బాటిల్ క్యాప్ చాలెంజ్ లో గెలిచిన క్రీడామంత్రి

Submitted on 12 July 2019
 Sports Minister Kiren Rijiju Nails BottleCapChallenge, Internet Cheers

సోషల్ మీడియా ఫాలోవర్స్ అందరికీ ఇప్పుడు బాటిల్ క్యాప్ చాలెంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక చాలెంజ్ వైరల్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు బాటిల్ క్యాప్ చాలెంజ్ కొన్ని రోజులుగా వైరల్ అవుతోంది. అయితే ఇది అంత ఈజీ చాలెంజ్ కాదు. అందరూ ఈ చాలెంజ్‌లో విన్ కాలేరు. దీనికి టెక్నిక్ కావాలి. బాటిల్‌కు ఉన్న క్యాప్‌ను వెనుక నుంచి పాదాలతో తన్ని తీయాలి. అదే బాటిల్ క్యాప్ చాలెంజ్. ఈ చాలెంజ్‌లో ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. 

అయితే ఇప్పుడు  కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ బాటిల్ క్యాప్ చాలెంజ్‌ లో పాల్గొన్నారు. ఆ చాలెంజ్‌లో విన్ అయిన వీడియోను రిజుజు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ లో షేర్ చేశారు.డ్రగ్స్ కి నో చెప్పండి,ఫిట్ ఇండియా క్యాంపెయిన్ కి రెడీగా ఉండండి అన్న హ్యాష్ ట్యాగ్ లతో ఆయన ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రిజిజు పై ప్రశంసలు కురిపిస్తున్నారు. క్రీడా మంత్రి అంటే మీలాగే ఫిట్ గా ఉండాలి సార్ అంటూ ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఫిట్‌నెస్ విషయంలో రిజుజు చాలా జాగ్రత్తలు తీసుకుంటారనే విషయం తెలిసిందే. ఆయన ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలను కూడా అప్పుడప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేస్తుంటారు.

నిజానికి ఈ బ్యాటిల్ క్యాప్ చాలెంజ్‌ ను టైక్వాండో నిపుణుడు, ఫైటర్ ఫరాబి స్టార్ట్ చేశాడు. అలా అలా..అది ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది. చివరకు ప్రముఖులు కూడా ఈ చాలెంజ్‌లో పాల్గొంటున్నారు.

SPORTS MINISTER
KIRAN RIJIJU
BOTTLECAP CHALLENGE
win
cheers
Netizens
instagram
Video
fitness


మరిన్ని వార్తలు