అజిత్

14:11 - November 8, 2018

తమిళ స్టార్ హీరో, తల అజిత్, దర్శకుడు శివల కాంబినేషన్‌లో, వీరం, వేదాళం, వివేకం తర్వాత, విశ్వాసం అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా సెట్‌లో, ఒక డ్యాన్సర్ మరణించిన ఘటన గురించి తెలిసి కోలీవుడ్ ఉలిక్కి పడింది.
ప్రస్తుతం, విశ్వాసం సినిమాలోని ఒక పాట చిత్రీకరణ పూణెలో జరుగుతుంది. రిహార్సల్స్ చేస్తున్న టైమ్‌లో, శరవణన్ అనే డ్యాన్సర్, గుండెపోటు రావడంతో సెట్‌లోనే కుప్పకూలిపోయాడు. యూనిట్ సభ్యులు వెంటనే అతణ్ణి హాస్పిటల్‌కి తీసుకెళ్ళగా, అప్పటికే శరవణన్ మృతిచెందినట్టు డాక్టర్స్ చెప్పడంతో, యూనిట్ సభ్యులు షాక్ అయ్యారు. ఈ విషయం తెలిసి, అజిత్ చాలా బాధపడ్డాడట. తనే దగ్గరుండి పోస్ట్‌మార్టం పనులవీ చూసుకున్నాడని మూవీ యూనిట్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇక, శరవణన్ గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడనీ, కానీ, ఆసంగతి యూనిట్ వారికి చెప్పలేదని తోటి డ్యాన్సర్స్ అంటున్నారు. శరవణన్ మృతదేహాన్ని చెన్నైలోని అతని కుటుంబ సభ్యులకు అప్పచెప్పడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చెయ్యడంతో పాటుగా, మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల ఆర్థిక సాయం అందచేసింది విశ్వాసం టీమ్.  

13:47 - October 26, 2018

తల అజిత్, దర్శకుడు శివల కాంబినేషన్‌లో ఇంతకుముందు వీరం, వేదాళం, వివేకం సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి నాలుగవ చిత్రం చేస్తున్నారు. సత్యజ్యోతి ఫిలింస్ పతాకంపై, టి.జి.త్యాగరాజన్ సమర్పణలో, సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్న మూవీ, విశ్వాసం.. నయన తార హీరోయిన్. డి.ఇమాన్ సంగీతమందిస్తున్నాడు. విశ్వాసంలో అజిత్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇంతకుముందు రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్ రాగా, ఇప్పుడు విశ్వాసం సెకండ్‌లుక్ విడుదల చేసింది మూవీ‌ యూనిట్.. సాధారణంగా సాల్ట్‌ అండ్ పెప్పర్ లుక్‌లో ఉండే అజిత్, బ్లాక్ హెయిర్, గెడ్డంతో, బైక్‌పై ఉన్నలుక్ బాగుంది. హెల్మెట్ పెట్టుకుని, రెండు చేతులు పైకెత్తి అభివాదం చేస్తున్నాడు తల.. అతని వెనక జనాలందరూ పరిగెత్తడం చూస్తుంటే, ఈ సన్నివేశం పాటలో వస్తుందేమో అనిపిస్తుంది. కోవై సరళ, తంబి రామయ్య, వివేక్, రోబో శంకర్ తదితరులు నటిస్తున్న విశ్వాసం, 2019 సంక్రాంతికి  గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

 

17:15 - September 1, 2018

ఒక హిట్ కొట్టగానే విర్రవీగే తెలుగు కుర్ర హీరోలకు తెలుగు క్యారెక్టర్ నటి మీనా ఓ ఝలక్ ిఇచ్చింది. నేను చాలా మంది హీరోలను చూశాను. ఒక్క హిట్ కొట్టగానే విర్రవీగిపోతుంటారు. వారిలో కుక్క బుద్ధిలాంటి ఈగో తారాస్థాయికి చేరుకుంటుంది. ఇటువంటి నటులందరు తమిళ హీరో అజిత్ కాళ్లు కడిగి నెత్తిమీద నీళ్ళు  జల్లుకోవాలి అంటూ  వదిన, అక్క క్యారెక్టర్లలో కనిపించే మీనా తన సోషల్ మీడియా ఖాతాలో వ్యాఖ్యానం పోస్ట్ చేసింది. అంతేకాదు..ఆయన పాదపూజ చేసుకుంటే కనీసం 10 శాతం మంచితనమైన పెరుగుతుందని తన పోస్ట్ లో పేర్కొంది. 

ఈ వ్యాఖ్య  ఎవరిగురించో కొంత అర్ధం అయినా.. కుర్రహీరోలందరూ ఈ నటిపై గుర్రుగా ఉన్నారు. ఈ నటి అజిత్ సినిమాలో ఓ పాత్ర పోషించింది ఇటీవల. అదీ అసలు విషయం. 

 

11:42 - August 24, 2017

హీరో..హీరోయిన్లకు ఎంతో మంది అభిమానులు ఉంటుంటారు. వారి చిత్రాలు విడుదలవుతుంటే వారి ఆనందానికి అవధులుండవు. థియేటర్లను అందంగా తీర్చిదిద్దేస్తారు. హీరో..హీరోయిన్ల కటౌట్లకు పాలాభిషేకాలు..పూలమాలలతో ముంచెత్తుతుంటారు. ముఖ్యంగా తమిళ అభిమానుల ఈ విషయంలో ముందుంటారు. అగ్ర హీరోల సినిమాలు విడుదలవుతున్న సందర్భంలో ఆయా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. తాజాగా 'అజిత్' హీరోగా నటించిన 'వివేగం' సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా ఆయన అభిమానులు వినూత్నంగా సంబరాలు చేసుకున్నారు.

తమిళనాడులో అగ్ర హీరోల్లో ఒకరైన 'అజిత్' తాజా చిత్రం 'వివేగం' ప్రపంచ వ్యాప్తంగా గురువారం విడుదలైంది. 'వేదాళం' సినిమా విడుదలై దాదాపు రెండేళ్లు పూర్తి కావస్తోంది. సత్యజోతి ఫిలింస్ బ్యానర్ పై 'సిరుతై శివ' దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో 'వివేగం' చిత్రం తెరకెక్కింది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, కాజల్ అగర్వాల్, అక్షరలతో పాటు పలువురు హాలీవుడ్ స్టంట్ ఆర్టిస్టులు నటించారు.

ఇదిలా ఉంటే చిత్రం రిలీజ్ సందర్భంగా ఆయన అభిమానులు ఏకంగా 57 కిలోల బరువున్న ఇడ్లీని 'అజిత్' ఆకృతిలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తమిళనాడు సమైయల్ కలై తాలజాలర్ మున్నేట్ర సంఘం కార్యదర్శి ఇనియావన్ మీడియాతో మాట్లాడారు. ఇది అజిత్ కు 57వ సినిమా కావడంతో 57 కిలోల ఇడ్లీని తయారు చేసినట్లు పేర్కొన్నారు. మరి వివేగం అజిత్ అభిమానులను అలరిస్తుందా ? లేదా ? అనేది చూడాలి. 

12:49 - August 18, 2017

అజిత్ చిత్రం వివేగం రిలీజ్ కు సిద్ధమౌతోంది. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. శివ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా సినిమా తెరకెక్కుతోంది. సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్ విడుదలై హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో చిత్ర ట్రైలర్ ను యూ ట్యూబ్ లో విడుదల చేశారు. 2.24 నిమిషాల పాటు ట్రైలర్‌ సాగింది. 
నేను ఎవరనేది.. ఎదుటివాడిని బట్టే ఉంటుంది.. అంటూ అజిత్‌ చెప్పే ప్రారంభ డైలాగు ఆయన అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ట్రైలర్ లో రోమాంటిక్ సన్నివేశాలు కూడా చూపించారు. అజిత్ సరసన కాజల్ నటిస్తోంది. ట్రైలర్‌ విడుదలైన 18 గంటల్లో ఏకంగా 40 లక్షల మంది వీక్షించడం విశేషం. 24వ తేదీన విడుదలవుతున్న సినిమా అభిమానులను ఆకట్టుకుంటుందా 

11:29 - August 8, 2017

టాలీవుడ్ లో అగ్ర హీరోలు..యంగ్ హీరోస్ తో నటించి మెప్పించిన 'కాజల్' కోలీవుడ్ లో జోరు కొనసాగిస్తోంది. 'పళని' చిత్రంతో ఆమె కోలీవుడ్ లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అనంతరం పలు చిత్రాల్లో నటించినా అక్కడి ప్రేక్షకులకు దగ్గర కాలేపోయింది. అనంతరం కొంత గ్యాప్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ రీ ఎంట్రీ ఇచ్చింది. 'తుపాకి' చిత్రంలోని నటనకు మంచి మార్కులే పడ్డాయి.

అనంతరం అగ్రహీరోల సరసన ఛాన్స్ లు దక్కించుకుంది. విజయ్..ధనుష్..విశాల్ వంటి పలువురు హీరోల సరసన నటించింది. తాజాగా 'అజిత్' హీరోగా వస్తున్న 'వివేగం' 'విజయ్' హీరోగా వస్తున్న 'మెర్సల్'..సినిమాల్లో నటిస్తోంది. టాలీవుడ్ లో 'రానా' నటించిన 'నేనే రాజు నేనే మంత్రి' అనే సినిమా తమిళంలో 'నాన్ అనైయిట్టాల్' గా విడుదల కానుంది. సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మే నటించింది. వివేగం..నాన్ అనైయిట్టాల్ సినిమాలు ఒకే నెలలోనే విడుదల కానున్నాయి. ఈ రెండూ ద్విభాషా చిత్రాలే కావడం విశేషం. మరి ఈ చిత్రాలతో మరిన్ని ఛాన్స్ లు కొట్టేస్తుందా ? లేదా ? అనేది చూడాలి. 

12:50 - June 1, 2017

కోలీవుడ్ స్టార్ హీరో 'అజిత్' సినిమా కోసం ఆయన అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తుంటారు. ఆయన స్టైల్..ఆకట్టుకొనే వస్త్ర ధారణ..ఫైట్లతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న 'వివేగం' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన టీజర్ రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. కానీ ఆయన షూటింగ్ పాల్గొంటుండగా గాయపడినట్లు వార్తలు వెలువడుతున్నాయి. యూరప్ లో జరుగుతున్న షూటింగ్ లో ‘అజిత్’ పాల్గొన్నట్లు..డూప్ లేకుండానే పలు సన్నివేశాల్లో ఆయన పాల్గొంటున్నారని తెలుస్తోంది. కొంత ఎత్తు నుంచి 'అజిత్' కింద పడడంతో భుజానికి గాయాలైనట్లు సమాచారం. 'అజిత్‌'కు వెంటనే ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారని తెలుస్తోంది. గాయాల తీవ్రతపై స్పష్టమైన సమాచారం లేదు. 'అజిత్' ఇంటర్ పోల్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరో 'వివేక్ ఒబెరాయ్' విలన్ గా నటిస్తున్నాడు.

13:30 - May 15, 2017

వరుస హిట్స్ తో తనదైన శైలిలో నటనతో అలరిస్తున్న సీనియర్ హీరో 'అజిత్' న్యూ మూవీ 'వివేగం' రికార్డులు సృష్టిస్తోంది. మాస్ స్పెషలిస్టు శివ దర్శకత్వంలో 'వివేగం' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయస్థాయిలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 11వ తేదీ అర్ధరాత్రి 12.01 గంటలకు విడుదలైన టీజర్ 12 గంటల వ్యవధిలోనే 'కబాలి' టీజర్ వ్యూస్ రికార్డును బద్ధలు కొట్టింది. తాజాగా 'కబాలి' టీజర్ కు సంబంధించిన మరో రికార్డూను సైతం దాటేసింది. ‘కబాలి' టీజర్ విడుదలైన 72గంటల్లో కోటి మంది వీక్షించారు. 68గంటల్లోనే కోటి మంది వ్యూయర్స్ 'వివేగం' టీజర్ ను తిలకరించారు. హాలీవుడ్ స్థాయిలో అద్భుతంగా రూపొందిన ఈ చిత్రంలో అజిత్ లుక్..డైలాగ్స్ లకు అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ‘వివేగం' సృష్టిస్తున్న హంగామాతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మాధ్యమాల్లో పలు పోస్టులు చేస్తున్నారు. ఆగస్టులో వస్తున్న ఈ చిత్రం ఇంకా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.

14:48 - May 11, 2017

కోలీవుడ్ లో స్టార్ హీరోల్లో ఒకరైన 'అజిత్' తాజా చిత్రం 'వివేగం'పై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఇటీవలే విడుదలైన టీజర్ అంచనాలు మించి వ్యూస్ వస్తున్నాయి. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో 'అజిత్' సరసన 'కాజల్' నటిస్తోంది. భారీ యాక్షన్ సీన్స్ తో రూపొందిన టీజర్ అభిమానులను విశేషంగా ఆకర్షిస్తోంది. 'అజిత్' ఇంటర్ పోల్ అధికారిగా నటిస్తుండగా బాలీవుడ్ హీరో 'వివేక్ ఒబెరాయ్' విలన్ గా నటిస్తున్నారు. రిలీజ్ అయిన 12 గంటల్లో ఈ చిత్ర టీజర్ కి 5 మిలియన్ల పైనే వ్యూస్ లభించాయి. ఇప్పటి వరకు 'కబాలి' చిత్రంపైనే ఈ రికార్డు ఉంది. తాజాగా 'వివేగం' టీజర్ దీనిని బ్రేక్ చేసి సౌత్ ఇండియన్ మూవీకి ఓ బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. మరి చిత్ర విడుదలయైన తరువాత ఎలాంటి రికార్డ్స్ సృష్టిస్తుందో వేచి చూడాలి.

08:48 - April 7, 2017

తమిళనాడులో రజనీకాంత్ తరువాత అంతటి ఫాలోయింగ్ ఉన్న నటుల్లో 'అజిత్' ఒకడు. తల అని ముద్దుగా పిలుస్తుంటారు. వైవిధ్యమైన కథలు..స్టన్నింగ్ లుక్స్ తో అభిమానులను అలరిస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న 'వివేగం' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో వివేక్ ఓబేరాయ్ విలన్ గా నటిస్తుండగా కాజల్ అగర్వాల్, అక్షర హాసన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంపై పలు లుక్స్ విడుదలైనా అభిమానులను అంతగా ఆకట్టుకోలేదని చిత్ర యూనిట్ భావించినట్లు సమాచారం. అందుకని మరొక లుక్ విడుదల చేశారు. ఈ లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకొంటోంది. మే 1 న అజిత్ బర్త్ డే ఉన్నందున అభిమానులకు గిఫ్ట్ గా టీజర్ ని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ లో విడుదల చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.

Pages

Don't Miss

Subscribe to RSS - అజిత్