అక్రమ రవాణా

15:04 - August 1, 2018

ఇటీవల ఆడపిల్లల అక్రమ రవాణా పెరిగిపోయింది. ఆడపిల్లలను అక్రమ రవాణా చేస్తూ లక్షలు, కోట్లు గడిస్తున్నారు. వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు. పిల్లలను చిత్ర హింసలకు గురి చేస్తున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఇదే అంశంపై నిర్వహించిన మైరైట్ కార్యక్రమంలో లాయర్ పార్వతి పాల్గొని, మాట్లాడారు. ఆడపిల్లల అక్రమ రవాణాను అరికట్టాలన్నారు. ఆ వివరాలను వీడియోలో చూద్డాం...

 

18:56 - August 1, 2017

నెల్లూరు : ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురు స్మగ్లర్లను నెల్లూరు జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. జిల్లాలోని  చెలికంపాడు ఎస్‌.ఎస్‌ కాలువ వద్ద అక్రమంగా రవాణా చేస్తున్న సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 16 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఐదుగురు స్మగ్లర్లను అరెస్ట్‌ చేశారు..

 

20:54 - June 6, 2017

పశ్చిమగోదావరి : పోడూరు మండలం గుమ్ములూరులో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 8 లారీలను పోలీసులు సీజ్‌ చేశారు.. గస్తీ నిర్వహిస్తున్న ఎస్ ఐ రవీంద్రబాబు బృందం ఇసుక లారీలను ఆపింది.. ఇసుక రవాణాకు సంబంధించి పత్రాలు చూపాలని అడిగారు.. డ్రైవర్లు ఎలాంటి పత్రాలు చూపకపోవడంతో 8 లారీలను సీజ్‌ చేశారు.. అయితే ఈ లారీలను ఎందుకు సీజ్‌ చేశారంటూ కొందరు రాజకీయ నేతలు పోలీస్‌ స్టేషన్‌కువచ్చి బెదిరిస్తున్నారని... ఇష్టంవచ్చినట్లు తిడుతున్నారని పోలీసులు చెబుతున్నారు.. 

 

20:22 - September 17, 2016

చిత్తూరు : జిల్లాను మహిళల అక్రమ రవాణా వ్యవహారం కుదిపేస్తోంది. విదేశాల్లో ఉద్యోగుల పేరిట మహిళలకు వలవేసి రూ.1.50లక్షల నుంచి రూ.2లక్షలకు విదేశాల్లో  అమ్మేస్తున్నారు. మలేషియా కేంద్రంగా వ్యాపారం గుట్టుగా సాగుతోంది. పోలీసుల అదుపులో వ్యభిచారగృహ నిర్వాహకులు, బ్రోకర్లు, కీలక దళారులు పాండ్యరాజన్‌, రఫీ ఉన్నారు. 6నెలలలో సుమారు 300మంది మహిళలను విదేశాలకు తరలించినట్లు పోలీసులు గుర్తించారు.  తమను హింసిస్తున్నారని బాధితులు గోడు వెల్లబోసుకుంటున్నారు.  విదేశాల్లో చిక్కుకున్న మహిళలను సొంతగ్రామాలకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

 

14:12 - October 5, 2015

ప్రకాశం : జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై టెన్ టివిలో ప్రసారమైన కథనాలపై ఏపీ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. మంత్రి శిద్ధా రాఘవయ్య ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసు యంత్రాంగం 29 మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచింది.
చీమకుర్తిలో ఇసుక అక్రమరవాణాపై ఈనెల 25వ తేదీన టెన్ టివిలో పలు కథనాలు ప్రసారమయ్యాయి. మైలవరం తదితర ప్రాంతాల్లో అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నారు. అదుపులోకి తీసుకున్న 29 మంది ఓ ప్రజాప్రతినిధికి చెందిన ఇద్దరు బంధువులున్నట్లు సమాచారం. 

15:27 - August 25, 2015

కడప: ఎర్రచందన స్మగ్లింగ్‌పై పోలీసులు, అటవీశాఖ అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోతోంది. తాజాగా కడప జిల్లాలో ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురి స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రెండు కోట్ల విలువ చేసే..రెండు టన్నుల ఎర్రచందనం దుంగలు, ఓ ఆయిల్‌ట్యాంకర్‌, నాలుగు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

09:19 - August 6, 2015

ఏంటీ ? గాడిదలు స్మగ్లింగ్ చేయడం ఏంటీ ? అంతేగాక వాటిని అరెస్టు కూడా చేశారా ? అని నోరెళ్ల బెడుతున్నారా ? కానీ ఇది నిజం. వాస్తవం. అక్రమాలకు పాల్పడుతున్నాయంటూ మహారాష్ట్ర పోలీసులు ఏకంగా 56 గాడిదలను అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. ఇటీవలే ఆ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఏక్ నాథ్ గాడ్సే స్వయంగా అసెంబ్లీలో ఈ విషయాన్ని వెల్లడించారు. పందార్ పూర్ లోని టెంపుల్ టౌన్ సమీపంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న విషయం తెలుసుకున్న పోలీసులు ఇసుక బస్తాలు మోసుకపోతున్న గాడిదదలు కనిపించాయంట. వెంటనే ఆ ఖాకీలు వాటిని అరెస్టు చేసి స్టేషన్ కు తీసుకెళ్లారంట. గాడిదలను మాత్రం స్టేట్ హోం కు తరలించినట్లు, వాటికి మంచి ఆహారం పెడుతున్నామని సదరు మంత్రి వెల్లడించారు. అదండి సంగతి..

Don't Miss

Subscribe to RSS - అక్రమ రవాణా