Sports

Wednesday, August 26, 2015 - 18:18

హైదరాబాద్ : వార్షిక ఎయిర్ టెల్ హైదరాబాద్ మారథాన్ రేస్ కోసం నిర్వాహక హైదరాబాద్ రన్నర్స్ సొసైటి విస్త్రుత ఏర్పాట్లు చేసింది. ఆగస్టు 30 న జరిగే ఈ మారథాన్ రేస్ లో దేశంలోని విఖ్యాత రన్నర్లతో సహా మొత్తం 14వేల మంది పాల్గొంటారని నిర్వాహక సంఘం హైదరాబాద్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రకటించింది. హైదరాబాద్ నగరానికే ప్రతిష్టాత్మకంగా నిలిచే ఈ రేస్ ను భారతి ఎయిర్ టెల్...

Wednesday, August 26, 2015 - 18:15

జమైకన్‌ స్ప్రింట్ క్వీన్ షెల్లీ యాన్‌ ఫ్రేసర్‌ ప్రైస్‌...మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అథ్లెటిక్స్ వరల్డ్ చాంపియన్‌షిప్‌ 100 మీటర్ల స్ప్రింట్‌ ఫైనల్‌లో షెల్లీకి మరోసారి పోటీనే లేకుండా పోయింది. కెరీర్‌లో 5వ వరల్డ్ చాంపియన్‌షిప్‌ గోల్డ్ మెడల్‌ సాధించి చరిత్ర సృష్టించింది. 

బీజింగ్ లో పోటీలు..
బీజింగ్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్‌...

Wednesday, August 26, 2015 - 18:07

ఢిల్లీ : భారత మహిళా టెన్నిస్ డబుల్స్ క్వీన్ సానియా మీర్జాకు...కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 'రాజీవ్ గాంధీ ఖేల్ రత్న' పురస్కారం పై కర్నాటక హైకోర్ట్ స్టే విధించింది. తనకు దక్కాల్సిన ఖేల్ రత్న అవార్డును సానియాకు ఇవ్వడం అన్యాయమంటూ కర్నాటకకు చెందిన పారా ఒలింపిక్ అథ్లెట్ గిరీషా నాగరాజే గౌడ కోర్టు కెక్కాడు. 2012 లండన్ పారా ఒలింపిక్స్ పురుషుల హైజంప్ లో గిరీషా రజత...

Monday, August 24, 2015 - 17:55

పాట్నా : ప్రో కబడ్డీ లీగ్‌లో సంచలనాలకు మారుపేరుగా నిలిచిన తెలుగు టైటాన్స్‌ జట్టు థర్డ్‌ ప్లేస్‌ను సొంతం చేసుకుంది. పాట్నా పైరేట్స్‌తో ముగిసిన ఆఖరాటలో సునాయాస విజయం సాధించింది. స్టార్‌ రైడర్‌ రాహుల్‌ చౌదరీ చెలరేగడంతో టైటాన్స్ జట్టుకు పోటీనే లేకుండాపోయింది. ప్రో కబడ్డీ లీగ్‌ రెండో సీజన్‌లో పటిష్టమైన తెలుగు టైటాన్స్‌ జట్టు మూడో స్థానంతో సరిపెట్టుకుంది. మూడు,...

Monday, August 24, 2015 - 17:51

పాట్నా : ప్రో కబడ్డీ లీగ్ రెండో సీజన్‌ టైటిల్‌ను యూ ముంబా జట్టు సొంతం చేసుకుంది. ఫైనల్‌లో పటిష్టమైన బెంగళూర్‌ బుల్స్‌ జట్టును చిత్తు చేసి టైటిల్‌ ఎగరేసుకుపోయింది. గత సీజన్‌లో ఫైనల్‌ వరకూ వచ్చి చేతులెత్తేసిన ముంబై జట్టు.... రెండో సీజన్‌లో మాత్రం అంచనాలకు తగ్గట్టుగా అదరగొట్టి విజేతగా నిలిచింది.

లీగ్ దశలో 12 విజయాలు..
ధూమ్‌ ధామ్‌...

Monday, August 24, 2015 - 17:48

కొలంబో : శ్రీలంక కమ్ ప్రపంచ క్రికెట్ చరిత్రలో ...డబుల్ సెంచరీల స్పెషలిస్ట్ కుమార సంగక్కర శకం ముగిసింది. కొలంబో సారా ఓవల్ లో టీమిండియాతో జరిగిన రెండోటెస్ట్ నాలుగోరోజుఆటలో...సంగక్కర 18 పరుగులకు అవుట్ కావడంతో...రిటైర్మెంట్ పరిపూర్ణమయ్యింది. ఇప్పటివకే వన్డే, టీ20 ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన సంగక్కర టెస్టుల్లో మరే ఇతర క్రికెటర్‌కూ సాధ్యం కాని అసాధారణ ఘనత, పలు...

Monday, August 24, 2015 - 16:09

కొలంబో: క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కరను అత్యున్నత పదవి వరించింది. బ్రిటన్‌లో శ్రీలంక హై కమీషనర్‌గా సంగక్కర నియమితులయ్యాడు. సారా ఓవల్ స్టేడియంలో జరిగిన సంగ వీడ్కోలు సభలో పాల్గొన్న లంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఈ ప్రకటన చేశారు. 15 ఏళ్ళుగా క్రికెట్‌కు సంగ చేసిన సేవలు చిరస్మరణీయమని, అత్యుత్తమ క్రికెటర్లలో సంగ ఒకరని సిరిసేన కొనియాడారు. టెస్టుల్లో అత్యధిక...

Monday, August 24, 2015 - 12:40

కొలంబో :  శ్రీలంకపై కోహ్లీ సేన ఘన విజయం సాధించింది. గెలవాల్సిన మొదటి టెస్టును తృటిలో చేజార్చుకున్న 'యువ భారత్' ఆ కసిని రెండో టెస్టులో చూపించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ లంకతో ఓ ఆటాడుకుంది. ఈ టెస్టును గెలిచి సంగక్కరకు వీడ్కోలు బహుమతిగా ఇవ్వాలనుకున్న లంకేయుల ఆశలను కోహ్లీ సేన అడియాసలు చేసింది. 
రహానే స్పూర్తిదాయక శకతం...

Sunday, August 23, 2015 - 16:20

కొలంబో : రెండో టెస్టులో టీమ్ ఇండియా విజయం ముంగిట నిలిచింది. మూడు రోజుల పాటు తరువాత మ్యాచ్ పై తిరుగులేని పట్టు సాధించిన కోహ్లీ సేన అతిథ్య శ్రీలంక ముంగిట భారీ లక్ష్యాన్ని ఉంచింది. రెండో టెస్టు లో భారత్ తన రెండో ఇన్నింగ్స్ లో 325 పరుగులకు డిక్లెర్డ్ చేసింది. మొత్తం ఎనిమిది వికెట్లు కోల్పోయింది. దీనితో లంక విజయం సాధించాలంటే 413 పరుగులు చేయాల్సి ఉంటుంది. అనంతరం...

Wednesday, August 19, 2015 - 12:10

ఉత్తర్ ప్రదేశ్ : టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పదివేల ఎత్తు నుండి కిందకు దూకాడు. బుధవారం ఈ ట్రైనింగ్ జరిగింది. టెస్టు నుండి రిటైర్ పొందిన ధోని ఇండియన్ ఆర్మీలో గౌరవ లెప్టినెంట్ కల్నల్ హోదా పొందిన సంగతి తెలిసిందే. లెప్టినెంట్ కల్నల్ హోదా ధోని పలుమార్లు మిలిటరీ బేస్‌లను సందర్శించాడు. ధోని ఆగ్రాలోని పారా రెజిమెంట్‌లో రెండు వారాల పాటు మిలిటరీ...

Monday, August 17, 2015 - 17:47

ఢిల్లీ: టీమిండియాకు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. గాయం కారణంగా శిఖర్ ధావన్ టెస్టు సీరీస్ కు దూరమయ్యాడు. తొలి టెస్టులో శిఖర్ సెంచరీ చేశాడు. అయినా భారత్ కు ఓటమి తప్పలేదు. ఇప్పటికే తొలి టెస్టులో ఓడిపోయి టీమిండియా విమర్శలు ఎదుర్కొంటుంది. ఈనేపథ్యంలో శిఖర్ ధావన్ సీరీస్ కు దూరం కావడమంటే టీమ్ కు కష్టకాలమే అని చెప్పవచ్చు. దీంతో టీమిండియా పరిస్థితి.. మూలిగే నక్కపై...

Sunday, August 16, 2015 - 10:48

జకార్త : ప్రపంచ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ కు...భారత బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్ తహతహలాడుతోంది. జకార్తాలోని సుకర్నో ఇండోర్ స్టేడియం వేదికగా జరుగుతున్న 2015 ప్రపంచ బ్యాడ్మింటన్ పోటీలు ముగింపు దశకు చేరాయి. ఈరోజు జరిగే మహిళల సింగిల్స్ టైటిల్ సమరంలో...ప్రస్తుత చాంపియన్, ప్రపంచ నెంబర్ వన్ కారోలిన్ మారిన్ కు ...రెండోర్యాంక్ సైనా సవాల్ విసురుతోంది...

Saturday, August 15, 2015 - 22:41

హైదరాబాద్  : హైదరాబాదీ బ్యాట్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్ మరో సంచలనం సృష్టించింది. వరల్డ్ బ్యాట్మింటన్ ఛాంపియన్ షిప్ టోర్నీలో మొట్టమొదటిసారి ఫైనల్ కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీ ఫైనల్స్ లో తన ప్రత్యర్థి, ఇండోనేషియా క్రీడాకారిణి వరల్డ్ 29 ర్యాంకర్ లిందావెని ఫనెత్రి పై  21-17, 21-17 తేడాతో ఘన విజయం సాధించింది. 56 నిమిషాల పాటు జరిగిన ఈ రసవత్తర పోరులో...

Saturday, August 15, 2015 - 15:58

జకార్తా: గాల్ టెస్ట్ లో సీన్ రివర్స్ అయ్యింది. మొదటి టెస్టులో శ్రీలంక విజయం సాధించింది. స్వాతంత్ర్యదినోత్సవం రోజునే విరాట్ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియాకు ఘోరపరాజయం ఎదురయ్యింది. 176 పరుగుల లక్ష్యాన్ని సాధించలేక కొహ్లీ ఆర్మీ చతికిలబడింది. శ్రీలంక స్పిన్ ద్వయం రంగన్ హెరాత్, కౌశల్ ధాటికి కుప్పకూలిపోయింది. జట్టును ముందుండి నడిపించాల్సిన కెప్టెన్ కొహ్లీ 3,...

Saturday, August 15, 2015 - 12:22

గాలే : టీమిండియా గెలుస్తుందని ఆశించిన అభిమానుల ఆశలు ఆవిరవుతున్నాయి. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ లో రెండో ఇన్నింగ్స్ లో భారత మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది. వరుసగా వికెట్లు పడుతున్నాయి. ఇషాంత్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ లు ఔటయ్యారు. నాలుగో రోజు లంక స్పిన్నర్లు విజృంభించారు. భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ (3), రోహిత్ శర్మ (4), శిఖర్ ధావన్ (...

Thursday, August 13, 2015 - 17:26

హైదరాబాద్: తెలుగు తేజం పీవీ సింధు... 2015 ప్రపంచ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ చేరి ..పతకానికి మరింత చేరువయ్యింది. జకార్తాలో జరుగుతున్న ఈ టోర్నీ మహిళల సింగిల్స్ ప్రీక్వార్టర్ ఫైనల్స్ లో.... చైనా సూపర్ స్టార్, 3వ సీడ్ లీ ఝూరీ పై మూడుగేమ్ ల విజయంతో క్వార్టర్ ఫైనల్స్ బెర్త్ ఖాయం చేసుకొంది. తొలిగేమ్ ను 21-17తో నెగ్గిన సింధు...రెండోగేమ్ ను 14-21తో చేజార్చుకొన్నా...

Thursday, August 13, 2015 - 16:11

గాల్ టెస్ట్ : టీమిండియా సెంచరీల మోత మోగించింది. ధావన్, కోహ్లీ..మూడో వికెట్ కు 227 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఈ క్రమంలో...శిఖర్ ధావన్ టెస్ట్ క్రికెట్లో నాలుగో సెంచరీ సాధించగా...కెప్టెన్ కొహ్లీ 11వ శతకం సాధించి అవుటయ్యాడు. కొహ్లీ మొత్తం 191 బాల్స్ ఎదుర్కొని..11 బౌండ్రీలతో సెంచరీ సాధించాడు. అయితే..ఈ ఇద్దరి భారీభాగస్వామ్యానికి..శ్రీలంక యువస్పిన్నర్ కౌశల్...

Wednesday, August 12, 2015 - 19:34

గాలె : శ్రీలంకతో ..గాల్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ తొలిరోజు ఆట ముగిసేసమయానికే టీమిండియా పటిష్టమైన స్థితికి చేరుకొంది. టాస్ ఓడి ముందుగా ఫీల్డింగ్ కు దిగిన టీమిండియా ప్రత్యర్థిని 183 పరుగులకే కుప్పకూల్చింది. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆరు వికెట్ల మ్యాజిక్ లో శ్రీలంక గల్లంతయ్యింది. సమాధానంగా టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సరికి 2...

Wednesday, August 12, 2015 - 19:33

గాలె : టీమిండియా ఆఫ్‌ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్...శ్రీలంక గడ్డపై అదరగొట్టాడు. విదేశీ పిచ్ లపై జరిగే టెస్టుల్లో రాణించలేడన్న అపవాదుకు తెరదించాడు. మూడుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా గాల్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రారంభమైన తొలిటెస్ట్ తొలిరోజుఆటలోనే...అశ్విన్ స్పిన్ మ్యాజిక్ లో శ్రీలంక కొట్టుకుపోయింది. విమర్శకుల నోటికి..తన స్పిన్ మ్యాజిక్ తోనే సమాధానం చెప్పాడు....

Wednesday, August 12, 2015 - 19:28

గాలె : శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు ఆట తొలిరోజునే భారత బౌలర్లు అదరగొట్టారు.మ్యాజిక్‌ ఆఫ్‌ స్పిన్నర్‌... రవిచంద్రన్‌ అశ్విన్ ధాటికి లంక బ్యాట్స్‌మెన్‌ క్యూ కట్టారు. రెండు సెషన్లలోపే శ్రీలంక జట్టును ఆలౌట్‌ చేసి మ్యాచ్‌పై పట్టు బిగించారు. భారత ఆఫ్‌ స్పిన్నర్‌...రవిచంద్రన్‌ అశ్విన్ మ్యాజిక్‌ చేయడంతో లంక జట్టు 183 పరుగులకే కుప్పకూలింది. కేవలం రెండు...

Wednesday, August 12, 2015 - 13:38

గాలె : 1993లో తొలి సిరీస్ నెగ్గిన నాటి శ్రీలంక గడ్డ నుంచి సిరీస్ తో భారత్‌లో అడుగు పెట్టాలని కలకంటునే ఉన్నారు. ప్రతిసారీ ఎన్నో ఆశలతో లంకకు వెళ్లడం ఉత్త చేతులతో రావడం సరిపోయింది. ఈసారి టెస్ట్‌ కెప్టెన్సీ విరాట్‌ కోహ్లీ కుర్ర జట్టుతో లంకలో అడుగుపెట్టాడు. సిరీస్‌తో తిరిగొస్తానంటున్నాడు. శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా నేడు తొలి మ్యాచ్ గాలెలో జరగనుంది....

Tuesday, August 11, 2015 - 15:35

ఢిల్లీ: ఇండియన్‌ టెన్నిస్‌ క్వీన్‌ సానియా మీర్జా....2014- 15 సంవత్సరానికి దేశ అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపికైంది. ఈ అవార్డు కోసం సానియా పేరును గత వారమే కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. ఈ పురస్కారం కోసం స్క్వాష్‌ స్టార్‌ దీపకా పల్లికల్‌, ట్రాక్ అండ్ ఫీల్డ్ స్టార్లు వికాస్‌ గౌడ, సీమా పూనియా,భారత హాకీ కెప్టెన్‌ సర్దార్‌ సింగ్‌,...

Friday, August 7, 2015 - 19:47

హైదరాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోని జీఎంఆర్ ఎరీనాలో బీఎండబ్ల్యు కార్లు దుమ్మురేపాయి. బీఎండబ్ల్యు 1 నుంచి 7 సిరీస్‌, బీఎండబ్ల్యు-ఎం మోడల్‌ కార్లతో నిర్వహించిన డ్రైవింగ్‌ నగరవాసులను అబ్బురపర్చింది. బీఎండబ్ల్యుసంస్థ డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ టూర్‌ పేరిట కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు అనుభవజ్ఞులైన ట్రైయినర్ల ద్వారా ట్రాక్‌లో కార్ల...

Thursday, August 6, 2015 - 17:11

హైదరాబాద్: ప్రొఫెషనల్ కబడ్డీ లీగ్..హైదరాబాద్ లెగ్ మూడోరోజు పోటీల్లో..ఆతిథ్య తెలుగు టైటాన్స్ వరుసగా రెండో విజయానికి ఉరకలేస్తోంది. గచ్చిబౌలీ ఇండోర్ స్టేడియం వేదికగా రాత్రి 9 గంటలకు జరిగే 10వ రౌండ్ పోటీలో పాట్నా పైరేట్స్ తో టైటాన్స్ తలపడనుంది.....
అంచె పోటీలు నయాజోష్ తో.....
2015 ప్రొఫెషనల్ కబడ్డీలీగ్..హైదరాబాద్...

Wednesday, August 5, 2015 - 06:59

హైదరాబాద్ : ప్రొ-కబడ్డీ లీగ్‌లో భాగంగా తెలుగు టైటాన్స్ - జైపూర్‌ పింక్ పాంథర్స్ మధ్య మ్యాచ్‌ టై అయ్యింది. హైదరాబాద్‌ గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణీత 40 నిమిషాల సమయంలో ఇరు జట్లు 39 పాయింట్ల సాధించాయి. దీంతో రిఫరీలు మ్యాచ్‌ టై అయినట్లు ప్రకటించారు. తొలి అర్థభాగంలో 20-12 తేడాతో ఆధిక్యంలో ఉన్న తెలుగు టైటాన్స్ రెండో అర్థభాగంలో తమ జోరును...

Tuesday, August 4, 2015 - 07:59

ఢిల్లీ : ప్రపంచ జూనియర్‌ గోల్ఫ్ చాంపియన్‌ షిప్‌లో భారత్‌కు చెందిన శుభమ్‌ జగ్లాన్‌ మరో టైటిల్‌ సాధించాడు. అమెరికాలోని లాస్‌ వేగాస్‌లో నిర్వహించిన ఐజెజీఏ వరల్డ్ స్టార్స్ ఆఫ్‌ జూనియర్‌ గోల్ఫ్ ఈవెంట్‌లో 10 ఏళ్ల శుభమ్‌ జగ్లావ్‌ టైటిల్‌ సొంతం చేసుకున్నాడు. 9-10 ఏళ్ల వయస్సు విభాగంలో ఫైనల్‌లో మూడు రౌండ్లలో మొత్తం 106 పాయింట్లతో శుభమ్‌ జగ్లాన్‌ టైటిల్‌ను సొంతం...

Tuesday, August 4, 2015 - 07:38

హైదరాబాద్ : దేశ విదేశాలలోని కోట్లాదిమంది అభిమానులను ఓలలాడిస్తున్న ఇండియన్ ప్రో కబడ్డీలీగ్ షో...మన హైదరాబాద్ నగరానికి వచ్చింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ రోజు నుండి నాలుగు రోజులపాటు హైదరాబాద్ లెగ్ పోటీలు జరుగనున్నాయి. హోమ్ టీమ్ తెలుగు టైటాన్స్ కు డూ ఆర్ డై గా మారాయి. తొలి రోజు పోటీల్లో పింక్ పాంథర్స్ తో బెంగాల్ వారియర్స్, ఆతిథ్య తెలుగు టైటాన్స్ తో...

Pages

Don't Miss