అంధాదూన్ రీమేక్‌లో?

Submitted on 12 June 2019
Sunil Remakes Bollywood Hit Film Andhadhun

కమెడియన్‌గా కెరీర్ ఫుల్ స్వింగ్‌లో ఉండగానే హీరోగా టర్న్ అయ్యి, హిట్ కోసం ఏళ్ల తరబడి వెయిట్ చేసి, వర్కౌట్ అవ్వక బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టు మళ్లీ కమెడియన్‌గా సినిమాలు చేస్తున్నాడు సునీల్.. ఇప్పుడు సునీల్ హీరోగా మరో సినిమా రూపొందనుందని తెలుస్తుంది. బాలీవుడ్‌లో ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే మెయిన్ లీడ్స్‌గా నటించిన అంధాదూన్ 2018 అక్టోబర్‌లో రిలీజ్ అయ్యి, మంచి కలెక్షన్స్  రాబట్టింది.

శ్రీరామ్ రాఘవన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని, పియానో ప్లేయర్ పేరుతో చైనాలో రిలీజ్ చేస్తే, అక్కడా మంచి హిట్ అవడమే కాకుండా, చైనాలో రూ.200 కోట్లు కలెక్ట్ చేసి, అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ సినిమాల లిస్ట్‌లో మూడో ప్లేస్‌లో నిలిచింది. ఇప్పుడీ సినిమా పలు భాషల్లో రీమేక్ కానుంది.

కోలీవుడ్‌లో ధనుష్ ఈ సినిమాను రీమేక్ చెయ్యనున్నాడు.. తెలుగులో సునీల్ హీరోగా నటించబోతున్నాడని తెలుస్తుంది. ఈ మూవీలో హీరో అంధుడైన పియానో ప్లేయర్.. ఈ రీమేక్‌తో సునీల్ హీరోగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Sunil
Andhadhun
Sunil Remakes Andhadhun

మరిన్ని వార్తలు