మిస్టరీ ఏంటీ : స్కూల్ బిల్డింగ్ పై నుంచి పడి విద్యార్థిని మృతి

Submitted on 13 June 2019
student-died-from-the-school-building-in-hyderabad

పాఠశాలలు తెరిచి రెండు రోజులు కాకముందే ఘోర ప్రమాదం. హైదరాబాద్ సిటీ నాగోల్ లో ఓ స్కూల్ బిల్డింగ్ పైనుంచి పడి విద్యార్థిని చనిపోయింది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని LB నగర్ పోలీస్ స్టేషన్ నార్త్ పరిధిలోని సాయినగర్ కాలనీలో ఈ విషాదం జరిగింది. నాగార్జున ప్రైవేట్ స్కూల్ లో వివిక అనే విద్యార్థిని 10వ తరగతి చదువుతోంది. రోజూలాగానే గురువారం (జూన్ 13, 2019) ఉదయం స్కూల్ కు వెళ్లింది. భవనం ఐదో అంతస్తులో 10వ తరగతి క్లాస్ రూమ్. క్లాస్ రూంలోకి వెళ్తుండగా ఐదో అంతస్తు పైనుంచి కింద పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. 

ఈ ఘటనతో స్కూల్ లోని పిల్లల భయంతో వణికిపోయారు. స్కూల్ సిబ్బంది వెంటనే.. చికిత్స కోసం వివికను దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించింది. ఆస్పత్రికి వెళ్లేలోపు స్టూడెంట్ వివిక చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు. వివిక మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

పోలీసులు కేసు నమోదు చేశారు. స్కూల్ సిబ్బందిని విచారిస్తున్నారు. స్పాట్ కు చేరుకుని ప్రమాదం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదవశాత్తు పడిందా.. కావాలని దూకేసిందా.. ఈ ప్రమాదం వెనక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారిస్తున్నారు. క్లాస్ టీచర్ ను కూడా ప్రశ్నించారు. వివరాలు తెలుసుకున్నారు.  కాలనీలో ఉన్న సీపీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. వివిక మృతితో కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. విషాదంలో మునిగిపోయారు. చేతికి వచ్చిన కుతూరు అర్థాంతరంగా చనిపోవటాన్ని జీర్ణించుకోలేకుండా ఉన్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల ఆందోళనకు దిగారు.

student
vivika
died
school
building
nagole
Hyderabad

మరిన్ని వార్తలు