Sports

Friday, September 22, 2017 - 09:50

ప.బెంగాల్ : కోల్‌కతా వన్డేలో భారత్‌ ఘన విజయం సాధించింది. 253 పరుగుల లక్ష్యంతో బరిలోకి  ఆస్ట్రేలియా 202 పరుగలకే ఆలౌట్‌ అయ్యింది. ఆసీస్‌ను తొలుత భువనేశ్వర్‌ దెబ్బతీయగా.. తర్వాత కుల్దీప్‌ యాదవ్‌ దెబ్బకొట్టాడు. కుల్దీప్‌ వన్డేల్లో హ్యాట్రిక్‌ సాధించాడు. వరుస బంతుల్లో వేడ్‌, అగర్‌, కమిన్స్‌ అవుట్‌ చేశాడు. భారత్‌ తరపున మూడో హ్యాట్రిక్‌ సాధించిన బౌలర్‌గా నిలిచాడు...

Thursday, September 21, 2017 - 21:10

కోల్ కత్తా : రెండవ వన్డేలో ఆస్ట్రేలియా ఎదురీతుంది. భారత్ బౌలర్ కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ వికెట్లు సాధించాడు. వరుస బంతుల్లో వేడ్, ఎగర్, కమిన్స్ అవుట్ చేసిన కల్దీప్ భారత్ తరపున హ్యాట్రిక్ సాధించిన మూడవ అటగాడిగా రికార్డ్ సృష్టించారు. 

Monday, September 18, 2017 - 08:32

కొరియా : కొరియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ ఫైనల్లో తెలుగు తేజం పీవీ సింధు విజృంభించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తనను ఓడించిన ప్రత్యర్థి ఒకుహరపై ప్రతీకారం తీర్చుకుంది. నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో భారత స్టార్‌ షట్లర్‌ సింధు జయకేతనం ఎగురవేసింది. ఇరువురి క్రీడాకారిణుల మధ్య హోరాహోరీగా సాగింది. తొలి గేమ్‌లో ఒకుహారా 12-9 తో ఆధిక్యంలో నిలిచిన సమయంలో...

Monday, September 18, 2017 - 08:23

చెన్నై : టీమిండియా విజయపరంపర కొనసాగుతోంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో భారత్‌ తొలి వన్డేలో ఘన విజయం సాధించి ఆధిక్యంలో నిలిచింది. చెన్నైలో జరిగిన వన్డేలో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. హార్దిక్‌ పాండ్యా, ధోనీ హాఫ్‌ సెంచరీలు చేయడంతో 7 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. అనంతరం జోరుగా వర్షం కురవడంతో ఆట రెండు గంటల పాటు నిలిచింది. దీంతో...

Sunday, September 17, 2017 - 21:49

ఢిల్లీ : కొరియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్‌లో తెలుగు తేజం మెరిసింది. వరల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఓటమికి బదులు తీర్చుకుంది. రసవత్తరంగా సాగిన ఫైనల్‌ పోరులో జపాన్‌ క్రీడాకారిణి ఒకుహరపై 22-20, 11-21, 21-18తో విజయం సాధించి...కొరియా ఓపెన్‌ టైటిల్‌ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డ్ సృష్టించింది. 

కొరియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌...

Sunday, September 17, 2017 - 13:43

హైదరాబాద్ :  ప్రపంచ బాడ్మింటన్‌ చాంపియన్‌ ఒకహరపై పీవీ సింధు ప్రతీకారం తీర్చుకుంది. తనను ఓడించిన ప్రత్యర్థిని కొరియా సూపర్‌ సిరీస్‌లో చిత్తు చేసింది. కొరియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ ఫైనల్లో జపాన్‌ క్రీడాకారిణి ఒకుహరపై 22-20, 11-21, 21-18 తేడాతో సింధు విజయం సాధించింది. గతంలో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఒకుహర చేతిలో సింధు ఓటమి చవిచూసింది. కొరియా సూపర్‌ సిరీస్‌లో...

Sunday, September 17, 2017 - 08:30

హైదరాబాద్ : రెండు సార్లు వరల్డ్‌ చాంపియన్‌ ఇండియా.. ఐదు సార్లు వన్డే చాంపియన్‌ ఆస్ట్రేలియాతో  అసలు సిసలు వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోని తొలి వన్డేలో విరాట్‌ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియాకు  స్టీవ్‌స్మిత్‌ సారధ్యంలోని ఆస్ట్రేలియా సవాల్‌ విసురుతోంది.సొంతగడ్డపై  తిరుగులేని ట్రాక్‌ రికార్డ్‌ కలిగిన టీమిండియా....ఆస్ట్రేలియా జట్టుపై...

Saturday, September 16, 2017 - 21:22

ఢిల్లీ : ఇన్‌స్టంట్‌ వన్డే, టీ20 ఫార్మాట్లలో తిరుగులేని టీమిండియా సొంతగడ్డపై మరో కీలక సమరానికి సన్నద్ధమైంది. ఆస్ట్రేలియాతో  5 వన్డేలు, 3 మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌కు కొహ్లీ అండ్‌ కో సై అంటే సై అంటోంది. ఓటమంటూ లేకుండా శ్రీలంక టూర్‌ ముగించిన టీమిండియా... సొంతగడ్డపై ఆస్ట్రేలియాను బ్రౌన్‌ వాష్‌ చేయడమే  లక్ష్యంగా బరిలోకి దిగబోతోంది.

భారత జట్టు సొంతగడ్డపై...

Saturday, September 16, 2017 - 11:47

ముంబై : ఆస్ట్రేలియాతో 5 వన్డేల సిరీస్‌ ఆరంభానికి ముందే భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఫామ్‌లో ఉన్న టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌...తొలి 3 వన్డేలు ఆడనున్న జట్టు నుంచి తప్పుకున్నాడు. భార్య ఆయేషాకు అస్వస్థత కారణంగా ధావన్‌ 3 వన్డేలకు దూరమయ్యాడు. ఆఖరి రెండు వన్డేలకు ధావన్‌ తిరిగి భారత్‌ జట్టుకు అందుబాటులో ఉంటాడు. ధావన్‌ స్థానంలో అజింక్యా రహానే లేదా కేఎల్‌...

Tuesday, September 12, 2017 - 16:49

పోలాండ్‌ : పోలాండ్‌లో రెడ్‌బుల్‌ మెగావాట్‌  చాలెంజ్‌ పోటీలు ప్రారంభమయ్యాయి.ఈ డేర్‌ డెవిల్‌ కాంపిటీషన్‌లో  ప్రపంచంలోనే 500 మంది టాప్‌ క్లాస్‌ స్టంట్‌ రైడర్లు పోటీకి దిగారు. క్వాలిఫైయింగ్‌ రౌండ్‌లో కొండరాళ్లు, గుట్టలపై రిస్క్‌ను సైతం లెక్కచేయకుండా రేస్‌లో దూసుకుపోయారు. రెడ్‌బుల్‌ మెగావాట్‌ చాలెంజ్‌  క్వాలిఫైయింగ్‌ రౌండ్‌ పోటీల్లోని థ్రిల్లింగ్‌ మూమెంట్స్‌ మీ...

Sunday, September 10, 2017 - 15:46

ముంబై : ఆస్ట్రేలియాతో తొలి మూడు వన్డేలకు భారత జట్టును ఎంపిక చేశారు. అశ్విన్‌, జడేజాలకు సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఉమేష్‌ యాదవ్‌, షమీలు జట్టులో తిరిగి స్థానం సంపాదించారు. టీమ్‌లో కోహ్లీ, ధోనీ, రోహిత్‌, రాహుల్‌, జాదవ్‌, పాండే, రహానే, హార్ధిక్‌పాండ్యా, శిఖర్‌ ధావన్‌, చౌహాల్‌, భువనేశ్వర్‌, షమీ, కుల్దీప్‌, అక్షర్‌లకు చోటు కల్పించారు.

...
Thursday, September 7, 2017 - 10:26

 

కోలంబో : శ్రీలంక పర్యటనలో టీమ్‌ ఇండియా విజయపరంపర కొనసాగింది. బుధవారం శ్రీలంకతో జరిగిన ఏకైక టీ20లో విరాట్‌సేన ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. టాస్‌ గెలిచిన టీమ్‌ ఇండియా కెప్టెన్‌ కోహ్లీ శ్రీలంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 170 పరుగులు చేసింది.171 రన్స్‌ టార్గెట్‌తో బ్యాటింగ్‌ ఆరంభించిన భారత్‌...

Wednesday, September 6, 2017 - 06:42

ఢిల్లీ : భారత సైనిక దళాల కుటుంబాల పట్ల తనకున్న నిబద్ధత, మానవత్వాన్ని తరచు చాటుకుంటూ వస్తున్న భారత క్రికెటర్ గౌతమ్ గంభీర్ మరోసారి చలించిపోయారు. కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందిన అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ అబ్దుల్ రషీద్ కుమార్తె జోహ్రాను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. తన తండ్రి మరణవార్త తెలిసి జోహ్రా కంటికిమింటికి ఏకధాటిగా...

Monday, September 4, 2017 - 21:42

ముంబై : ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ట్వంటీ ట్వంటీ లీగ్‌ ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ ప్రసార హక్కులను స్టార్‌ ఇండియా గ్రూప్‌ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. రికార్డ్‌లెవల్లో 16వేల 347 కోట్లకు బిడ్‌ వేసిన స్టార్‌ గ్రూప్‌కే బీసిసిఐ మొగ్గు చూపింది.ప్రత్యక్షప్రసారాలు,డిజిటల్‌ మీడియా హక్కులతో పాటు ఇతర దేశాల్లో ప్రసార హక్కులు సైతం స్టార్‌ గ్రూప్‌కే దక్కాయి.2018...

Monday, September 4, 2017 - 21:41

హైదరాబాద్ : భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ మళ్లీ గోపీచంద్‌ అకాడమీలో చేరింది. ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీల్లో వరుస పరాజయాలను చవిచూస్తున్న సైనా.. ప్రస్తుత కోచ్ విమల్‌ కుమార్‌ను వదిలి హైదరాబాద్‌కు తిరిగొచ్చేసింది. మనస్పర్థల కారణంగా సరిగ్గా మూడేళ్లక్రితం గోపీచంద్ అకాడమీకి గుడ్‌బై చెప్పిన సైనా.. బెంగళూరులో కోచ్ విమల్ కుమార్ ఆధ్వర్యంలో శిక్షణ పొందింది. వీరిద్దరి...

Monday, September 4, 2017 - 08:46

ఢిల్లీ : శ్రీలంకపై ఐదో వన్డేల్లోనూ భారత్‌ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్విప్‌ చేసింది. ఇప్పటికే టెస్ట్‌ సిరీస్‌ను 3-0తో గెలుచుకున్న విరాట్‌సేన.. వన్డేల్లోనూ అదే దూకుడు ప్రదర్శించింది. చివరి వన్డేలో ఆరు వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. సిరీస్‌లో ఒక్కమ్యాచ్‌ అయినా గెలిచి పరువు నిలబెట్టుకుందామనుకున్న లంశ ఆశలు...

Saturday, September 2, 2017 - 14:20

అమెరికా టెన్నిస్ స్టార్ సెరీనా విలయమ్స్ కు బేబీ గర్ల్ పుట్టిందని ఆమె సోదరి వీనస్ విలియమ్స్ తెలిపింది. ఈ వార్త తెలుసుకున్న తాను ఎంతో సంతోషానికి గురైనట్లు వీనస్ పేర్కొంది. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లో ఉన్న సెయింట్ మేరీస్ మెడిక‌ల్ సెంట‌ర్‌లో సెరీనా త‌న బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. పాప బ‌రువు 3 కిలోలు ఉన్న‌ట్లు డాక్ట‌ర్లు చెప్పారు. అమ్మాయికి జ‌న్మ‌నిచ్చిన సెరీనాకు కంగ్రాట్స్...

Friday, September 1, 2017 - 06:56

కోహ్లీసేన మరో భారీ విజయం సాధించింది. శ్రీలంక జట్టుకు మరో ఘోర పరాభవం ఎదురైంది. కొలంబో వేదికగా ఏకపక్షంగా సాగిన నాలుగో వన్డేలో భారత బ్యాటింగ్‌, బౌలింగ్‌కు లంక విలవిల్లాడింది. సొంతగడ్డపై తొలిసారి 168 పరుగులు భారీ తేడాతో ఓడిన లంకజట్టు చెత్త రికార్డు సొంతం చేసుకుంది. నాలుగో వన్డేలో టాస్‌ గెలిచిన భారత్‌..మొదట బ్యాటింగ్‌ చేసింది. కెప్టెన్‌ కోహ్లీ 96 బాల్స్‌లో 131 పరుగులు చేయగా.....

Wednesday, August 30, 2017 - 22:07

హైదరాబాద్ : ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీలో సిల్వర్‌ పతకం సాధించిన పీవీ సింధు... ఇవాళ సచివాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిశారు. సింధు, గోపిచంద్‌ను కేసీఆర్‌ సత్కరించారు. సింధు భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు. 

Wednesday, August 30, 2017 - 11:18

ఇంట్లోకి వర్షపు నీళ్లు వస్తే ఏం చేస్తారు ? ఏం చేస్తాం..అడ్డుగా ఏదో ఒకటి పెట్టేస్తాం..అంటారు కదా...కానీ ఏదైనా ఓ వ్యక్తి ఇష్టంగా దాచుకున్న వాటిని ఉపయోగించి నీరు లోనికి రాకుండా చేస్తే ఎలా ఉంటుంది...అలా ఎలా చేస్తాం..ఇష్టంగా దాచుకున్న వాటితో అలా చేస్తామా ? అంటారు కదా..కానీ ప్రముఖ టెన్నిస్ స్టార్ మహేష్ భూపతి సతీమణి లారా దత్తా అలాగే చేసింది...ఎంటో తెలుసుకోవాలంటే..చదవండి..

...

Tuesday, August 29, 2017 - 15:59

హైదరాబాద్‌ : ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో రజత పతకం గెలుచుకున్న తెలుగమ్మాయి పీవీ సింధు హైదరాబాద్‌ చేరుకున్నారు. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తన ప్రదర్శన ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఇదంతా కోచ్‌ గోపీచంద్‌, తల్లిదండ్రుల సహకారంతోనే సాధ్యమైందని చెప్పారు. జపాన్‌ క్రీడాకారిణి ఒకుహరాతో జరిగిన ఫైనల్‌ ఫోరు చాలా కఠినంగా...

Sunday, August 27, 2017 - 08:45

పల్లెకెలె : చప్పగా సాగుతున్న శ్రీలంక-భారత్‌ వన్డే సిరీస్‌... రెండో వన్డే రసవత్తరంగా మార్చింది. భారత్‌కు పోటీ లేదనుకుంటున్న తరుణంలో శ్రీలంకలో ఒక యువ స్పిన్నర్‌ ధనుంజయ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. తన బౌలింగ్‌ మాయాజాలంతో రెండో వన్డేలో శ్రీలంకను గెలుపు వరకు తీసుకువచ్చి... కోహ్లీ సేనకు గట్టి పోటీనిచ్చాడు. మ్యాచ్‌ ఓడిపోయినా మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కించుకున్నాడు...

Saturday, August 26, 2017 - 13:36

స్పోర్ట్స్ : షట్లర్‌ పీవీ సింధు మరో ఘనత సాధించింది.. ప్రపంచ కప్‌ బ్యాడ్మింటన్‌లో సెమీ ఫైనల్‌ చేరి పతకం ఖాయం చేసుకుంది.. క్వార్టర్‌ ఫైనల్‌లో చైనా షట్లర్‌ సన్‌ యూపై వరుస సెట్లలో విజయం సాధించి సింధు రికార్డు సృష్టించింది..వరల్డ్ ఛాంపియన్‌ షిప్‌లో మూడోసారి పతకాన్ని సాధించబోతోంది.

Friday, August 25, 2017 - 21:45

హైదరాబాద్: షట్లర్‌ పీవీ సింధు మరో ఘనత సాధించింది.. ప్రపంచ కప్‌ బ్యాడ్మింటన్‌లో సెమీ ఫైనల్‌ చేరి పతకం ఖాయం చేసుకుంది.. క్వార్టర్‌ ఫైనల్‌లో చైనా షట్లర్‌ సన్‌ యూపై వరుస సెట్లలో విజయం సాధించి సింధు రికార్డు సృష్టించింది..వరల్డ్ ఛాంపియన్‌ షిప్‌లో మూడోసారి పతకాన్ని సాధించబోతోంది.. 

Thursday, August 24, 2017 - 11:24

ఢిల్లీ : భారత్‌, శ్రీలంక జట్ల మధ్య సెకండ్‌ వన్డేకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.క్యాండీలోని పల్లెకల్లె ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో రెండో వన్డే సమరానికి రంగం సిద్ధమైంది.తొలి వన్డేలో తిరుగులేని టీమిండియా రెండో వన్డేలోనూ నెగ్గి సిరీస్‌పై పట్టు బిగించాలని పట్టుదలతో ఉంది. ట్రాక్‌ రికార్డ్‌తో పాటు, ఆల్‌రౌండ్‌ పవర్‌తో పటిష్టంగా ఉన్న భారత్‌...పల్లకల్లె వన్డేలో...

Monday, August 21, 2017 - 07:36

డంబూల్లా : టీమిండియా విజయ పరంపర కొనసాగుతోంది. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్‌ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. శిఖర్‌ దావన్‌ సిక్సర్లు, కోహ్లీ షాట్లు భారత్‌ను సునాయాసంగా గెలిచేలా చేశాయి.ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా... దంబూల్లా వన్డేలో కోహ్లీ సేన 217 పరుగుల విజయ లక్ష్యాన్ని కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి... 28.5 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్‌ శిఖర్‌...

Pages

Don't Miss