సన్నీలియోన్ నెం.1: మోడీ, షారూఖ్, సల్మాన్‌లంతా తర్వాతే

Submitted on 13 August 2019
Sunny Leone surpasses PM Modi, SRK and Salman Khan to become most Googled celebrity in India

ఆమెవరో చెప్పడానికి, గుర్తు పట్టడానికి పెద్ద సమయం పట్టదు. ఆవిడకున్న అభిమానుల వయస్సుల్లో పొంతన ఉండదు. తానే సన్నీ లియోన్. హిందీ బిగ్‌బాస్ షోలోనూ మెరిసిన సన్నీ.. తాను దత్తత తీసుకున్న పిల్లలతో ఇటీవల వార్తల్లో కనిపిస్తూనే ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి అందాన్ని, క్రేజ్‌ను కొనసాగిస్తూ వస్తున్న సన్నీలియోన్ ప్రధాని నరేంద్ర మోడీ, బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌లను వెనక్కి నెట్టేసి టాప్ 1స్థానంలోకి చేరింది. 

గూగుల్ ట్రెండ్స్ ఎనలిటిక్స్ ఆధారంగా గమనిస్తే సన్నీలియోన్ పేరును సెర్చ్ చేసిన వాళ్ల జాబితా బట్టి ప్రముఖులందరినీ వెనక్కినెట్టేసిందట. కొద్ది నెలల క్రితం కరణ్‌జిత్ కౌర్: ద అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీ లియోన్‍‌తో ప్రజలకు ఆమె మరింత దగ్గరైంది. ఈ విషయం తెలిసిన సన్నీ సంతోషం వ్యక్తం చేశారు. అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. 

'నా టీం నాకు చెప్పినప్పుడు చాలా గ్రేట్‌గా ఫీలయ్యా' అని సన్నీలియోన్ తెలిపారు. ఇలా గూగుల్ లో సెర్చ్ చేసిన వారిలో టాప్‌గా నిలవడం సన్నీకి ఇది రెండోసారి. ప్రొఫెషనల్‌గా సన్నీ.. స్పిల్ట్‌విల్లా 12రియాల్టీ షోలో కో జడ్జిగా వ్యవహరిస్తోంది. అర్జున్ పాటియాలా సాంగ్‌లలో ఒకటైన క్రేజీ హబీబీ వర్సెస్ డీసెంట్ ముందా దిల్‌జిత్ దోసంజా, వరుణ్ శర్మలతో పాటు కనిపించింది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

😘🌺🌹👰

A post shared by Sunny Leone (@sunnyleone) on

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Getting my shade swag on with @iarrasunglasses 😎 #SunnyLeone

A post shared by Sunny Leone (@sunnyleone) on

Sunny Leone
pm modi
SRK
Salman Khan
india

మరిన్ని వార్తలు