టీఆర్ఎస్ సర్కార్ కు సుప్రీం షాక్ : రిజరేషన్స్ 50శాతం మించరాదు..

14:48 - December 7, 2018

ఢిల్లీ : తెలంగాణ  ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ముస్లింలు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతు సుప్రీంకోర్టులో ఆనాడు పూర్తిస్థాయి అధికారంతో వున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి (అసెంబ్లీని రద్దు చేసిన ప్రస్తుతం ఆపద్ధర్మ ప్రభుత్వంగా వున్న టీఆర్ఎస్ ప్రభుత్వం) దేశ అత్యున్నత ధర్మాసం అయిన సుప్రీంకోర్టు ముస్లింలు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతు వేసిన పిటీషన్స్ 50శాతం మించరాదని స్పష్టం చేసింది. 
రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈరోజు విచారించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది వాదిస్తూ... రాష్ట్రంలో బీసీల జనాభా అధికంగా ఉందని, ఈ ప్రత్యేక పరిస్థితుల కారణంగా ముస్లిం, గిరిజనుల రిజర్వేషన్లను పెంచాల్సి ఉందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 67 శాతం ఇవ్వాలని కోరారు. వాదనలను విన్న ధర్మాసనం... రిజర్వేషన్లను పెంచడం కుదరదని, రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని తీర్పును వెలువరించింది. కాగా ముస్లింలకు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్స్ డిమాండ్ తో టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిస్థాయి అధికారంలో వున్న సమయంలో ముస్లింలకు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతు సుప్రీంకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. 
 

Don't Miss