షాకింగ్ యాక్సిడెంట్ : గాల్లోకి ఎగిరి చెట్టుపై చిక్కిన కారు

Submitted on 15 July 2019
SUV Car goes airborne after an accident in UP's Gonda, gets stuck on a tree 

షాకింగ్ యాక్సిడెంట్.. అదో హైవే.. ఓ కారు అతివేగంగా దూసుకెళ్తోంది. ఇంతలో టర్నింగ్ వచ్చింది. కంట్రోల్ తప్పి గాల్లోకి పల్టీ కొట్టింది. కొన్ని అడుగుల ఎత్తుకు ఎగిరి రోడ్డు పక్కనే ఉన్న చెట్టులో ఇర్కుకుపోయింది. సినిమా షూటింగ్ ను తలపించేలా ఉన్న ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. గోండా-బెల్ల్సార్ హైవేపై SUV కారు ఒకటి వేగంగా దూసుకెళ్లింది. ఈ క్రమంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న డివైడర్ ను ఢీకొట్టి చెట్టులోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులో ప్రయాణిస్తున్న వారికి సంబంధించి వివరాలు తెలియలేదు. 
Also Read : వణుకుపుట్టించే వీడియో : భీకర పోరాటం.. మొసలిని మింగేసిన కొండచిలువ

కారు అతివేగమే ఈ ఫ్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కారు నడిపే వ్యక్తి మద్యం సేవించి ఉన్నాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే ఆ వీడియో..  

SUV car
airborne
Gonda
stuck on a tree
Gonda-Bellsar highway

మరిన్ని వార్తలు