క్రీడలు

ఢిల్లీ : మూడో టీ-20 మ్యాచ్‌లో టీం ఇండియా అద్భుత విజయం సాధించింది. మన క్రికెటర్లు అద్భుతమైన ఆటతీరుతో ఇంగ్లండ్‌ క్రికెటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ చిత్తైంది. దీంతో 2-1 తేడాతో టీ 20 సిరీస్‌ను ఇండియా గెల్చుకుంది.

ప్రపంచ ఫుట్ బాల్ వరల్డ్ కప్ ఆసక్తికరంగా మారింది. గతంతో పోలిస్తే ఫుట్ బాల్ మ్యాచ్ లకు క్రేజ్ పెరిగింది. వరల్డ్ కప్ లో ఇప్పటికే ఫ్రాన్స్, బెల్జియం, ఇంగ్లాండ్ లు సెమీ ఫైనల్ కు చేరుకున్నాయి. జర్మనీ, అర్జెంటీనా, ఉరుగ్వే సెమీఫైనల్ కు చేరుకోలేకపోయాయి.

ఢిల్లీ : ఫుట్ బాల్ ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ అదరగొడుతోంది. గ్రూప్‌-జిలో పనామాతో జరిగిన మ్యాచ్‌లో 6-1తో ఇంగ్లీష్‌టీమ్‌ ఘనవిజయం సాధించింది. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.

ఢిల్లీ : హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ జోరు కొనసాగిస్తోంది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. రెండో మ్యాచ్‌లో 2-1 గోల్స్‌ తేడాతో ఒలింపిక్ ఛాంపియన్ అర్జెంటీనాపై భారీ విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

ఢిల్లీ : హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ శుభారంభం చేసింది. టోర్నీ ఏదైనా.. ప్రత్యర్థి పాకిస్థాన్ అయితే ఆధిపత్యం భారత్‌దేనని మరోసారి రుజువైంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 4-0 తేడాతో పాక్‌పై ఘన విజయం సాధించింది.

హైదరాబాద్ : జాతీయ స్థాయి స్కేటింగ్ క్రీడాకారిణి రుచిక తన భర్తపై సంచలన ఆరోపణలు చేశారు. మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని ఆరోపించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. సదరు మహిళతో తన భర్త చేసిన సెల్‌ఫోన్‌ చాటింగ్‌ ద్వారా తనకు ఈ విషయం తెలిసిందని పేర్కొంది.

ఢిల్లీ : ఫిఫా ప్రపంచకప్‌ 'గ్రూప్‌ ఎఫ్'‌ మ్యాచ్‌లో  స్వీడన్‌ బోణీకొట్టింది.  దక్షిణ కొరియాపై  1-0 తేడాతో స్వీడిష్‌ జట్టు విజయం సాధించింది. మ్యాచ్‌ 65వ నిమిషంలో స్వీడన్‌కు పెనాల్టీ లభించింది. దీనిని స్వీడన్‌ డిఫెండర్‌ ఆండ్రియాస్‌ గ్రాన్‌క్విస్ట్‌ గోల్‌గా మలిచాడు.

ఢిల్లీ : చాలా దేశాలను సాకర్‌ ఫీవర్‌ కుదిపేస్తోంది. సాకర్‌ ఫీవర్‌ కేవలం మైదానంలోనే కాదు... బయట కూడా కొనసాగుతోంది. విదేశంలో రోడ్డు పక్కన ఓ అభిమాని చేస్తున్న ఫుట్‌బాల్‌ విన్యాసాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఢిల్లీ : ఆసియాకప్‌ ఫైనల్లో భారత మహిళల టీమ్‌ ఓటమిపాలైంది. మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ను ఓడించిన బంగ్లాదేశ్‌ ఆసియాకప్‌ను కైవసం చేసుకుంది. ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. నిర్ణీత 20ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 112పరుగులు చేసింది.

ఢిల్లీ : ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో స్పెయిన్‌ బుల్‌ రాఫెల్‌ నాదల్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. రికార్డు స్థాయిలో 11వ సారి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌గా తన కెరీర్‌లో 17వ టైటిల్‌తో గ్రాండ్‌గా సలామ్‌ చేసిన నాదల్‌...

Pages

Don't Miss