైనా ప్రతినిధి బృందం.. రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు, అభివృద్ధి అంశాలపై చర్చించారు. రాజధాని మాస్టర్‌ ప్లాన్‌తో పాటు.. ఏపీలోని 13...

Thursday, July 2, 2015 - 08:34

అత్యాచార ఘటనలో నిందితులకు శిక్ష పడాల్సిందేనని ద హాన్స్ ఆఫ్ ఇండియా ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ పేర్కొన్నారు. కేసీఆర్ గద్దె దించేంతవరకు పోరాడుతానని టిటిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆవేశ పూరితంగా ప్రసంగించారు. మరోవైపు డీఎస్ టీఆర్ఎస్ లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. రేప్ కేసులలో నిందితులు..బాధితుల మధ్య...

Thursday, July 2, 2015 - 07:55

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కుటుంబాన్ని రాజకీయాల నుండి తరిమికొడుతానని ఓటుకు నోటు కేసులో జైలు నుండి విడుదలైన టిటిడిపి ఎమ్మెల్యే ఎ.రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. చర్లపల్లి జైలు ప్రాంగణంలో రేవంత్ ఆవేశపూరిత ప్రసంగం చేశారు. రేవంత్ వ్యాఖ్యలను పలువురు ఖండించారు. మరో వైపు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాలు బుధవారం ఇచ్చిన బంద్...

Thursday, July 2, 2015 - 07:07

తెలంగాణలో గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మెలోకి దిగారు. ఈ సమ్మెకు కారణం ఏమిటి? ప్రభుత్వం ముందు పంచాయితీ కార్మికులు పెడుతున్న డిమాండ్సేమిటి? గతంలో వీరికి ప్రభుత్వం ఇచ్చిన హామీలేమిటి? వాటి అమలుతీరు ఎలా వుంది? ఈ అంశంపై జనపథంలో సీఐటీయూ నేత పాలడుగు భాస్కర్‌, ఐఎఫ్‌టీయూ నేత ఎస్‌ఎల్‌ పద్మ మాట్లాడారు.

Thursday, July 2, 2015 - 07:05

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నాళ్లయినా గ్రామపంచాయితీలలో ఇంకా వెట్టి చాకిరీ తప్పడం లేదు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలోనూ ఈ కష్టాలు తప్పడం లేదు. వినడానికి ఆశ్చర్యంగా వున్నా ఇది నిజం. ఈ రోజుల్లో కూడా అయిదు వందలు వెయ్యి రూపాయల జీతాలతో సరిపెడుతున్నారంటే దానిని వెట్టి చాకిరీ అనక మరేమంటారు? గ్రామ పంచాయితీలలో విభిన్న రకాల విధులు నిర్వర్తించే సిబ్బంది వుంటారు. నీటి సరఫరా...

Wednesday, July 1, 2015 - 21:20

తిరుమల: దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనం ప్రశాంతంగా జరిగింది. తొలుత తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్నారు ప్రెసిడెంట్. గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబునాయుడుతో కలిసి రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా తిరుచానూరు చేరుకున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఆలయ అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. తర్వాత ఆలయంలో...

Wednesday, July 1, 2015 - 19:41

హైదరాబాద్:యూరోపియన్ జోన్ కు గ్రీస్ షాక్ ఇచ్చిందా? గ్రీస్ సంక్షోభాన్ని ప్రాపంచక దృక్పధంతో చూడాల్సిన అవసరంవుందా? గ్రీస్ ప్రభావం భారత్ పై పడుతుందా? గ్రీస్ సంక్షోభం అనుభవాన్ని మనం ఎలా అర్ధం చేసుకోవాలి? రూ.170 కోట్ల డాలర్ల రుణాన్ని తీర్చలేనని గ్రీస్ చెప్పిందా? కొత్త షరతులు ఒప్పుకోవాలని యూరోపియన్ కమిషన్ చీఫ్ ఒత్తిడి చేస్తున్నాడా? జులై5న రెఫరెండం నిర్వహిస్తానని...

Wednesday, July 1, 2015 - 18:33

హైదరాబాద్:సముద్రమే వారి జీవనాధారం. బతుకు పోరులో ఎన్నో కష్టాలు.. మరెన్నో సవాళ్లు. అయినా వాటన్నింటినీ అధిగమించి.. నిత్యం శ్రమిస్తారు. ప్రకృతి కన్నెర్ర జేసినా.. ప్రేమిస్తారు. విపత్తులు ఆగ్రహించినా.. కరుణిస్తారు. కాలం కలిసిరాకున్నా.. ఓపికతో ఎదురుచూస్తారు. కొన్నాళ్లుగా ప్రకృతి విధ్వంసంతో పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోతున్న మత్స్యకారులకు తీపి కబురు అందుతోంది....

Wednesday, July 1, 2015 - 18:31

చిత్తూరు:ఐఏఎస్ అయిన ఆయన అకస్మాత్తుగా రాజకీయాల్లోకి వచ్చారు. 2009 ఎన్నికల్లో ఓటమి ఎదురైనా, 2014 ఎన్నికల్లో ఎంపీ విజయం సాధించారు. ఎన్నెన్నో హామీలతో ఎంపీ పదవి చేజిక్కించుకున్న ఆయన, చివరకు ప్రజలకు కనిపించకుండా పోతున్నారు. చెన్నైలో నివాసముంటూ, అడపాదడపా సొంత నియోజకవర్గంకు వచ్చిపోతున్నారు. ఇంతకీ నియోజకవర్గంలో కనబడకుండా పోయినా ఆ ప్రజాప్రతినిధి ఎవరు.?
ప్రజలు...

Wednesday, July 1, 2015 - 18:25

విశాఖ:రావికమతం మండలం, ఆర్‌.కొత్తూరులో గ్రామపెద్దలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. భూమిని కౌలుకు ఇవ్వడం లేదని ఆగ్రహంతో గ్రామంలోని మూడు కుటుంబాలను గ్రామపెద్దలు బహిష్కరించారు. అప్పరావు అనే కుటుంబంతో పాటు మరో రెండు కుటుంబాలను గ్రామం నుండి వెలివేశారు. దీంతో బాధితులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక నేతలతో కలిసి వచ్చిన పోలీసులు.. గ్రామంలో పంచాయతీ పెట్టి వివరాలు...

Wednesday, July 1, 2015 - 17:00

హైదరాబాద్: ఏ కాలమొచ్చినా హైదరాబాదీ వాసులకు నీటి కష్టాలు పరిష్కారం కావడం లేదు. వర్షాకాలం వచ్చినా.. తాగునీటి సమస్య తీరడం లేదు. ఫలితంగా రోజు రోజుకు నీటి వ్యాపారం పెరిగిపోతోంది. పట్టణాలు, నగరాల్లోనే కాదు.. మారుమూల గ్రామాల్లోనూ నీటి వ్యాపారం పుంజుకుంది. హైదరాబాద్‌లో ప్రతిరోజూ 340 మిలియన్‌ గ్యాలన్ల నీటిని అందిస్తున్నట్లు జలమండలి లెక్కలు...

Wednesday, July 1, 2015 - 14:43

హైదరాబాద్ : ఎక్స్ ట్రా మ్యారిటల్ లైఫ్(అక్రమ సంబంధం) అంటే ఏమిటి? అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళకు శిక్ష పడుతుందా? లేదా పురుషునికే శిక్ష పడుతుందా? ఎక్స్ ట్రా మ్యారిటల్ విడాకులకు గ్రౌండ్ అవుతోందా? ఇలాంటి అంశాలపై మానవి కార్యక్రమంలో 'వేదిక'లో చర్చా కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ చర్చలో ప్రముఖ న్యాయవాది పార్వతి పాల్గొన్నారు. వారు చర్చించిన అంశాలు.. ప్రేక్షకుల...

Wednesday, July 1, 2015 - 08:39

కేజీ బేసిన్ లో కేంద్రానికి వచ్చే వాటాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాయల్టీ ఇవ్వాలంటూ కొద్ది రోజుల క్రితం ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. కానీ కేంద్రం నుండి సానుకూల స్పందన రాలేదు. ఈవిషయంలో ప్రతిపక్షాలు సైలెంట్ గా ఉండడం పరిశీలకులను ఆశ్చర్యపరుస్తోంది. మరోవైపు ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ టీఆర్ఎస్ లో...

Wednesday, July 1, 2015 - 08:10

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడైన తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయనతోపాటు ఈ కేసులో సహ నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ్ సింహాలకు కూడా బెయిల్ మంజూరైంది. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వస్తున్నాయి. పార్టీలోని పరిస్థితులపై సోనియాకు డీఎస్ లేఖ...

Pages

Don't Miss