Sports

Sunday, January 22, 2017 - 22:01

హైదరాబాద్ : తెలంగాణ కబడ్డీ ప్రీమియర్ లీగ్ లో భాగంగా హైదరాబాద్, గద్వాల్ ల మధ్య జరిగిన కబడ్డీ పోటీల్లో హైదరాబాద్ జట్టు గెలుపొందింది. హన్మకొండలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి. 

 

Sunday, January 22, 2017 - 20:04

వరంగల్ : తెలంగాణ కబడ్డీ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఖమ్మం, సిద్ధిపేట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో సిద్ధిపేట్ విజయం  సాధించింది. 11 పాయింట్స్ తేడాతో ఖమ్మం పై సిద్ధిపేట్ గెలుపొందింది. ఖమ్మం 20 పాయింట్లు, సిద్ధిపేట్ 31 పాయిట్లు సాధించింది. హన్మకొండలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో కబడ్డీ ప్రీమియర్ లీగ్ పోటీలు జరుగుతున్నాయి.

Sunday, January 22, 2017 - 19:49

ఢిల్లీ : భారత్ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కొత్త ఏడాదిలో శుభారంభం చేసింది. మలేసియా మాస్టర్‌ గ్రాండ్‌ ప్రి గోల్డ్‌ బాడ్మింటన్‌ టైటిల్‌ను సైనా కైవసం చేసుకుంది. ఇవాళ హోరాహోరీగా సాగిన ఫైనల్లో థాయిలాండ్‌ క్రీడాకారిణి చొచువాంగ్‌పై 22-20, 22-20 తేడాతో వరుస సెట్లలో గెలుపొందింది. గతేడాది రియో ఒలింపిక్స్ తరువాత గాయం కారణంగా పలు టోర్నీలకు దూరమైన సైనా.. ఎట్టకేలకు తన...

Sunday, January 22, 2017 - 07:26

మక్కా : ఇండియా,ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరుగుతున్న ఇన్‌స్టంట్‌ వన్డే సిరీస్‌ క్లైమాక్స్‌ దశకు చేరుకుంది. మూడు వన్డేల సిరీస్‌లోని ఆఖరాటకు ఇండియన్‌ క్రికెట్‌ మక్కా ఈడెన్‌ గార్డెన్స్‌ స్టేడియంలో రంగం సిద్ధమైంది. ఇప్పటికే సిరీస్‌ విజయం సాధించిన కొహ్లీ అండ్‌ కో క్లీన్‌స్వీప్‌పై కన్నేయగా ఆఖరి మ్యాచ్‌లో అయినా నెగ్గి తీరాలని ఓయిన్‌ మోర్గాన్‌ సారధ్యంలోని ఇంగ్లీష్‌ టీమ్‌...

Saturday, January 21, 2017 - 21:12

వరంగల్ : తెలంగాణ కబడ్డీ ప్రీమియర్ లీగ్ ప్రారంభం అయింది. హన్మకొండలోని జవహర్ స్టేడియంలో కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి. నల్గొండ, వరంగల్ జట్ల మధ్య కబడ్డీ మ్యాచ్ జరిగింది. ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. చివరకు నల్గొండ పై వరంగల్ విజయం సాధించింది. మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Saturday, January 21, 2017 - 20:31

వరంగల్ : తెలంగాణ కబడ్డీ ప్రీమియర్ లీగ్ ప్రారంభం అయింది. మంత్రి పద్మారావు పోటీలను ప్రారంభించారు. హన్మకొండలోని జవహర్ స్టేడియంలో కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి. మొదటగా కరీంనగర్, రంగారెడ్డి జట్ల మధ్య కబడ్డీ మ్యాచ్ జరిగింది. ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరుగా సాగింది. చివరకు కరీంనగర్ జట్టుపై రంగారెడ్డి జట్టు విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఉత్కంఠగా సాగింది....

Monday, January 16, 2017 - 07:04

హైదరాబాద్ : కోహ్లీ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ శుభారంభంతో మొదలైంది. ధోనీ నుంచి కెప్టెన్‌ పగ్గాలు అందుకున్న కోహ్లీ.. తొలి వన్డేలోనే భారత్‌ను విజయం వైపు నడిపించడంతో పాటు.. అద్భుతమైన సెంచరీ చేశాడు. అదేవిధంగా కోహ్లీ స్ఫూర్తితో కేదార్‌ జాదవ్‌ మెరుపులు మెరిపించి సెంచరీ చేశాడు. దీంతో భారత్‌.. గెలుపు వాకిట నిలవగా చివర్లో అశ్విన్‌ సిక్స్‌లతో టీమిండియా...

Sunday, January 15, 2017 - 19:06

రింగ్ లో ఉంటే ప్రత్యర్థులను మట్టికరిపించే ఒలింపియన్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మరి ఏంటీ కట్నం రూ. 1 అంటున్నారు ఆశ్చర్యపోతున్నారా. కానీ ఇది నిజం. కేవలం ఒక్క రూపాయి మాత్రమే కట్నం తీసుకుంటున్నాడంట. అది కూడా శుభసూచకంగా భావించి మాత్రమే రూపాయి కట్నం తీసుకుంటున్నట్లు యోగేశ్వర్ దత్ పేర్కొంటున్నాడు. జనవరి 16వ తేదీన హర్యానా కాంగ్రెస్ నేత జైభగవాన్ శర్మ తనయ శీతల్ ను...

Saturday, January 14, 2017 - 17:56

తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. జనవరి 21 నుండి ఫిబ్రవరి 7వరకు టోర్నీ జరగనుంది. ఎనిమిది జట్ల మధ్య కబడ్డీ వార్ జరగనుంది. లీగ్ కు తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ కు ఆమోదం తెలిపింది. వరంగల్, కరీంనగర్ వేదికగా లీగ్ పోటీలు జరగనున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కే.జగదీశ్వర్ తో టెన్ టివి ప్రత్యేక చర్చ చేపట్టింది. ఆయన ఎలాంటి...

Saturday, January 14, 2017 - 12:31

హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసేయేషన్(హెచ్ సీఎ) అధ్యక్ష పదవికి భారత మాజీ క్రికెటర్ అజరుద్దీన్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. అజారుద్దీన్ నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. తనమీద ఉన్న జీవితకాల నిషేధంపై అజరుద్దీన్ ఇచ్చిన వివరణకు బీసీసీఐ సంతృప్తి చెందలేదు. గతంలో మ్యాచ్ ఫిక్సింగ్ స్కామ్ కు సంబంధించిన  విషయంలో తనమీద ఉన్న జీవితకాల నిషేధంపై...

Friday, January 13, 2017 - 19:49

ఢిల్లీ : 2017 సీజన్‌లో టీమిండియా క్రికెట్‌ టీమ్‌ నయా జెర్సీతో బరిలోకి దిగనుంది. టీమిండియా జెర్సీ బ్రాండ్‌ ‘partner’ నైకీ సంస్థ సరికొత్త జెర్సీని విడుదల చేసింది. భారత క్రికెటర్లు ధోనీ, విరాట్‌ , అశ్విన్‌తో పాటు మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్‌తో కొత్త జెర్సీతో స్పెషల్‌ ఫోటోషూట్‌ వీడియోను విడుదల చేశారు. ఈ జెర్సీతోనే భారత జట్టు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో ఆడనుంది...

Friday, January 13, 2017 - 17:47

ఢిల్లీ : క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు ఒకే కెప్టెన్‌ ఉండడం సబబుగా ఉంటుందని ఇందుకు విరాట్‌ కోహ్లీ సిద్ధంగా ఉన్నాడని మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని అన్నారు. బాధ్యతయుత ఆటగాడిగా తాను జట్టులో కొనసాగుతానని తెలిపారు. వన్డే కెప్టెన్సీని వదులుకోవడానికి మానసికంగా సిద్ధమయ్యానని కోహ్లీ కెప్టెన్సీలో ఆడేందుకు ఉత్సాహంతో ఉన్నానని ధోని పేర్కొన్నారు. వికెట్‌ కీపర్‌గా...

Monday, January 9, 2017 - 12:39

భారత ఆఫ్ స్పిన్నర్ 'రవి చంద్రన్ అశ్విన్' తన బౌలింగ్ మాయతో ప్రత్యర్థులను ముప్పుతిప్పులు పెడుతుంటాడు. అంతేగాకుండా భారత్ కు పలు విజయాలు అందించాడు కూడా. మరణానంతరం తన నేత్రాలను దానం చేసేందుకు 'అశ్విన్' ముందుకొచ్చాడు. ఈ మేరకు హమీపత్రం మీద సంతకం కూడా చేశాడు. నేత్ర దానం చేయడం అనేది తన భార్య చిరకాల వాంఛ అని 'అశ్విన్' చెప్పుకొచ్చాడు. ఇటీవలే 'అశ్విన్' తండ్రి అయిన విషయం తెలిసిందే....

Friday, January 6, 2017 - 21:11

ఢిల్లీ : ఇంగ్లండ్‌తో వన్డే, టీ 20 సిరీస్‌కు ఇండియన్‌ టీమ్‌ను ప్రకటించారు. బీసిసిఐ చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్ కే ప్రసాద్‌ నాయకత్వంలోని సెలక్షన్‌ ప్యానెల్‌ రెండు సిరీస్‌లకు భారత జట్టును ప్రకటించారు. వన్డే, టీ 20 జట్టులో సీనియర్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ రీ ఎంట్రీ ఇవ్వగా,వెటరన్లు సురేష్‌ రైనా, అశిష్‌ నెహ్రాలను టీ 20 జట్టుకు ఎంపిక చేశారు.ఇన్‌స్టంట్‌ వన్డే, టీ 20...

Thursday, January 5, 2017 - 07:01

జార్ఖండ్ : ఆల్‌టైమ్‌ గ్రేట్‌ క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోని 2017 ఆరంభంలో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డేలు, టీ20లకు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. అయితే ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే, టి20 సిరీస్‌లకు అందుబాటులో ఉంటాడని ధోని నిర్ణయాన్ని బీసీసీఐ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం టెస్ట్‌మ్యాచ్‌లకు కెప్టెన్‌గా...

Monday, January 2, 2017 - 13:53

ఢిల్లీ : భారతదేశంలోని క్రికెట్ చరిత్రలో సంచలనం చోటు చేసుకుంది. బీసీసీఐపై సుప్రీం కొరడా ఝులిపించింది. ఏకంగా అధ్యక్ష పదవి నుండి అనురాగ్ ఠాకూర్ పై సుప్రీం వేటు పడింది. లోథా కమిటీ సిఫార్సులను అమలు చేయకపోవడంపై సుప్రీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఠాకూర్ తో పాటు కార్యదర్శి అజయ్ షిర్కేలను తొలగించింది. 2016 జులై 18వ తేదీన లోథా కమిటీ పలు సిఫార్సులను తెలియచేసింది....

Friday, December 30, 2016 - 12:06

టీమిండియా స్టార్ ఆటగాడు 'విరాట్ కోహ్లీ'..బాలీవుడ్ నటి 'అనుష్క శర్మ' లు ఎంగేజ్ మెంట్ చేసుకుంటున్నారంటూ వస్తున్న వార్తలు నిజం కాదని తేలిపోయింది. గత కొద్ది రోజులుగా వీరు ప్రేమలో మునిగిపోతున్న సంగతి తెలిసిందే. క్రిస్మస్ సందర్భంగా ఉత్తరాఖండ్ కు వెళ్లిన ఈ జంట త్వరలోనే ఎంగేజ్ మెంట్ చేసుకోబోతున్నట్లు సోషల్ మాధ్యమాల్లో తెగ ప్రచారం జరిగింది. న్యూ ఇయర్ సందర్భంగా కోహ్లీ - అనుష్కలు...

Friday, December 30, 2016 - 10:04

ప్రముఖ క్రికేటర్ 'విరాట్ కోహ్లీ' నిశ్చితార్థం చేసుకోబోతున్నాడా ? ఇక దాగుడుమూతల స్టోరికీ చెక్ పెట్టనున్నాడా ? ఈ మేరకు ఏర్పాట్లన్నీ చకచకా సాగిపోతున్నాయా ? దీనిపై సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. గత కొద్దికాలంగా టీమిండియా కెప్టెన్ 'విరాట్ కోహ్లీ'..బాలీవుడ్ నటి 'అనుష్క శర్మ' లు ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి పలు వేడుకల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే....

Monday, December 26, 2016 - 12:41

కోల్ కతా : విధ్వంకర బ్యాటింగ్ ఎప్పుడైనా చూశారా ? టీ20, ఇతర వన్డేల్లో చూస్తూనే ఉంటాం అని అంటారు కదా..కానీ ఇతను చేసిన బ్యాటింగ్ చూసి ఉండరు. ఎందుకంటే ఆకాశామే హద్దు అన్నట్లు బంతిని బాదాడు. ఏకంగా 44 ఫోర్లు..23 సిక్సర్లు సాధించాడంటే అతను బ్యాటింగ్ ఎలా చేశాడో అర్థం చేసుకోవచ్చు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ఫస్ట్ డివిజన్ మూడు రోజుల టోర్నమెంట్ జరుగుతోంది. బారిషా...

Friday, December 23, 2016 - 09:57

వరల్డ్ కప్ గెలిస్తే ఆయా సంస్థలు..ఇతరులు క్రీడాకారులకు..కోచ్ లకు ఎంత బహుమానం ఇస్తారు ? ఏముంటుంది..లక్షలు..కోట్లు..ఉద్యోగం..ఇతరత్రా సదుపాయాలు కల్పిస్తారు అంటారు..కదా...తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు పలువురి క్రీడాకారులకు..కోచ్ లకు ఎలాంటి బహుమానాలు ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ హాకీలో ప్రపంచకప్ గెలిపించిన కోచ్ కు వచ్చిన నజరానాపై చర్చ జరుగుతోంది. భారత్ అతిథ్యమిచ్చిన...

Thursday, December 22, 2016 - 21:56

హైదరాబాద్ : 2016 సీజన్‌లో అశ్విన్‌ సాధించిన రికార్డ్‌లు నమోదు చేసిన ఘనతలు అన్నీ ఇన్నీ కావు. ట్రెడిషనల్‌ టెస్ట్‌ ఫార్మాట్‌, ఇన్‌స్టంట్‌ టీ 20 ఫార్మాట్లలో అశ్విన్‌ రికార్డ్‌ల మోత మోగించాడు.2016 సంవత్సరానికి ప్రతిష్టాత్మక ఐసీసీ బెస్ట్‌ టెస్ట్‌ క్రికెటర్‌, బెస్ట్‌ క్రికెటర్‌ అవార్డ్‌లు అశ్విన్‌కే  సొంతమయ్యాయి.    
నెంబర్‌ వన్‌ స్పిన్నర్‌... ...

Tuesday, December 20, 2016 - 21:57

చెన్నై : చెన్నై టెస్ట్‌లో టీమిండియాకు పోటీనే లేకుండా పోయింది. చెపాక్‌లోనూ ఇంగ్లీష్‌ టీమ్‌కు కొహ్లీ అండ్‌ కో చెక్‌ పెట్టింది. తొలి రెండు రోజులు ఆధిపత్యం ప్రదర్శించిన ఇంగ్లండ్‌కు  మిగతా మూడు రోజుల్లో ఆల్‌రౌండ్‌ షోతో భారత్‌కు చెక్‌ పెట్టింది. ఆఖరి టెస్ట్‌ చివరి రెండు రోజుల్లో ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన భారత్‌....సిరీస్‌తో పాటు 2016 సీజన్‌ను విజయంతో ముగించింది...

Tuesday, December 20, 2016 - 16:16

చెపాక్ : చివరి టెస్టు...మ్యాచ్ డ్రా గా ముగుస్తుందా ? లేక భారత్ విజయం సాధిస్తుందా ? లంచ్ సమయానికి ఇంగ్లండ్ స్కోరు ఒక వికెట్ పోకుండా 97 పరుగులు చేసింది. దీనితో మ్యాచ్ రసకందాయంలో పడింది. చివరకు మలుపు తిరిగింది. భారత బౌలర్ రవీంద్ర జడేజా ఇంగ్లండ్ నడ్డి విరిచాడు. ఏడు వికెట్లు సాధించి పతనాన్ని శాసించాడు. చివరకు భారత్ అద్భుత విజయం సాధించింది. వరుసగా 18 టెస్టు...

Monday, December 19, 2016 - 16:45

తమిళనాడు : చెన్నై టెస్ట్‌లో టీమిండియా మరో  రికార్డ్‌ బద్దలు కొట్టింది. చెపాక్‌లో కరుణ్‌ నాయర్‌ త్రిబుల్‌ సెంచరీతో టీమిండియా టెస్టుల్లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌ స్కోర్‌ నమోదు చేసింది. టెస్టుల్లో అత్యధిక ఇన్నింగ్స్‌ స్కోర్‌ నమోదు చేసిన జట్ల జాబితాలో టాప్‌ టెన్‌లో టీమిండియా చోటు దక్కించుకుంది. 
టీమిండియా రికార్డ్‌ల మోత 
టెస్టుల్లో...

Monday, December 19, 2016 - 07:41

ఇంగ్లండ్ భారీ స్కోరుకు టీమిండియా ఏమాత్రం బెద‌ర‌లేదు. కెప్టెన్ కోహ్లీ నిరాశపరిచినా... ఓపెనర్ కేఎల్ రాహుల్ వీరవిహారంతో మూడో రోజు భారత్ ఆధిపత్యం కనిపించింది. ఉద్వేగంతో రాహుల్ తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నా... ముగిసే నాటికి భారత్‌ 4 వికెట్లకు 391 ప‌రుగులు చేసింది. చెపాక్‌లో భారత్‌ ఇంగ్లాండ్‌కు దీటుగా బదులిస్తోంది. యువ ఓపెన‌ర్ లోకేష్ రాహుల్ ఒక్క ప‌రుగుతో కెరీర్‌లో డ‌బుల్...

Pages

Don't Miss