వామ్మో : మనకు తెలీకుండానే ఇంత ప్లాస్టిక్ తినేస్తున్నాం

Submitted on 13 June 2019
swallowing a credit card's weight in plastic every week in stomach of humans

ప్లాస్టిక్..ప్లాస్టిక్..ప్లాస్టిక్. ప్రపంచానికి పెను ప్రమాదంగా పట్టిపీడిస్తోంది. అంతేకాదు మనకు తెలీకుండానే మనం రోజు ప్లాస్టిక్ ని తినేస్తున్నామని ఓ సర్వేలో తేలింది. అతిసూక్ష్మమైన పరిమాణంలో ఉండే ప్లాస్టిక్‌ను పలు రూపాల్లో తెలియకుండానే తినేస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. 

బాటిల్‌ వాటర్‌, షెల్‌ ఫిష్‌, బీర్‌, ఉప్పు తదితర ఆహార, ద్రవ పదార్థాల ద్వారా ప్రమాదకరమైన ప్లాస్టిక్‌ పొట్టలోకి చేరుతున్నట్లు ఆస్ట్రేలియాలోని యూనివర్శిటీ ఆఫ్ న్యూకాజిల్ నిర్వహించిన సర్వే స్పష్టంచేసింది. ఇదంతా మనకు తెలికేండానే మన పొట్టలోకి చేరిపోతోందని తెేలింది. 
 

ఇది అత్యంత ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ప్రతి మనిషి ఒక వారానికి క్రెటిడ్ కార్డు బరువంత (సుమారుగా 5 గ్రాములు) ప్లాస్టిక్‌ను తినేస్తున్నామని సైంటిస్టులు తెలిపారు. దీంతో ఎక్కువ శాతం నీళ్ల ద్వారానే మన శరీరంలోకి వెళుతున్నట్టు తెలిపారు.

వాటర్ ద్వారా  1769 ప్లాస్టిక్ కణాలు వారానికి మనిషి శరీరంలోకి వెళ్తున్నట్టు తెలిపారు. ఈ పరిశోధనలో భాగంగా..అమెరికాలో ట్యాప్ వాటర్ సాంపిల్స్‌ తీసుకుని పరీక్షించారు. అందులో దులో 94.4 శాతం సాంపిల్స్‌లలో ప్లాస్టిక్ ఫైబర్ ఉన్నట్టు గుర్తించారు.

ఈ లెక్కన చూసుకుంటే ప్రతీ లీటర్ వాటర్ లోను 9.6 ఫైబర్లు ఉన్నట్లుగా తేలింది. ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటి ఏమిటంటే..ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది యూరోపియన్ దేశాల్లోని వాటర్ లో తక్కువ శాతం ఉందని తమ పరిశోధనల్లో నమోదైందని సైంటిస్టులు తెలిపారు. యూరప్ దేశాల్లోని 72.2 శాతం వాటర్ సాంపిల్స్‌లలో మాత్రమే ఫైబర్ అంటే లీటర్ వాటర్‌లో 3.8 శాతం ఫైబర్ ఉందని సర్వేలో వెల్లడైంది. 

credit card
weight
Plastic
every week
humans stomach
wallowing
survey.University of Newcastle.Australiaa.

మరిన్ని వార్తలు