క్రీడలు

శ్రీలంక : యునెస్కో గుర్తింపు కావాలో..ప్రఖ్యాతి చెందిన క్రికెట్ స్టేడియం కావాలో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఇంగ్లండ్ : సొంతగడ్డలో భారత్‌పై టీ20 సిరీస్‌ పరాభవానికి ఆతిథ్య ఇంగ్లండ్‌ ప్రతీకారం తీర్చుకుంది. టీ20 ఫార్మాట్‌లో సత్తా చాటలేకపోయిన ఆ జట్టు... వన్డే సిరీస్‌ను గెలుచుకుని పరువు దక్కించుకుంది.

ఢిల్లీ : 2018 ఫిఫా ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ ప్రభంజనం సృష్టించింది. ఫైనల్స్‌కు చేరిన అతి చిన్న దేశం క్రొయేషియాపై ఫైనల్స్‌లో అద్భుత విజయం సాధించింది. మాస్కో లూజ్నికీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 4-2 తేడాతో విజయం సాధించి..20 సంవత్సరాల తర్వాత విశ్వవిజేతగా నిలిచింది.

ఢిల్లీ : వింబుల్డన్‌లో సంచలనం చోటు చేసుకుంది. మహిళల సింగిల్స్‌లో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో సెరెనా విలియమ్స్‌కు షాక్‌ తగిలింది. జర్మనీకి చెందిన  ఏంజెలికా కెర్బర్‌ చేతిలో సెరెనా ఓటమిపాలైంది.

ఢిల్లీ : మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్‌ చిత్తుగా ఓడింది. ఇంగ్లాండ్‌ నిర్దేశించిన 323 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించడంలో భారత క్రికెటర్లు ఘోరంగా విఫలం అయ్యారు.

ఇంగ్లండ్ : ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్‌ గ్రాండ్‌ విక్టరీ కొట్టింది. ఇంగ్లాండ్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 40.1 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది.

ఢిల్లీ : ఫిఫా 2018 పుట్‌బాల్‌లో అద్భుతమైన ఆటతీరుతో  తన సత్తా చాటింది క్రొయేషియా. 1966 తర్వాత రెండో సారి ఫైనల్‌కు చేరుకోవాలన్న ఇంగ్లాండ్‌ తపనను  క్రొయేషియా నీరుగార్చింది.లుజ్నికీ స్టేడియంలో హోరాహోరీగా సాగిన పోరులో ఇంగ్లాండ్‌పై 2-1 తేడాతో  విజయం సాధించి  ఫైనల్‌కు చేరింది.

ఢిల్లీ : ఫిఫా వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌కు ఫ్రాన్స్‌ దూసుకెళ్లింది. సెమీస్‌లో ఆ జట్టు 1..0 తేడాతో బెల్జియాన్ని మట్టికరిపించింది. దీంతో సంచలన విజయాలతో ఫుట్‌బాల్‌ సెమీస్‌కు దూసుకొచ్చిన బెల్జియం ఫైనల్‌ ఆశలకు గండి పడింది. కీలకమైన పోరులో బలమైన ఫ్రాన్స్‌ ఆ జట్టును  సెమీస్‌లో చిత్తు చేసింది.

ఢిల్లీ : ఫిఫా ప్రపంచకప్‌లో ఫ్రాన్స్‌, బెల్జియం జట్ల మధ్య జరిగే ఫుట్‌బాల్‌ తొలి సెమీఫైనల్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. రెండు జట్లలోనూ స్టార్‌ ఆటగాళ్లు నిండి ఉండడంతో ఈ మ్యాచ్‌ హోరా హోరీగా  జరగనుంది.

Pages

Don't Miss