అక్రమాస్తులు

16:41 - April 21, 2017

హైదరాబాద్: అక్ర‌మాస్తుల కేసులో సాక్షుల‌ను ప్ర‌భావితం చేసేలా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని పేర్కొంటూ వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఇచ్చిన బెయిల్‌ను ర‌ద్దు చేయాల‌ని సీబీఐ అధికారులు సీబీఐ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఈ పిటిష‌న్‌పై ఈ రోజు విచార‌ణ జ‌రిపిన న్యాయ‌స్థానం వాదనలు విని, ఈ నెల 28కి తీర్పును వాయిదా వేసింది. అయితే, మ‌రోవైపు న్యూజిలాండ్ వెళ్లేందుకు త‌న‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని సీబీఐ కోర్టులో జ‌గ‌న్ పిటిష‌న్ వేశారు. మే 15 నుంచి జూన్ 15 మ‌ధ్య 15 రోజులు వెళ్లేందుకు ఆయ‌న‌ అనుమ‌తి కోరారు. వేస‌వి సెల‌వుల నిమిత్తం కుటుంబంతో క‌లిసి వెళ్లాల‌ని జ‌గ‌న్ పిటిష‌న్ లో పేర్కొన్నారు. అయితే, దీనిపై విచారించిన కోర్టు ప‌లు అభ్యంత‌రాలు తెలుపుతూ త‌మ‌ నిర్ణ‌యం ఈ నెల 28న తెలుపుతామ‌ని చెప్పింది.

18:05 - April 20, 2017

హైదరాబాద్‌ : ఏసీబీ అధికారులకు పట్టబడ్డ ఏపీఈడబ్ల్యూఐడీసీ సీఈ జగదీశ్వర్‌రెడ్డి ఆస్తులు రోజు రోజుకూ బయటపడుతూనే ఉన్నాయి. జగదీశ్వర్‌రెడ్డికి సంబంధించిన బ్యాంకు లాకర్లను ఏసీబీ అధికారులు తెరిపించారు. బాగ్‌ అంబర్‌పేట్‌ ఆంధ్రా బ్యాంక్‌, ఉప్పల్‌ కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌లలో ఐదు లాకర్లను తెరిచిన అధికారులు రెండు కోట్ల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను గుర్తించారు. 

21:22 - April 8, 2017

విశాఖ : పార్టీ ఫిరాయింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలిసారిగా నోరుమెదిపారు. జగన్ తీరు భరించలేని నేతలు టీడీపీలోకి వచ్చారన్నారు. ఆయన విశాఖ లో మాట్లాడుతూ... గతంలో ఫిరాయింపులపై తాను ఫిర్యాదుచేసిన మాట వాస్తవమే కాని అప్పటి పరిస్థితులు.. ఇప్పటి పరిస్థితులకు చాలా తేడా ఉందన్నారు. వైఎస్ హయాంలో ఫిరాయింపులను ప్రోత్సహించలేదా.. ప్రతి సంవత్సరం తన కుటుంబం యొక్క ఆస్తులను వెల్లడిస్తున్నామని.. జగన్‌కు తన ఆస్తులను వెల్లడించే దమ్ముందా అని ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధికి జగన్ అడ్డుపడుతున్నారని విమర్శించారు.

 

16:44 - April 8, 2017

అనంతపురం : ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుళ్లకు మొక్కుతారని..అలాగే జగన్‌ కూడా అక్రమాస్తుల కేసు తెరపైకి వచ్చినప్పుడల్లా రాష్ట్రపతితో పాటు ఇతర పెద్దలతో భేటీ అవుతున్నాడని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. అనంతపురం కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడిన జేసీ..తమ ఎమ్మెల్యేలకు చంద్రబాబు మంత్రి పదవులు ఇస్తే రాష్ట్రపతి ఏం చేస్తారని అన్నారు.

18:57 - April 6, 2017

ఢిల్లీ: జగన్‌కు కోర్టులో కేసులు విచారణకు వస్తున్నప్పుడు ఢిల్లీ గుర్తుకొస్తుందన్నారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి. ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై జగన్‌ రాష్ట్రపతి, ప్రధాని, ఈసీలకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం ఏమీ ఉండదని.. అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాగే జరుగుతుందని జేసీ అన్నారు.

11:05 - April 4, 2017

విశాఖ : ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్ గంగాధర్ అక్రమాస్తుల విలువ రూ.300 కోట్లకు పైగా ఉందని ఏసీబీ అధికారులు నిర్ధారించారు. గంగాధర్ కాంట్రాక్టర్లతో చేతులు కలిపి భారీగా ఆస్తుల్ని సంపాదించినట్లు తెలుస్తోంది. గంగాధర్ చిత్తూరు జిల్లాలో 19 ఎకరాల భూమిని, మరో 6 ఎకరాల డీ పట్టా భూమిని ఆక్రమించకున్నట్లు అధికారులు తెలిపారు. నేల్లూరు జిల్లాలో నాలుగు ఎకరాల భూమి ఉన్నట్టు ఏసీబీ సోదాల్లో బయపడింది. అంతే కాకుండా హైదరాబాద్, విశాఖల్లో బ్యాంకు లాకర్లలో రెండు కిలోల బంగారాన్ని అధికారులు గుర్తించారు.

 

 

11:54 - April 1, 2017

అమరావతి: అవినీతి అనకొండ గంగాధర్‌ నివాసాల్లో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి... ఏసీబీ తనిఖీల్లో కోట్ల కొద్దీ ఆస్తులు బయటపడుతున్నాయి.. ఏపీ ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్‌గాఉన్న గంగాధర్‌ నివాసాల్లో దాదాపు వందకోట్ల విలువైన ఆస్తుల్ని అధికారులు గుర్తించారు.. రోడ్డు కాంట్రాక్టర్‌ నాగభూషణం ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి.. బీమిలి 4లైన్ల రోడ్డు నిర్మాణంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ గంగాధర్‌, నాగభూషణంపై ఆరోపణలున్నాయి.. ఏకకాలంలో విశాఖ, నెల్లూరు, కడప, గుంటూరు, హైదరాబాద్‌, విజయవాడ, బెంగళూరులో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు..

10:51 - April 1, 2017
09:34 - April 1, 2017

విశాఖ: ఏపీ ఆర్ అండ్ బీ ఇంజనీరింగ్ చీఫ్ గంగాధర్, రోడ్డు కాంట్రాక్టర్ నాగభూషణం ఇళ్ల పై ఏసీబీ దాడి చేసింది. ఏక కాలంలో విశాఖ, నెల్లూరు, కడప, గుంటూరు, హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. గంగాధర్, నాగభూషణం బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. భీమిలి 4 లైన్ల రోడ్డు నిర్మాణంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో ఈ దాడులు నిర్వహిస్తోన్నట్లు సమాచారం.

15:36 - March 24, 2017

అమరావతి: వింత ప్రవర్తన కలిగిన వ్యక్తి జగన్ అని కళా వెంకట్రావు అన్నారు. ఏప అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా ఉండడం అటు ప్రజలకు, ఇటు సభకు దురదృష్టంగా భావిస్తున్నా అని తెలిపారు. జ‌గ‌న్ అక్ర‌మాల గురించి ప్ర‌జ‌లు టీవీల్లో చూస్తూనే ఉన్నారని చెప్పారు. ఇటువంటి క్యారెక్ట‌ర్ ఉన్న‌వారు అసెంబ్లీలో ఉండ‌డం మ‌న దుర‌దృష్ట‌మ‌ని వ్యాఖ్యానించారు. కొడుకులు ఎటువంటి ప‌నులు చేసినా త‌ల్లికి త‌ప్ప‌దు కాబ‌ట్టి జ‌గ‌న్ త‌ల్లి భ‌రిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. తండ్రి అధికారంలో ఉన్న‌ప్పుడు జ‌గ‌న్ ఎన్నో అక్ర‌మాలకు పాల్పడ్డారని అన్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - అక్రమాస్తులు