దర్బార్ - ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

Submitted on 16 May 2019
Superstar Rajinikanth Darbar 1st Schedule Completd- 2nd Schedule Starts from 29th May

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా, టాప్ డైరెక్టర్ ఏ.ఆర్.మురగదాస్ డైరెక్షన్‌లో, లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న 'దర్బార్' షూటింగ్ ముంబాయిలో స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. నయనతార హీరోయిన్‌గా, నివేదా థామస్ రజినీ కూతురిగా కనిపించనున్నారు.  మురగదాస్ ఈ సినిమాలో రజినీని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా, ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్‌గా చూపించబోతున్నాడని కోలీవుడ్ టాక్..

ఈ సినిమా లొకేషన్ నుండి లీకైన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముంబాయిలోని పలు ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న దర్బార్, ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. మే 29 నుండి దర్బార్ రెండవ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్, మలయాళ నటుడు చెంబన్ వినోద్ జోస్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్న దర్బార్ 2020 సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ సినిమాకి కెమెరా : సంతోష్ శివన్, ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, సంగీతం : అనిరుధ్, లిరిక్స్ : వివేక్.

 

Super Star Rajinikanth
Nayanthara
Anirudh
Lyca Productions
AR Murugadoss

మరిన్ని వార్తలు