అల్లాహ్ అక్బర్ అంటూ...రోడ్డుపై కత్తితో యువకుడు బీభత్సం

Submitted on 14 August 2019
Sydney stabbing suspect Mert Ney faces murder charge after CBD rampage

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో దారుణం జరిగింది. మెర్ట్ నే అనే 20ఏళ్ల యువకుడు కిచెన్ రూంలో ఉపయోగించే కత్తితో నడిరోడ్డుపై ఓ మహిళపై దాడి చేశాడు. అల్లాహ్ అక్బర్ అంటూ గట్టిగా అరుస్తూ కార్లు పైకి ఎక్కి దూకుతూ నా తలని కాల్చండి అంటూ రోడ్డుపై వెళ్తున్న వారిపై కూడా దాడికి కూడా ప్రయత్నించాడు.  సిడ్నీలోని అత్యంత రద్దీగా ఉండే సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ లో మంగళవారం ఈ దారుణం జరిగింది.

మహిళపై కత్తితో దాడి చేసి రోడ్డుపై వెళ్తున్న వారిపై దాడికి యత్నించిన యువకుడిని కొంతమంది స్థానిక వర్కర్లు అడ్డుకున్నారు. మిల్క్ క్రేట్, కుర్చీ,గునపం ఉపయోగించి అడ్డుకున్నారు. అతడిని మిల్క్ క్రేట్, కుర్చీ ఉపయోగించి   బంధించారు. ఆ తర్వాత పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అయితే అతడు ఏదైనా ఉగ్రసంస్థ కోసం పని చేస్తున్నాడా అన్నది తేలాల్సి ఉందని పోలీస్ కమిషనర్ మిక్ ఫుల్లర్ తెలిపారు.

మెర్ట్ నే గతంలో అమెరికా,న్యూజిలాండ్ లో కూడా ఇలాంటి దాడులకు పాల్పడినట్లు సమాచారం. అతడి మానసిక పరిస్థితి కూడా సరిగా లేదని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దాడిలో గాయపడిన మహిళ ప్రస్తుతం సెంట్ విన్సెంట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నట్లు తెలిపారు. 

అయితే ధైర్యసాహసాలు ప్రదర్శించి నిందితుడిని అడ్డుకున్న వ్యక్తులకు పోలీసులు మెచ్చుకున్నారు. రియల్ హీరోస్ అంటూ వారిని ప్రశంసించారు. త్వరలో వారికి ఆస్ట్రేలియా ప్రభుత్వం సాహస అవార్డు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Sydney
STABBING
suspect
Mert Ney
faces
murder charge
CBD rampage

మరిన్ని వార్తలు