అనారోగ్యం

12:13 - August 16, 2018

ఢిల్లీ : మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆరోగ్యం విషమంగానే ఉందని ఎయిమ్స్‌ వైద్యులు ప్రకటించారు. బుధవారం రాత్రి మాదిరిగానే ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తాజాగా విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం వాజ్‌పేయికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. వాజ్‌పేయిని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పరామర్శించారు. ఇక అమిత్‌షా, జేపీ నడ్డా ఆస్పత్రిలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. నిన్న వాజ్‌పేయిని పరామర్శించిన ప్రధాని మోదీ... ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు వాజ్‌పేయిని పరామర్శించేందుకు పలువురు ప్రముఖులు ఎయిమ్స్‌కు వస్తున్నారు. కాసేపట్లో వాజ్‌పేయిని పరామర్శించేందుకు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రానున్నారు. ఇక వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో బీజేపీ నేతలు పలు కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. మరోవైపు బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు అత్యవసరంగా ఢిల్లీ రావాలని బీజేపీ అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

17:39 - July 31, 2018

తమిళనాడు : చెన్నై కావేరి ఆస్పత్రిలో కరుణానిధికి చికిత్స కొనసాగుతోంది. అయితే.. గతంలో కంటే ఆరోగ్య పరిస్థితి మెరుగైనట్లు వైద్యులంటున్నారు. ఎలాంటి పరికరాల సాయం లేకుండానే కరుణానిధి శ్వాస తీసుకుంటున్నట్లు తెలిపారు. కరుణానిధి కిడ్నీ, లివర్‌, మూత్రనాళాల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు.. బీపీ డౌన్‌ కాకుండా వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు పలువురు ప్రముఖులు ఆస్పత్రికి వచ్చి కరుణానిధిని పరామర్శిస్తున్నారు. కరుణానిధిని రాహుల్‌గాంధీ పరామర్శించారు. మరోవైపు కావేరి ఆస్పత్రి వద్దకు భారీగా అభిమానులు తరలివచ్చారు. కరుణానిధి కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

 

16:52 - July 30, 2018

చెన్నై : కరుణానిధి ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నారు. ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు ప్రముఖులు ఆస్పత్రికి వస్తున్నారు. కరుణానిధిని ఉదయం సీఎం పళనిస్వామి పరామర్శించారు. కరుణానిధి కోలుకుంటున్నారని పళనిస్వామి తెలిపారు. కరుణానిధి క్రమంగా కోలుకుంటున్నారని స్టాలిన్ అన్నారు. ఆస్పత్రి వద్దకు భారీగా అభిమానులు, కార్యకర్తలు చేరుకున్నారు. 

20:30 - July 29, 2018

చెన్నై : అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత కరుణానిధిని పలువురు ప్రముఖులు పరామర్శించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ... డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు, కరుణానిధి కుమారుడు స్టాలిన్‌ను కలిసి తండ్రి ఆరోగ్యంపై ఆరా తీశారు.  సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితోపాటు టీఎంసీ ఎంపీ డెరిక్‌ ఓబెయ్రిన్‌, బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు కరుణానిధిని పరామర్శించారు. కరుణానిధి కుమార్తె, డీఎంకే ఎంపీ కనిమొళి, స్టానిన్‌ను కలిసి  కరుణానిధి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. కరుణానిధి తొందరగా కోలుకోవాలని ప్రార్థించారు. 

17:43 - July 28, 2018

హైదరాబాద్ : ప్రముఖ సినీనటి అన్నపూర్ణ కుమార్తె కీర్తి అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న వెంకటకృష్ణ సాయితో కీర్తికి మూడేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం శ్రీనగర్‌ కాలనీలోని కృష్ణా బ్లాక్‌లో కీర్తి నివాసం ఉంటున్నారు. ఇదిలా ఉండగా, బెంగళూరులో ఉన్న వెంకటకృష్ణ తెల్లవారుజామున రెండు గంటలకు ఇంటికి వచ్చారు. ఆ సమయంలో కీర్తి నిద్రపోతుండటంతో ఆయన వేరే గదిలో పడుకొన్నారు. ఉదయం నిద్ర లేచే సరికి కీర్తి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించినట్లు ఆయన తెలిపారు. వెంటనే పక్కనే గోదావరి బ్లాక్‌లో నివాసం ఉంటున్న అన్నపూర్ణకు సమాచారం ఇచ్చి, అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా కీర్తి ఆరోగ్యం సరిగా లేదని.. దీనికి సంబంధించి మందులు సైతం తీసుకుంటున్నారని వెంకటకృష్ణ పోలీసులకు వివరించారు. మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసినట్లు బంజారాహిల్స్‌ పోలీసులు తెలిపారు.

20:46 - July 5, 2018

మోడీ నమ్మించి మోసం జేశిండన్న చంద్రాలు..మరి నువ్వు మేనిఫెస్టోతోని నమ్మియ్యలేదా..?, మీడియాకు క్లాసులు జెప్తున్న కుందురు జానాలు..ఏవార్తలు ఏయాలే ఏది ఎయ్యొద్దు అనే టాపిక్, కౌన్సిలర్లను బెదిరిస్తున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే..కాల్ రికార్డు లీకై.. కంపు కంపైన కారు పార్టీ, లంచం ఇస్తెనే పాసు బుక్కులు ఇస్తరట..
చిట్యాల ఎమ్మార్వో ఆఫీసుల బాగోతాలు, అనారోగ్యం పాలై గ్యారేజీకి జేర్న అంబులెన్సు...డాక్టరుగారికే జరమొచ్చినట్టున్నది కథ, పిల్లలతోని జెడలేపిచ్చుకుంటున్న టీచర్..విద్యాశాఖ మంత్రి జిల్లాల పార్వతి టీచర్... ఈ అంశాలను మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

07:05 - May 11, 2018

హైదరాబాద్ : లూపస్‌... ఇదో అంతు చిక్కని జబ్బు.. ఎందుకొచ్చింది.. ఎలా వచ్చిందో కూడా తెలుసుకోలేని మాయదారి రోగం. పూర్తిగా నివారణ లేని... ఈ ప్రాణాంతక లూపస్‌ డిసీజ్‌పై టెన్‌టీవీ కథనం..మనిషిలోని వ్యాధి నిరోధక శక్తిని దెబ్బతీసే లూపస్‌ వ్యాధి ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. ఇది రోజురోజుకూ విస్తరిస్తోంది. ఒకప్పుడు ఒకరిద్దరిలో మాత్రమే కనిపించిన ఈ వ్యాధి ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయింది. కేవలం ఒక్క నిమ్స్‌ ఆసుపత్రిలోనే సుమారు రెండున్నర వేలకు పైగా లూపస్‌ వ్యాధిగ్రస్తులు వైద్యులను సంప్రదిస్తున్నారంటే.. దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
లూపస్‌ వ్యాధి నేరుగా శరీరంలోని అవయవాలకు హాని చేస్తుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ముఖ్యంగా మూత్ర పిండాలు, ఊపిరితిత్తులు, గుండెపైన ఎక్కువ ప్రభావం చూపుతుందంటున్నారు. 15 నుంచి 35 ఏళ్ల మహిళలకు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాగా మగవారిలో పదిశాతం మాత్రమే వస్తుందని వైద్యులు చెబుతున్నారు.

ఈ వ్యాధి లక్షణాలు ఒక్కో వ్యక్తిలో ఒక్కో రకంగా ఉంటాయి. రెండు వారాలకు పైగా విపరీతమైన జ్వరం, నోట్లో పొక్కులు, చర్మంపై ఎర్ర మచ్చలు, చిన్నవయసులోనే కీళ్ళ నొప్పులు రావడం, జుట్టు రాలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని లూపస్‌ వ్యాధి గుర్తించాలంటున్నారు వైద్యులు. రుమటాలజిస్ట్‌ను కానీ, ఫిజిషియన్‌ కానీను సంప్రదించాలని సూచిస్తున్నారు. లూపస్‌ రావడానికి జెనిటిక్‌ కారణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. కాలుష్యం, ఎక్కువగా ఎండలో ఉండే వారికి కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

13:08 - April 9, 2018

ఢిల్లీ : హస్తినలో దీక్షచేస్తున్న వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం మరింతగా క్షీణించింది. దీంతో ఆయన్ను దీక్షా శిభిరం నుంచి ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికే ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్‌కు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అటు ఇప్పటికీ ఏపీ భవన్‌ వద్ద  ఎంపీలు అవినాశ్‌రెడ్డి, మిథున్‌రెడ్డి తమ దీక్షను కొనసాగిస్తున్నారు. 

12:45 - March 9, 2018

ఎండాకాలం వచ్చేసింది..ఇప్పటి నుండే ఎండలు మండిపోతున్నాయి. దీనితో ఆరోగ్యంపై ఒకింత శ్రద్ధ కనబర్చాల్సి ఉంటుంది. ముఖ్యంగా నీటిని ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో డీ హైడ్రేషన్ కు గురవుతుంటారు. నీరు ఎక్కువగా దొరికే వాటిలో 'కీర' ఒకటి. ఇది ఆరోగ్యానికి మంచి ఔషధం అని చెప్పవచ్చు.

  • కీరను ప్రతి రోజు తీసుకోవడం వల్ల పొట్ట శుభ్రపడుతుంది. కిడ్నీలోని రాళ్లను కరిగించడంలో బాగా పనిచేస్తుంది.
  • పాస్పరస్‌, విటమిన్లు, పోటాషియం, నీటి శాతం, మెగ్నీషియం, మినరల్స్‌, జింక్‌, ఐరన్‌, కాల్షియంలు పుష్కలంగా ఉంటాయి.
  • ప్రతి రోజు రెండు గ్లాసుల కీరా జ్యూస్ తాగితే కడుపు నొప్పి..అల్సర్ వంటి సమస్యలు దూరం అవుతాయి.
  • కీరలో 95 శాతం నీరు ఉండడం వల్ల శరీరానికి చల్లదనం అందిస్తుంది.
  • వేసవిలో కీర ముక్కలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదిని వైద్యులు పేర్కొంటుంటారు. 
12:52 - February 28, 2018

జామకాయ...ఇది తింటే జలుబు అధికమౌతుందని కొంతమంది అనుకుంటుంటారు. కానీ జామ పండు తినడం వల్ల జలుబుకు చెక్ పెట్టవచ్చని పలువురు పేర్కొంటున్నారు. ఇందులో బి3, బి6 విటమిన్లు మెదడుకు రక్త సరఫరాను పెంచి, మెదడు పని తీరును మెరుగుపరుస్తాయి. జామ పండుతో పాటు దీని ఆకులు కూడా ఆరోగ్యానికి..అందానికి ఉపయోగించుకోవచ్చు

ఆర్థరైటిస్‌ సమస్యతో బాధపడేవారు జామ ఆకులను ముద్దగా నూరి... నొప్పి ఉన్నచోట పెడితే ఉపశమనం లభిస్తుంది. పచ్చి జామకాయను ముద్దలా నూరి నుదుటి మీద పెట్టుకొంటే తలనొప్పి..మైగ్రేన్ సమస్య తగ్గుతుంది. గింజలు తీసిన జామకాయ ముక్కలకు పంచదార కలిపి, వాటిని మెత్తగా ఉడికించి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. దీంతో వీరి గుండె పనితీరు మెరుగుపడుతోంది. జామను ఎక్కువగా తినేవారి చర్మం ఎలాంటి మచ్చలు, ముడుతలు లేకుండా మెరుస్తూ.. ఉంటుంది. వృద్ధాప్య‌ చాయలను దూరం చేస్తోంది.

Pages

Don't Miss

Subscribe to RSS - అనారోగ్యం