Sports

Sunday, July 9, 2017 - 20:00

జమైకా : ట్వంటీ ట్వంటీ ఫార్మాట్‌లో ఎదురులేని కరీబియన్‌ టీమ్‌, తిరుగులేని టీమిండియా....అసలు సిసలు సమరానికి సన్నద్ధమయ్యాయి.ఓ వైపు రెండు సార్లు వరల్డ్ చాంపియన్‌ వెస్టిండీస్‌... మరోవైపు తొలి టీ20 చాంపియన్‌ ఇండియా...ఇరు జట్ల మధ్య ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌, క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ఇంతకు మించి కావాల్సిందేముంటుంది.5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ నెగ్గి జోరు మీదున్న టీమిండియా.......

Sunday, July 9, 2017 - 08:24

ఢిల్లీ : ట్వంటీ ట్వంటీ ఫార్మాట్‌లో తిరుగులేని టీమిండియా,వెస్టిండీస్‌ జట్ల మధ్య ఏకైక టీ20 మ్యాచ్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది.రెండు సార్లు వరల్డ్ చాంపియన్‌ వెస్టిండీస్‌....మాజీ చాంపియన్‌ భారత్‌తో సింగిల్‌ టీ20 మ్యాచ్‌కు సై అంటే  సై అంటోంది.కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ సారధ్యంలోని కరీబియన్‌ టీమ్‌కు విరాట్‌ కొహ్లీ నాయకత్వంలోని భారత జట్టు సవాల్‌ విసురుతోంది....

Wednesday, July 5, 2017 - 17:29

అవును ఈ క్రికేటర్ ఎవరు ? టీమిండియా సాధించిన విజయాల్లో కీలక పాత్ర పోషించిన బ్యాట్స్ మెన్. ఓపెనర్ గా అదరగొట్టే బ్యాట్స్ మెన్...శతక్కొట్టే ఈ బ్యాట్స్ మెన్స్ ఎవరో కాదు..’శిఖర్ ధావన్'. అవును అతనే అలా అయిపోయాడేంటీ ? అని ఏమాత్రం నోరెళ్లబెట్టకండి. సోషల్ మాధ్యమాల ద్వారా తన అభిప్రాయాలను అభిమానులకు తెలియచేస్తుంటాడు. అంతేగాక సహచర ఆటగాళ్లతో టూర్లు..తదితర విషయాలు కూడా పంచుకుంటుంటాడు....

Saturday, July 1, 2017 - 09:32

హైదరాబాద్: వెస్టీండీస్‌ తో జరుగుతున్న ఐదు వన్డేల సీరీస్‌ లో... మూడో వన్డేలో భారత్‌ ఘనవిజయం సాధించింది..దీంతో భారత్‌ 2-0 ఆధిక్యం దూసుకెళ్లింది..మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణిత 50ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది.ఓపెనర్‌ రహానే నాలుగు ఫోర్లు ఒక సిక్సర్‌ సహాయంతో 72 పరుగులు చేశాడు..తరువాత బ్యాటింగ్‌ కి దిగిన ఆతిథ్య...

Friday, June 30, 2017 - 10:38

హైదరాబాద్ : రెండు సార్లు వరల్డ్ చాంపియన్‌ ఇండియా....వెస్టిండీస్‌పై వన్డే సిరీస్‌ విజయం సాధించడమే లక్ష్యంగా దూసుకుపోతోంది.కీలక సమరానికి విరాట్‌ కొహ్లీ నాయకత్వంలోని భారత జట్టుకు జాసన్‌ హోల్డర్‌ సారధ్యంలోని వెస్టండీస్‌ టీమ్‌ సవాల్‌ విసురుతోంది. మూడో వన్డేలో విజయం సాధించి 5 వన్డేల సిరీస్‌పై పట్టుబిగించాలని విరాట్‌ ఆర్మీ పట్టుదలతో ఉంది. వన్డేల్లో తిరుగులేని...

Friday, June 30, 2017 - 10:13

ఐపీఎల్ లో స్పాటింగ్ ఫిక్స్ లకు పాల్పడ్డారన్న ఆరోపణలతో 'శ్రీశాంత్' క్రికెట్ కు దూరమైన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈయన ఫాస్ట్ బౌలింగ్ తో అభిమానులను ఆకట్టుకున్నాడు. క్రికెట్ వదిలేసిన ఆయన వెండితెరపైకి అడుగులు వేశాడు. త్వరలోనే 'టీమ్ 5' ద్వారా ప్రేక్షకులను అలరించబోతున్నాడు. జకారియా నిర్మాణంలో సురేష్ గోవింద్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. తెలుగు..తమిళ..మలయాళ భాషల్లో రూపొందిన...

Thursday, June 29, 2017 - 10:17

ఢిల్లీ : ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఇవాళ భారత్‌ వెస్టిండీస్‌తో తలపడబోతోంది. ఆతిథ్య ఇంగ్లండ్‌ను ఓడించిన ఉత్సాహంతో ఉన్న మిథాలీ సేన... వెస్టిండీస్‌తో పోరుకు సై అంటోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో భారత క్రికెటర్లు నిలకడగా రాణిస్తున్నారు. ఓపెనర్లు స్మృతి మంధన, పూనమ్‌ రౌత్‌లతో పాటు టాపార్డర్‌లో మిథాలీరాజ్‌ సూపర్‌ ఫామ్‌లో ఉండటంతో గెలుపుపై టీం మరింత ధీమాగా ఉంది....

Thursday, June 29, 2017 - 10:06

ప్రముఖ బ్యాడ్మింటెన్ క్రీడాకారుడు..పద్మశ్రీ అవార్డు గ్రహీత గోపీచంద్..జీవితం ఆధారంగా ఓ సినిమా రాబోతోంది. బాలీవుడ్ లో ఇటీవల పలువురు ప్రముఖుల జీవితాల ఆధారంగా బయోపిక్ లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నిర్మాత విక్రమ్ మల్హోత్ర ‘గోపిచంద్’ జీవిత చరిత్రను తెరపైకి ఎక్కిస్తున్నారు. తెలుగు..హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది.  'నాపై సినిమా రాబోతున్నందుకు సంతోషంగా ఉంది....

Sunday, June 25, 2017 - 18:27

హైదరాబాద్ : స్కై డైవింగ్‌, బేస్‌ జంపింగ్‌ స్పెషలిస్ట్‌ మైల్స్‌ డైషర్‌ జోర్డాన్‌లో చరిత్రను తిరగరాశాడు. బేస్‌ జంపింగ్‌ హిస్టరీలోనే మరెవ్వరికీ సాధ్యం కాని రికార్డ్‌ సృష్టించాడు. ఒక్క రోజులో, 24 గంటల్లోనే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 63 సార్లు బేస్‌ జంప్‌ చేసి ఆశ్చర్యపరచాడు. బేస్‌ జంపింగ్‌ ట్రాక్‌ రికార్డ్‌లోనే రికార్డ్‌ లెవల్లో 24 గంటల్లో 63 సార్లు బేస్‌ జంప్‌...

Sunday, June 25, 2017 - 17:48

టోక్యో : జపాన్‌ క్యాపిటల్‌ సిటీ టోక్యోలో నిర్వహించిన రెడ్‌బుల్‌ కిక్‌ ఇట్‌ చాలెంజ్‌లో టాప్‌ క్లాస్‌ మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ స్పెషలిస్ట్‌లు అదరగొట్టారు. డేర్‌ డెవిల్‌ ట్రిక్స్‌తో వీక్షకులను చూపుతిప్పుకోనివ్వకుండా చేశారు. గాల్లో గిర్రున తిరుగుతూ కళ్లు చెదిరే ఫ్రీ స్టైల్‌ ఫీట్స్‌తో ఔరా అనిపించారు. వ్యక్తిగత విభాగాల్లో మొత్తం మూడు రౌండ్లలో ఈ పోటీలను...

Sunday, June 25, 2017 - 17:45

హైదరాబాద్ : రెడ్‌బుల్‌ ఎంటిబి చాలెంజ్‌లో మౌంటెయిన్‌ బైకింగ్‌ స్పెషలిస్ట్‌లు అదరగొట్టారు. క్రాన్‌ఓర్క్స్‌ వేదికగా జరిగిన ఈ డేర్‌డెవిల్‌ కాంపిటీషన్‌ ఎడ్వంచరస్‌ స్పోర్ట్స్‌ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. 100 మంది మౌంటెయిన్‌ బైకింగ్‌ స్పెషలిస్ట్‌లు పోటీకి దిగిన ఈ కాంపిటీషన్‌...ఫైనల్‌ రౌండ్‌లో డెడ్లీ ఫీట్స్‌తో అదరగొట్టిన బ్రెట్‌ రీడర్‌...టైటిల్‌ ఎగరేసుకుపోయాడు...

Sunday, June 25, 2017 - 12:13

ఢిల్లీ : మొన్న సింగపూర్‌, నిన్న ఇండోనేషియా, నేడు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌..తెలుగు తేజం తీన్ మార్ మోగించాడు. ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ విజేతగా కిదాంబి శ్రీకాంత్ నిలిచాడు. ఫైనల్ లో ఒలింపిక్ ఛాంపియన్ చెన్ లాంగ్ పై శ్రీకాంత్ గెలుపొందాడు. 22-20, 21-16 తేడాతో విజయం సాధించాడు. ఈ విజయంతో కెరీర్ లో మూడో సూపర్ సిరీస్ సాధించినట్లైంది. ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్ లో...

Sunday, June 25, 2017 - 06:38

ఢిల్లీ : క్రికెట్‌ వరల్డ్‌కప్‌లో మిథాలీ సేన అదిరే ఆరంభం చేసింది. ఇంగ్లాండ్‌పై 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌ ఉమెన్లు రెచ్చిపోవడంతో వన్డేలో రెండో అత్యుత్తమ స్కోర్‌ను భారత్‌ నమోదు చేసింది. బ్యాట్స్‌ ఉమెన్లు, బౌలర్లు రాణించడంతో ఇంగ్లాండ్‌పై భారత్‌ సునాయాసంగా గెలుపు సాధించింది. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా శుభారంభం...

Saturday, June 24, 2017 - 17:16

ఢిల్లీ : స్కేటింగ్‌ వరల్డ్ చాంపియన్స్‌, ర్యాన్‌ షెక్లర్‌ అండ్‌ కో....ఓ ఫ్యాక్టరీలో డేర్‌డెవిల్‌ ఫీట్స్‌తో ఆకట్టుకున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ స్కేటర్లుగా పేరున్న జాన్‌ రైట్‌, అలెక్స్‌ సోర్జెంటీ, ర్యాన్‌ షెక్లర్‌ ఈ ఫీట్స్‌తో మరోసారి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. టర్బైన్‌ ఫ్యాక్టరీలో పనులు జరుగుతున్న సమయంలోనే స్కేటింగ్‌ చేసి ఔరా అనిపించారు. 

 

Tuesday, June 20, 2017 - 21:29

హైదరాబాద్: టీంమిండియా ప్రధాన కోచ్‌ అనిల్‌ కుంబ్లే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. బీసీసీఐ తీరుపై తీవ్ర మనస్తాపంతో కోచ్‌ పదవికి రాజీనామా చేశాడు. మంగళవారం టీమిండియాతో పాటు కుంబ్లే కూడా వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్సాల్సి ఉంది. అయితే... విండీస్ టూర్‌కు వెళ్లకుండా... ఎవరూ ఊహించని రీతిలో తన రాజీనామాను బీసీసీఐకి పంపించాడు. గత కొన్నాళ్లుగా కెప్టెన్‌...

Monday, June 19, 2017 - 08:52

స్పోర్ట్స్ : అంచనాలు లేకుండా అండర్‌డాగ్‌ వచ్చిన పాకిస్థాన్‌.. హాట్‌ ఫేవరేట్‌కు షాకిచ్చింది. అద్భుత ప్రదర్శనలతో చిరకాల ప్రత్యర్థి భారత్‌పై చిరస్మరణీయ విజయం సాధించింది. తొలిసారి పాకిస్థాన్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీ కైవసం చేసుకుంది. టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విరాట్‌ కోహ్లీకి మొదటి నుంచే ఎదురుదెబ్బ తగిలింది. బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ బ్యాట్స్‌మెన్లు మెరుగు...

Sunday, June 18, 2017 - 21:31

ఇంగ్లండ్ : ఐసీసీ ఛాంపియన్స్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ చేతులేత్తేసింది. చిరకాల ప్రత్యర్థిని అలవోకగా మట్టి కరిపిస్తుందని ఆశించిన క్రికెట్ అభిమానులు ఆశలు నెరవేరలేదు..ప్రత్యర్థిని చిత్తుగా ఓడించిన అదే జట్టు..ఇప్పుడు అదే ప్రత్యర్థి చేతిలో ఘోర పరాజయాన్ని చవి చూసింది..పాక్ ను ఓడిస్తుందని అనుకున్న జట్టు ఏకంగా 180 పరుగుల తేడాతో పరాజయం చవి చూసింది. బౌలింగ్..బ్యాటింగ్ లో భారత్...

Sunday, June 18, 2017 - 21:09

ఇంగ్లండ్ : ఐసీసీ ఛాంపియన్స్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ చేతులేత్తేసింది. తొలుత టాస్ గెలిచిన భారత్ ఏ మాత్రం ఆలోచించకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పాక్ ఓపెనర్లు అజర్ ఆలీ, ఫఖర్ జమన్ లు ధాటిగా ఆడడం ఆరంభించారు. బంతిని బౌండరీలుగా మరల్చారు. స్కోరు బోర్డు పరుగెత్తుండడంతో వీరిని విడదీయడానికి భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చివరకు జట్టు స్కోరు 128 పరుగుల వద్ద...

Sunday, June 18, 2017 - 17:06

ఇంగ్లండ్ : ఐసీసీ చాంపియన్స్ షిప్ 2017లో ఫైనల్ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థులు భారత్..పాక్ జట్లు తలపడ్డాయి. తొలుత టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. పాక్ ఓపెనర్లు అజర్ ఆలీ, ఫఖర్ జమన్ లు ధాటిగానే బ్యాటింగ్ ను ఆరంభించారు. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును పరుగెత్తించే ప్రయత్నం చేశారు. పాక్ స్కోరు 128 పరుగుల వద్ద ఉండగా అజర్ ఆలీ (59) రనౌట్...

Sunday, June 18, 2017 - 16:08

హైదరాబాద్ : భారత బ్యాడ్మింటన్‌ కెరటం, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌ ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్ లో విజయం సాధించాడు. జపాన్ షెట్లర్ పై వరుస సెట్లలో కిదాంబి శ్రీకాంత్ గెలుపొందాడు. కుజుమస సకాయ్ పై 21-11, 21-19 తేడాతో శ్రీకాంత్ విజయం సాధించి కప్ ను కైవసం చేసుకున్నాడు. రెండో సీడ్‌, దక్షిణ కొరియా షట్లర్‌ సన్‌ వాన్‌ హోపై 21-15, 14-21, 24-22తో విజయం సాధించి...

Sunday, June 18, 2017 - 15:11

ఇంగ్లండ్ : భారత్ - పాకిస్తాన్ జట్ల మధ్య పోరు తెరలేంచింది. కాసేపటి క్రితం ఓవల్ లో అంపైర్లు టాస్ వేశారు. టాస్ గెలిచిన అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకుని పాక్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. స్వల్ప స్కోరుకు పాక్ ను కట్టడి చేయాలని భారత్ యోచిస్తోంది. ఇక భారత్ ను ఎలాగైనా ఓడించాలని పాక్ తహతహలాడుతోంది. కానీ పాక్ జట్టుపై భారత్ ఎలాగైనా గెలుస్తుందని...

Sunday, June 18, 2017 - 14:20

హైదరాబాద్ : రెండు జట్ల మధ్య పోటీ అంటేనే అంచనాలు భారీగా ఉంటాయని, భారత్ - పాక్ మ్యాచ్ కోసం క్రీడాభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారని టెన్ టివి స్పోర్ట్స్ ప్రతినిధి ప్రశాంత్ తెలిపారు. ఐసీసీ ఛాంపియన్స్ 2017లో ట్రోఫీలో భాగంగా ఓవల్ మైదానంలో భారత్ - పాక్ జట్లు ఢీకొననున్నాయి. ఈ మ్యాచ్ పై ఆయన విశ్లేషణ అందించారు. భారత్ కు ఏమాత్రం పాక్ జట్టు అంతగా సరితూగదని, పాక్...

Sunday, June 18, 2017 - 14:06

చిత్తూరు : ఐసీసీ ఛాంపిన్స్ ట్రోఫీలో భాగంగా కాసేపట్లో ఇండియా - పాకిస్తాన్ జట్ల మధ్య కాసేపట్లో మ్యాచ్ జరగనుంది. సెమీస్ లో బంగ్లాదేశ్ ను చిత్తు చేసిన టీమిండియా ఫైనల్ లో అడుగు పెట్టగా ఇంగ్లండ్ జట్టుపై పాక్ విజయం సాధించి ఫైనల్ అడుగు పెట్టింది. దీనితో దాయాదుల మధ్య మళ్లీ పోరు జరగనుంది. రెండు సార్లు ఛాంపిన్ గా భారత్ నిలిచింది. మూడోసారి కప్పు చేజిక్కించుకోవాలని...

Sunday, June 18, 2017 - 12:06

స్పోర్ట్స్ : దాయాది పోరుకు ఇండియా సై అంటుంది. ఆత్మవిశ్వాసంతో కోహ్లీ సేన సంచలనం సృష్టించేందుకు సిద్దంగా ఉంది. అటు పాక్ సర్ఫరాజ్ కెప్టన్ గా విజయం సాధించాలని తహతహాలుడుతుంది. మరోవైపు ఇండియా విజయం కోసం దేశవ్యాప్తంగా అభిమానులు పూజలు చేస్తున్నారు. ఇండియా గెలవలని తిరుమలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత్ గెలవాలంటూ జాతీయ జెండాల ప్రదర్శన చేశారు. 

Sunday, June 18, 2017 - 11:49

చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్ చాలెంజ్‌కు చిరకాల ప్రత్యర్ధులు సన్నద్ధమయ్యాయి. భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మహా సమరం ఎప్పుడెప్పుడు ఆరంభమవుతుందా అని క్రికెట్‌ ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. భారత్‌,పాకిస్థాన్‌ మ్యాచ్‌కు ...రెండుదేశాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులకు ఎక్కడలేని ఆసక్తి.అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలో భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు....

Saturday, June 17, 2017 - 21:33

హైతదరాబాద్ :మినీ వరల్డ్‌కప్‌లో అసలు సిసలు సమరానికి రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్ధులు భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య చాంపియన్స్‌ ట్రోఫీ టైటిల్‌ ఫైట్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. మహా భారత్‌, పాకిస్థాన్‌ సై అంటే సై అంటున్నాయి.

ఓ వైపు వన్డేల్లో ఎదురులేని భారత్‌.....మరోవైపు ఎప్పుడెలా ఆడుతుందో అంచనాలకు అందని పాకిస్థాన్‌....ఇరు జట్ల మధ్య...

Pages

Don't Miss