క్రీడలు

ఇంగ్లండ్ : సానియా మీర్జా కీర్తి కిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరింది. ఆమె తొలి గ్రాండ్‌ స్లామ్‌ మహిళల డబుల్స్‌ టైటిల్‌ సొంతం చేసుకుంది. స్విస్‌ వెటరన్‌ మార్టినా హింగిస్‌తో కలిసి ఆమె వింబుల్డన్‌ టైటిల్‌ గెలుచుకుంది.

ఇంగ్లండ్: అమెరికన్ బ్లాక్ థండర్ సెరెనా విలియమ్స్ చరిత్ర సృష్టించింది. ఆరోసారి వింబుల్డన్ మహిళల సింగిల్స్ నెగ్గి తనకు తానే సాటిగా నిలిచింది. ఆల్ ఇంగ్లండ్ క్లబ్ సెంటర్ కోర్ట్ లో ముగిసిన ఫైనల్స్ లో టాప్ సీడ్ సెరెనా వరుస సెట్లలో 20వ సీడ్ గార్బిన్ మురుగుజాను చిత్తు చేసింది.

హైదరాబాద్: 2015 ప్రొఫెషనల్ కబడ్డీ లీగ్ సమరానికి తమజట్టు సిద్ధమని తెలుగు టైటాన్స్ ఫ్రాంచైజీ ప్రకటించింది. సూపర్ రైడర్ రాహుల్ చౌదరి నాయకత్వంలోని తెలుగు టైటాన్స్ సరికొత్త లోగో...స్ఫూర్తిదాయక గీతంతో పోటీలకు సిద్ధమయ్యింది.

హరారే : పునరావృతం అవుతుందేమో అనిపించిన గతం తృటిలో తప్పిపోయింది. బంగ్లాదేశ్‌ చేతిలో ఘోర పరాభవం మరోసారి క్రికెట్‌ అభిమానుల కళ్లముందు కదలాడింది. అయితే.. అదృష్టం కలిసిరావడంతో ఒడ్డునపడింది టీమిండియా. జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో ఓటమి కోరల్లోకి వెళ్లిన భారత జట్టు..

హారారే: జింబాబ్వేతో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో అజింక్యా రహానే నాయకత్వంలోని టీమిండియా బోణీ కొట్టింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో జరిగిన తొలివన్డేలో టీమిండియా.... 4 పరుగులతో జింబాబ్వేను ఓడించింది. 1-0 ఆధిక్యం సంపాదించింది.

లండన్: వింబుల్డన్ మహిళల డబుల్స్ ఫైనల్స్ కు టాప్ సీడ్ జోడీ సానియా మీర్జా- మార్టీనా హింగిస్ చేరుకొన్నారు. సెమీఫైనల్లో అమెరికాజోడీ రాక్వెల్ స్పియర్స్, కోప్స్ ను 6-1, 6-2తో చిత్తు చేసి టైటిల్ ఫైట్ కు సిద్ధమయ్యారు. లండన్ ఆల్ ఇంగ్లండ్ క్లబ్ లో జరిగిన ఈ సెమీస్ సమరంలో...

జింబాబ్వే: భారత్-జింబాబ్వే తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ లో భారత్ జోరు కొనసాగుతోంది. భారత్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి.. 255 పరుగుల చేసింది. అంబటి రాయుడు సెంచరీతో చెలరేగాడు. 10 బౌండరీలు, ఒక సిక్సర్ తో సెంచరీ చేశాడు. వన్డే క్రికెట్ లో రాయుడుకు ఇది రెండో సెంచరీ.

బెంగళూరు : ఎట్టకేలకు భారత్‌ బ్యాట్స్‌ఉమెన్‌ జూలు విదిల్చారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో 221 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 2 వికెట్లు మాత్రమే కోల్పోయి మరో ఆరు ఓవర్లు ఉండగానే ఛేదించింది.

లండన్‌ : వింబుల్డన్‌లో సానియా-హింగిస్‌ జోడి జోరు కొనసాగుతోంది. మూడో రౌండ్‌లో వారు 6-4, 6-3తో స్పెయిన్‌కు చెందిన మెడినా గారిగెస్‌-పారా సంతోంజా జంటపై ఘన విజ యం సాధించారు.

హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ పెద్దమనిషి పాత్రను పోషించారు. ఇద్దరు చంద్రులకు సుతిమెత్తగా చురకలంటించారు.

Pages

Don't Miss