అంబేద్కర్

14:48 - October 20, 2018

నిర్మల్: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. కేసీఆర్‌కు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేదర్కర్ పేరు నచ్చదని రాహుల్ గాంధీ అన్నారు. దేశం మొత్తం అంబేద్కర్ నామస్మరణ చేస్తుంటే.. కేసీఆర్‌కు మాత్రం నచ్చడం లేదన్నారు. అందుకే ఏ పథకానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టలేదని రాహుల్ విమర్శించారు. అంబేద్కర్ ప్రాజెక్టును సైతం కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారని రాహుల్ మండిపడ్డారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భైంసాలో రాహుల్ గర్జన పేరిట బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్ ప్రాజెక్టులను రీడిజైన్ చేసి వేల కోట్ల రూపాయలను టీఆర్ఎస్ దండుకుందని రాహుల్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులను భారీగా పెంచారని మండిపడ్డారు. రీ డిజైన్ పేరుతో ప్రజాధనం వృథా చేస్తున్నారని టీఆర్ఎస్ ప్రభుత్వంపై రాహుల్ ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల పేరుతో ఇష్టం వచ్చినట్లు డబ్బు ఖర్చు పెడుతున్నారని విరుచుకుపడ్డారు.

రైతులకు లాభం కలిగించేలా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టాన్ని ప్రధాని మోదీ సూచనలలో కేసీఆర్ ఇక్కడ అమలు చేయడం లేదని రాహుల్ మండిపడ్డారు. ఫలితంగా ప్రభుత్వం భూములను లాక్కునే పరిస్థితి ఉందన్నారు. కేసీఆర్, మోదీ ఎక్కడికి వెళ్లినా అబద్దాలు చెబుతున్నారని రాహుల్ అన్నారు.

14:31 - October 1, 2018

ఢిల్లీ : దేశంలో రిజర్వేషన్స్ అంశంపై సుదీర్ఘంగా చర్చ జరుగుతోంది. అర్హత, ప్రతిభను బట్టే రిజర్వేషన్స్ వుండాలని కొందరు వాదిస్తుంటే..వెనుకబడిన వర్గాలను అభివృద్ది కోసం రిజర్వేషన్స్ కొనసాగించాలని మరికొందరి వాదన. ఈ నేపథ్యంలో రిజర్వేషన్స్ పై లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  దళితులు, ఇతర వెనుకపడిన వర్గాలకు అందజేస్తున్న రిజర్వేషన్లపై జార్ఖండ్ లో జరిగిన ‘లోక్ మానథాన్’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్న నేపథ్యంలో సామాజిక సామరస్యం సాధించేందుకు వీలుగానే అంబేడ్కర్ రిజర్వేషన్లు తీసుకొచ్చారని తెలిపారు. కానీ రిజర్వేషన్ల కారణంగా ఆయా రంగాల్లో తీవ్రమైన శూన్యత ఏర్పడిందని వ్యాఖ్యానించారు. తొలుత పదేళ్లకు మాత్రమే అనుకున్న రిజర్వేషన్లను పెంచుకుంటూ పోవడం వల్ల దేశానికి ఎలాంటి ప్రయోజనం లభించలేదని అభిప్రాయపడ్డారు. సామాజిక ప్రగతి సాధించాలంటే రిజర్వేషన్లు అవసరం లేదనీ..ఆలోచనలను, చేతలను మార్చుకోవాలని మహాజన్ తెలిపారు. అలా చేసినప్పుడే అంబేడ్కర్ కన్న కలలు సాకారం అవుతాయని ఆమె అభిప్రాయపడ్డారు.

11:17 - July 21, 2018

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ మళ్లీ ఆందోళనలు ప్రారంభమయ్యాయి. పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం వీగిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా కల్పించాలని..కేంద్ర, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ సీపీఐ, కాంగ్రెస్, ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఢిల్లీలోని ఏపీ భవన్ లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట బైఠాయించారు. ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు, కార్యకర్తలు నిరసన తెలియచేస్తున్నారు.

ఈ సందర్భంగా ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ టెన్ టివి ముచ్చటించింది. గత నాలుగేళ్లుగా మోడీ వ్యవహారం ఉందని..ఈసారి మరింత బరి తెగించారని విమర్శించారు. ఎన్నికల సమయంలో వాగ్ధానాలు ఇచ్చారని..తిరుపతిలో ప్రత్యేక హోదా..విభజన హామీలను ప్రస్తావించారని గుర్తు చేశారు. కానీ నిధుల కేటాయింపు..విభజన హామీలు..ప్రత్యేక హోదా విషయంలో విఫలమయ్యారని తెలతిపారు. ఐదు సార్లు బంద్..ఎన్నో ఆందోళనలు..నిరసనలు తెలియచేయడం జరిగిందని, కానీ అవిశ్వాస తీర్మానంలో కొన్నింటినైనా అమలు చేస్తారని ప్రజలు ఆశించారని తెలిపారు. ఏపీపై కేంద్రానికి వ్యతిరేకత ఉందని, దీనిని ప్రజల్లో ఎండగడుతామన్నారు. ప్రభుత్వం యొక్క వైఫల్యాలు..హామీలపై పార్లమెంట్ లో చర్చ జరిగిందని..కానీ కేంద్రం సానుకూలంగా స్పందించలేదన్నారు. నిరంకుశంగా...తాము చేయ్యం..ఏం చేస్తారో చేసుకోవాలని పేర్కొంటున్నారని..ఇది మోడీకి తగదన్నారు. మంగళవారం నాడు బంద్ కు మద్దతు తెలియచేయాలని వైసీపీ కోరడం జరిగిందని, వామపక్ష నేతలు..జనసేన పార్టీలతో సంప్రదించిన అనంతరం తాము స్పందిస్తామన్నారు. 

09:41 - June 22, 2018
13:30 - June 10, 2018

యాదాద్రి భువనగిరి : రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌కు అవమానం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అంబేద్కర్‌ విగ్రహానికి నల్లరంగు టీషర్ట్‌ను చుట్టారు. దీంతో దళిత, గిరిజన ప్రజాసంఘాలు ఘటనాస్థలంలో ఆందోళనకు దిగారు. సీసీ ఫుటేజీ ద్వారా నిందితులను గుర్తించి.. అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 12 గంటల్లో నిందితులను అరెస్ట్‌ చేస్తామని ఏసీపీ హామీ ఇవ్వడంతో ప్రజా సంఘాల నేతలు ఆందోళన విరమించారు.

12:30 - June 10, 2018

 

విశాఖపట్టణం : జస్టిస్ అనే పదం అంబేద్కర్ వాడారని, ఇందుకు మూడు న్యాయాలు కావాలని చెప్పారని బిఎల్ ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఆదివాసీ బహుజనుల ఐక్యత, భిన్న ధృక్పథాలపై సమావేశం జరిగింది. సఫాయి కర్మచారి ఆందోళన జాతీయ కన్వీనర్ బెజవాడ విల్సన్ హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న తమ్మినేని మాట్లాడుతూ...రిజర్వేషన్లు కొన్ని హక్కులకు మాత్రమే పరిమితమయ్యాయని తెలిపారు. ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయం, రాజకీయ న్యాయం కావాలని అంబేద్కర్ చెప్పడం జరిగిందన్నారు. కానీ ఇవన్నీ ఏం జరుగలేదన్నారు. రాజకీయ స్వాతంత్రం ఓటు హక్కు ద్వారా వచ్చిందని, ఓటు విలువలో మాత్రం సమానమని..ఆస్తి విలువలో తేడా ఉంటుందని అంబేద్కర్ పేర్కొన్నారని తెలిపారుర. సామాజిక హోదాలో ఆ తేడా ఉందని..ఆర్థిక అంతస్తులో తేడా ఉంటుందని...సామాజిక, ఆర్థిక న్యాయాన్ని సాధించుకోలేకపోతే రాజకీయ హక్కు కూడా పోతుందని అంబేద్కర్ హెచ్చరించారని గుర్తు చేశారు. 

21:47 - May 11, 2018

తూర్పుగోదావరి : జిల్లా ఐ.పొలవరం మండలంలో ఉద్రిక్త పరిస్థతి ఏర్పడింది. కేశనకుర్రు గ్రామంలో గతనెల 18న జరిగిన అంబేద్కర్‌ విగ్రహ ధ్వంసం ఘటన చిలికి చిలికి గాలివానగా మారింది. కొత్త విగ్రహాన్ని.. విగ్రహం ధ్వంసం అయిన ప్రాంతంలో కాకుండా మరో ప్రాంతంలో ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. స్థానిక దళిత సంఘాలు ఛలో కేశనకుర్రుకు పిలుపునిచ్చాయి. గ్రామంలో భారీగా పోలీసులను మోహరించినప్పటికి, దళితులంతా ఒక్కసారిగా ఘటనాస్థలికి చేరుకోవడంతో.. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులకు, దళితులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు దళిత మహిళలను, యువకులను అరెస్ట్‌ చేయడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

17:59 - April 14, 2018

గుంటూరు : రాజ్యాంగ నిర్మాత బీ.ఆర్‌.అంబేద్కర్‌ 127 జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా చంద్రబాబు అంబేద్కర్ స్మృతివనం ఆకృతిని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. శాఖమూరులో 20 ఎకరాలలో రూ.100కోట్లతో అంబేద్కర్ స్ఫూర్తిని చాటేలా అంబేద్కర్ స్మృతివనం ఆకృతిని నిర్మాణం చేపడతామని చంద్రబాబు తెలిపారు. రాజ్యాంగస్ఫూర్తిని అనుసరిస్తూ దేశంలో పాలన సాగాల్సిన అవసరం ఉందన్నారు. అంబేద్కర్‌ గొప్పతనం భావితరాలకు తెలియాలనే రాజధాని అమరావతిలో అంబేద్కర్‌ స్మృతివనం నిర్మిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. 

10:34 - April 14, 2018

హైదరాబాద్ : బలహీన వర్గాలకు మోడీ ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు పేర్కొన్నారు. లిబర్టి వద్దనున్న ట్యాంక్ బండ్ విగ్రహానికి సీపీఎం నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాఘవులు, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంలు మీడియాతో మాట్లాడారు. దేశంలో దళితులు, మైనార్టీలు, మహిళలు వారి ఆత్మగౌరవాన్ని కోరుకొనే వారు మతోన్మాద సంఘ్ పరివార్ శక్తులతో పోరాడాల్సినవసరం ఉందని తెలిపారు. బహుజనులకు రాజ్యాధికారం సాధిస్తే అప్పుడే అంబేద్కర్ కు అసలైన నివాళి అని తమ్మినేని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బహుజనులు రాజ్యాధికారం సాధించేందుకు బిఎల్ఎఫ్ కృషి చేస్తోందన్నారు. 

09:44 - April 14, 2018

హైదరాబాద్ : గొర్రెనో..బర్రెనో..ఇస్తే సామాజిక న్యాయం కల్పించినట్లు కాదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...ఇవి కేవలం సామాజిక సహాయాలు సంక్షేమాలు మాత్రమేనని, గత ప్రభుత్వాలు అన్ని సంక్షేమ పథకాలు అమలు పరిచాయన్నారు. కొంత లబ్ధి జరిగినా అవి బతుకులు మార్చిన స్కీంలు కాదని, బతుకులు మారాలంటే సామాజిక న్యాయం జరగాలన్నారు. చట్టబద్ధమైన అధికారాలు...రక్షణలు ఉండాలని, రాజ్యాంగపరమైన రక్షణాలుండాలన్నారచు. దేశంలో దళితులపై జరుగుతున్న దాడులు అరికట్టాలని పేర్కొన్నారు. అంతిమంగా అసెంబ్లీలో..పార్లమెంట్ లో బహుజనులందరికీ వారి వారి జనాభాను బట్టి వాటాలు లభించాయని, ఇది నెరవేరినప్పుడే సామాజిక న్యాయం అమలైనట్లు భావించాలన్నారు. సామాజిక న్యాయం అంటూ పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారని, 119 అసెంబ్లీ సీట్లలో బీసీలకు ఎన్ని సీట్లు కేటాయిస్తారనే దానిపై చెప్పడం లేదన్నారు. 65-70 తక్కువ కాకుండా బీసీలకు సీట్లు కేటాయిస్తామని ఇప్పటికే ప్రకటించామన్నారు. బీఎల్ఎఫ్ చేస్తున్న పని తీరును గమనించి మద్దతివ్వాలని కోరారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - అంబేద్కర్