అత్యాచారం

10:18 - January 21, 2018

యాదాద్రి : కామాంధులు రెచ్చిపోతున్నారు. పసిపిల్లలపై దారుణంగా ప్రవర్తిస్తున్నారు. సభ్యసమాజం తలదించుకొనే ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. నాలుగేళ్ల బాలికపై కామాంధుడు రెచ్చిపోయాడు. రాజుపేట మండలంలోని బేగంపేటలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. తల్లిదండ్రులు పోలానికి వెళ్లిన సమయంలో కాంపౌడర్ గా పనిచేసే మహేష్ ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండు రోజుల క్రితమే జరిగినట్లు సమాచారం. జ్వరంతో బాధ పడుతుండగా తల్లిదండ్రులు ఆరా తీయగా ఈ ఘోరం బయటపడింది. అత్యాచారం చేసిన మహేష్ పై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు కోరుతున్నాయి.

17:58 - January 4, 2018

పెద్దపల్లి : నిర్భయ లాంటి కఠిన చట్టాలొచ్చినా ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. ఏ మాత్రం అవకాశం దొరికినా మృగాళ్లు చెలరేగిపోతున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన 16 ఏళ్ల బాలికపై.. కడంబాపూర్‌కు చెందిన పెద్ది నగేష్‌ లైంగికదాడికి తెగబడ్డాడు. కనుకుల అటవీ ప్రాంతంలో కట్టెలు ఏరేందుకు వెళ్లిన మైనర్‌కు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చిన నగేష్‌ అత్యాచారం చేశాడు. ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. అయితే రాజీ కుదిర్చేందుకు స్థానికంగా ఉన్న పెద్దమనుషులు విఫలయత్నం చేశారు. నెల రోజుల తర్వాత బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

17:24 - January 2, 2018

చిత్తూరు : జిల్లా వి.కోట మండలం శివునికుప్పంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో తల్లిపై కుమారుడు అత్యాచారం చేసి హత్య చేశాడు. గ్రామస్తులు నింధితుడు సుబ్రమణ్యంను స్తంభానికి కట్టేసి చితకబాదారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

10:31 - December 26, 2017

జగిత్యాల/కరీంనగర్ : జిల్లా రాయకల్ మండలం మైతాపూర్ లో దారుణం చోటుచేసుకుంది. 8న తరగతి విద్యార్థినిపై అత్యాచారం జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్యాచార నింధితుల్లో మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. మరో నింధితుడు విజయ్ పరారీలో ఉన్నాడు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

17:58 - December 13, 2017

రంగారెడ్డి : జిల్లా నార్సింగ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అల్కపురి టౌన్‌షిప్‌లో దారుణం చోటుచేసుకుంది. అయిదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి ఆపై హత్య చేశాడో యువకుడు. మధ్యప్రదేశ్‌కి చెందిన దినేష్‌ అనే యువకుడు ఈ ఘటనకి పాల్పడ్డాడు. పాపా తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేసి.. కేసు నమోదు చేశారు.

11:41 - December 7, 2017

మెదక్ : అభం..శుభం తెలియని చిన్నారులపై కామాంధులు రెచ్చిపోతున్నారు. కన్నుమిన్ను కానక వ్యవహరిస్తున్నారు కొందరు దుర్మార్గులు. తాజాగా ఓ ఆరేళ్ల బాలికపై కామాంధుడు అత్యాచారం జరిపి హత్యకు పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం పొట్ట చేత పట్టుకుని మనోహార్ బాద్...ముప్పేటి మండలానికి వచ్చి నివాసం ఉంటోంది. ఈ కుటుంబానికి చెందిన ఆరేళ్ల బాలిక ఖుష్బూ కిడ్నాపైంది. బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడిపై అనుమానం వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి విచారించారు. మద్యం మత్తులో ఉండడంతో ఎలాంటి విషయాలు వెల్లడించలేదు. గురువారం జరిగిన ఘోరం వెల్లడించాడు. మిషన్ భగీరథ పైపులో దాచిపెట్టిన బాలిక మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకన్నారు. తమ కుమార్తె మృతి చెందిందని తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

19:14 - December 4, 2017

భూపాలపల్లి : జిల్లాలో అత్యంత దారుణం జరిగింది. జిల్లాలోని రేగొండ మండలం గోరికొత్తపల్లిలో రేష్మ అనే చిన్నారి పై గుర్తుతెలియని దుండగులు అత్యాచారం చేసి హతమార్చారు. రాజు, ప్రవళిక దంపతుల కూతురు రేష్మ నిన్న పెళ్లి ఊరేగింపుకు వెళ్లి అదృశ్యమైంది. ఈ రోజు ఊరి పొలాల్లో ఆ చిన్నారి శవమై కనబడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

08:14 - November 25, 2017

నల్గొండ : జిల్లాలో ఓ ఆర్టీసీ డ్రైవర్ ఘాతుకం వెలుగులోకి వచ్చింది. మహిళపై అత్యాచారయత్నం చేయబోయి నిప్పంటించి పరరాయ్యాడు. ఇందులో రెండు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఘటన చండూరు (మం) బోడనపర్తిలో చోటు చేసుకుంది. భర్త మృతి చెందడంతో అరుణ అనే మహిళ 8 ఏళ్ల బాబు..పాపతో నివాసం ఉంటోంది. కూలి పని చేసుకుంటూ జీవనాన్ని నెట్టుకొస్తోంది. ఈమెపై ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తున్న నర్సింహగౌడ్ కన్నేసినట్లు తెలుస్తోంది. పలుమార్లు లైంగికంగా వేధించినట్లు సమాచారం. ఈ క్రమంలో బుధవారం రాత్రి నర్సింహగౌడ్ ఆమెపై అత్యాచారయత్నం చేసేందుకు ప్రయత్నించాడు. అరుణ ప్రతిఘటించడంతో ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించి పరారైనట్లు తెలుస్తోంది. ఇందులో మరో వాదన కూడా వినిపిస్తోంది. తనపై ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడవద్దని..లేనిపక్షంలో తాను కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని అరుణ చెప్పినట్లు వాదన వినిపిస్తోంది. అప్పటికే కిరోసిన్ పోసుకున్న అరుణకు నర్సింహగౌడ్ నిప్పంటించినట్లు సమాచారం. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపులు చేపడుతున్నారు. అరుణ చనిపోవడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారిపోయారు. వీరికి న్యాయం చేయాలని..నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మరి పిల్లలకు న్యాయం జరుగుతుందా ? లేదా ? అనేది చూడాలి. 

11:47 - November 22, 2017

హైదరాబాద్ : కుషాయిగూడలో దారుణం చోటు చేసుకుంది. కాప్రాలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులపై  83 ఏళ్ల వాచ్‌మెన్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. చాక్‌లెట్స్‌ ఇస్తానని చెప్పి ఇద్దరు విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మరో ఐదుగురు విద్యార్థులతో కూడా అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కుషాయిగూడ పోలీసులు వాచ్‌మెన్‌ను అరెస్ట్‌ చేశారు. వాచ్ మెన్ కు పాఠశాల చుట్టుపక్కల ఉన్న మరో వ్యక్తి సహకరించినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

10:53 - November 15, 2017

అనంతపురం : నగరంలో దారుణం జరిగింది. 22 ఏళ్ల షణ్ముఖ తన మామ కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 16 ఏళ్ల మైనర్‌పై 10 రోజులుగా అత్యాచారం చేస్తుండటంతో బాలిక తన తల్లిదండ్రులకు చెప్పుకుంది. దీంతో పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారించి షణ్ముఖను అదుపులోకి తీసుకున్నారు. షణ్ముఖపై కేసు నమోదైంది. వైద్య పరీక్షల కోసం బాలికను అనంతపురం ఆసుపత్రికి తరలించారు. రాజకీయ పలుకుబడితో డబ్బులు ఇచ్చి అత్యాచారం కేసును పక్కదారి పట్టించాలని చూస్తున్నారని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసును నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని చెబుతున్నారు. షణ్ముఖ బాలికకు మేనమామ కాబట్టి పెళ్లి చేస్తే సరిపోతుందని చెప్పారు. లేకుంటే తాము ఆత్మహత్య చేసుకుంటామని బాలిక తల్లిదండ్రులు హెచ్చరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

Pages

Don't Miss

Subscribe to RSS - అత్యాచారం